Published : Sep 28, 2025, 12:10 PM ISTUpdated : Sep 28, 2025, 12:21 PM IST
Mutton Curry: మనలో చాలామంది మటన్ కూరను ఇష్టంగా తింటారు. ఆదివారం వచ్చిందంటే చాలు మటన్ కర్రీ ఉండాల్సిందే. మటన్ ఆరోగ్యానికి మంచిదే అయినప్పటికీ కొన్ని సమస్యలున్నవారు దీన్ని తినకపోవడమే మంచిదట. ఎవరు తినకూడదు.. ఎందుకు తినకూడదో ఇక్కడ తెలుసుకుందాం.
మటన్.. పేరు వినగానే చాలామందికి నోరూరుతుంది. కారణం దాని అద్భుతమైన రుచే. అంతేకాదు మటన్ లో పోషకాలు కూడా ఎక్కువే. ఆరోగ్యానికి మంచిది కాబట్టి ఎక్కువ మంది మటన్ వెరైటీస్ తినడానికి ఇష్టపడతారు. కొందరు రెగ్యులర్ గా తింటారు. మరికొందరు వారానికి ఒకసారి తింటుంటారు. మటన్ ఆరోగ్యానికి మంచిదే అయినప్పటికీ కొన్ని సమస్యలున్నవాళ్లు అస్సలు తినకూడదట. ఎందుకు తినకూడదు.. తింటే ఏమవుతుందో ఇక్కడ తెలుసుకుందాం.
24
హై బీపి ఉన్నవారు
మటన్‌లో కొలెస్ట్రాల్, శాచురేటెడ్ ఫ్యాట్ మోతాదు ఎక్కువగా ఉంటుంది. ఇది రక్తనాళాల్లో ఒత్తిడిని పెంచుతుంది. ఫలితంగా రక్తపోటు పెరుగుతుంది. గుండె సమస్యలకు దారి తీస్తుంది. కాబట్టి హై బీపి ఉన్నవారు మటన్ తినకపోవడమే మంచిదని నిపుణులు సూచిస్తున్నారు.
కిడ్నీ వ్యాధులు ఉన్నవారు
మటన్ లో ప్రోటీన్ అధికంగా ఉంటుంది. దీన్ని తినడం వల్ల కిడ్నీలపై అదనపు ఒత్తిడి పడుతుంది. కిడ్నీ పనితీరు తగ్గుతుంది. క్రియాటినిన్ లెవెల్స్ పెరుగుతాయి. ఎందుకంటే కిడ్నీ సమస్యలున్నవారిలో కిడ్నీలు ఆహారం నుంచి వ్యర్థాలను సరిగ్గా తొలగించలేవు. దానివల్ల శరీరంలో వ్యర్థాలు పేరుకుపోతాయి. కిడ్నీలో రాళ్లు ఏర్పడే ప్రమాదం కూడా పెరుగుతుంది. కాబట్టి కిడ్నీలో రాళ్ల సమస్య ఉన్నవారు మటన్ వంటి మాంసాహారాలకు ఎంత దూరంగా ఉంటే అంత మంచిదని నిపుణులు చెబుతున్నారు.
34
లివర్ సమస్యలు ఉన్నవారు
మటన్ లో ప్రోటిన్, కొవ్వు అధికంగా ఉంటుంది. దానివల్ల లివర్‌పై భారం పెరుగుతుంది. లివర్ పనితీరు మందగిస్తుంది. విరేచనాలు, జీర్ణ సమస్యలు వస్తాయి. కాబట్టి ఫ్యాటీ లివర్ సమస్య ఉన్నవారు మటన్ తినకపోవడమే మంచిది.
గుండె జబ్బులు ఉన్నవారు
మటన్‌లోని అధిక కొవ్వు పదార్థాలు గుండె ఆరోగ్యానికి మంచిదికాదు. ఇవి గుండె జబ్బుల ప్రమాదాన్ని పెంచుతాయి. మటన్ లేదా కొవ్వు ఎక్కువగా ఉండే పదార్థాలను గుండె జబ్బులున్నవారు తినడం తగ్గించాలి. లేదా వైద్యుల సలహా తీసుకున్న తర్వాత వారు సూచించిన మోతాదులో తీసుకోవడం ఉత్తమం.
అధిక బరువుతో బాధపడేవారు మటన్ కి దూరంగా ఉండాలి. మటన్ తినడం వల్ల శరీరంలో ఎక్కువ కేలరీలు చేరి బరువు పెరిగే ప్రమాదం ఉంటుంది. డయాబెటిస్, బీపీ, కీళ్ల నొప్పులు వచ్చే అవకాశం ఉంది.
గర్భిణీలు, చిన్న పిల్లలు, వృద్ధులు
గర్భిణీలు, పిల్లలు, వృద్ధులు మటన్ ని మితంగా తినవచ్చు. అధికంగా తింటే వారికి జీర్ణ సమస్యలు వచ్చే ప్రమాదం ఉంది. గ్యాస్, అసిడిటీ వంటి జీర్ణసమస్యలు ఉన్నవారు సైతం మటన్ జోలికి వెళ్లకపోవడమే మంచిదని నిపుణులు సూచిస్తున్నారు.