Mangoes: వేసవిలో మామిడి పళ్లు తినడం కామన్. కాని.. మామిడి కాయలు తినడం వల్ల చాలా లాభాలున్నాయని మీకు తెలుసా? పచ్చి మామిడి తినడం వల్ల అనేక వ్యాధులు, రోగాలు నయం అవుతాయని డాక్టర్లు చెబుతున్నారు. అవేంటో ఇప్పుడు తెలుసుకుందాం.
వేసవి కాలం వచ్చిందంటే ఎక్కడ చూసినా మామిడి పళ్లు కనిపిస్తుంటాయి. ఈ సీజన్లో మామిడి పండ్లు ఎక్కువగా తింటారు. పండిన మామిడి చాలా రుచిగా ఉంటుంది. కానీ పచ్చి మామిడి కూడా అంతే రుచిగా ఉంటుంది. పుల్లపుల్లగా, తియ్యగా ఉండే పచ్చి మామిడి ఆరోగ్యానికి కూడా చాలా మంచిదని డాక్టర్లు చెబుతున్నారు. పచ్చి మామిడిని మీ డైట్ లో చేర్చుకుంటే చాలా లాభాలు పొందవచ్చు.
25
ఇమ్యూనిటీ పెరుగుతుంది
పచ్చి మామిడిలో విటమిన్ సి అధికంగా ఉంటుంది. దీన్ని తినడం వల్ల రోగనిరోధక శక్తి పెరుగుతుంది. పచ్చి మామిడిలో యాంటీఆక్సిడెంట్లు కూడా పుష్కలంగా ఉంటాయి. ఇవి ఫ్రీ రాడికల్స్ నుండి రక్షణ కల్పిస్తాయి.
వేడి దెబ్బల నుండి రక్షణ
వేసవిలో వేడి దెబ్బలు ఎక్కువగా తగులుతుంటాయి. పచ్చి మామిడి తినడం వల్ల శరీరం చల్లబడుతుంది. మామిడి కాయలు డీహైడ్రేషన్ నుండి కాపాడతాయి. పచ్చి మామిడితో జ్యూస్ చేసుకుని తాగితే శరీరం చల్లబడుతుంది.
35
జీర్ణక్రియకు సహాయపడుతుంది
పచ్చి మామిడి జీర్ణవ్యవస్థను బలోపేతం చేస్తుంది. ఇందులో ఉండే ఫైబర్, పెక్టిన్ మలబద్ధకం, గ్యాస్, అజీర్తి సమస్యలను తగ్గిస్తాయి. పచ్చి మామిడిని ఉప్పు, మిరియాలతో కలిపి తింటే జీర్ణక్రియ మెరుగుపడుతుంది. ఆకలి కూడా పెరుగుతుంది.
45
లివర్ ను శుభ్రపరుస్తుంది
పచ్చి మామిడి లివర్ కు చాలా మంచిది. ఇది లివర్ ను శుభ్రపరుస్తుంది. పైత్యరస ఉత్పత్తిని నియంత్రిస్తుంది. దీనివల్ల శరీరం నుండి విష పదార్థాలు బయటకు వెళ్లిపోతాయి.
55
చర్మం, జుట్టుకు మంచిది
పచ్చి మామిడిలో ఉండే యాంటీఆక్సిడెంట్లు, విటమిన్లు చర్మం, జుట్టును ఆరోగ్యంగా ఉంచుతాయి. ఇది శరీరంలోని విష పదార్థాలను బయటకు పంపి, చర్మానికి కాంతిని, జుట్టు రాలడాన్ని తగ్గిస్తుంది.