ఆడవారికి పీరియడ్స్ రావడం ఒక సహజమైన ప్రక్రియ. చాలామందికి పీరియడ్స్ టైంలో ఒకరకమైన నొప్పి కూడా ఉంటుంది. అది కొందరిలో తీవ్రస్థాయిలో ఉంటుంది. మరికొందరికి నార్మల్ గా ఉంటుంది. అయితే ఈ నొప్పికి మందులు వాడటం అంత మంచిది కాదంటారు నిపుణులు. మరి సహజంగా ఎలా తగ్గించుకోవాలో ఇక్కడ చూద్దాం.
మహిళలకు ప్రతి నెలా పీరియడ్స్ రావడం సహజం. అయితే ఈ టైంలో వారు ఒకరకమైన నొప్పిని అనుభవిస్తుంటారు. ఈ నొప్పి వారి మానసిక స్థితిని దెబ్బతీస్తుంది. నొప్పి తగ్గడానికి చాలామంది ట్యాబ్లెట్స్ వాడుతుంటారు. కానీ అవి ఆరోగ్యానికి అంత మంచిది కాదని నిపుణులు చెబుతుంటారు. మరి సహజంగా ఈ నొప్పిని ఎలా తగ్గించుకోవాలో ఇక్కడ తెలుసుకుందాం.
25
యోగా
నడక, యోగా వంటి వ్యాయామాలు ఎండార్ఫిన్ హార్మోన్ విడుదలకు సహాయపడతాయి. ఇవి శరీరానికి విశ్రాంతినిచ్చి నొప్పి నుంచి ఉపశమనం కలిగిస్తాయి.
35
హెర్బల్ టీ
పీరియడ్స్ టైంలో నొప్పి ఎక్కువగా ఉంటే.. అల్లం, కేమోమిలే టీలు తీసుకోవచ్చు. వీటిలో యాంటీ ఇన్ఫ్లమేటరీ లక్షణాలు కలిగి ఉంటాయి. వీటిని రోజూ తాగితే నొప్పి, ఉబ్బరం తగ్గుతాయి.
45
కెఫీన్ తక్కువగా తీసుకోండి
పీరియడ్స్ టైంలో కెఫీన్, ఉప్పు తక్కువగా తీసుకోవాలి. కెఫీన్ నొప్పిని పెంచుతుంది. ఆరోగ్యకరమైన ఆహారం నొప్పిని తగ్గిస్తుంది.
55
ఐరన్ అధికంగా ఉండే ఫుడ్స్
పీరియడ్స్ సమయంలో మెగ్నీషియం, ఐరన్ అధికంగా ఉండే ఆహారాలు తీసుకోవాలి. పాలకూర, అరటిపండు, ఆకుకూరలు శరీరానికి బలాన్నిస్తాయి.