అధిక రక్తపోటు ప్రమాదకరమన్న సంగతి అందరికీ తెలుసు. కానీ తక్కువ రక్తపోటు కూడా డేంజర్ అన్న ముచ్చట మాత్రం చాలా మందికి తెలియదు. ఇది కూడా మన ఆరోగ్యాన్నిరిస్క్ లో పడేస్తుంది. బీపీ తక్కువగా ఉంటే మన మెదడుకు, కాలేయానికి, గుండెతో పాటుగా అనేక ఇతర అవయవాలకు ఆక్సిజన్ సరిగ్గా చేరదు. దీని వల్ల ఈ ఇంద్రియాలు దెబ్బతింటాయి. లేదా పనిచేయడం మానేస్తాయి. ఇది ఆరోగ్యానికి అస్సలు మంచిది కాదు. తక్కువ రక్తపోటును వైద్య భాషలో హైపోటెన్షన్ అని అంటారు. సాధారణ రక్తపోటును 120/80గా పరిగణిస్తారు.
blood pressure
తక్కువ రక్తపోటు లక్షణాలు
- నిలబడటంలో ఇబ్బంది, తరచూ స్పృహ కోల్పోవడం
- తలలో చల్లని అనుభూతి
- అలసటగా అనిపించడం
- చర్మం చల్లబరచడం, పసుపు రంగులోకి మారడం
blood pressure
-ఆందోళన
- చెమట ఎక్కువగా పట్టడం, బలహీనత
బీపీ ఎందుకు పడిపోతుంది?
వ్యాయమం ఎక్కువగా లేదా శారీరక కార్యకలాపాలు చేయడం
మందులను ఎక్కువగా తీసుకోవడం
చాలా రోజుల నుంచి లూజ్ మోషన్ సమస్య
వేడి లేదా వడదెబ్బ కారణంగా
ఎక్కువ రక్తస్రావం
శరీర ఉష్ణోగ్రత తగ్గడం
ప్రెగ్నెన్సీ వల్ల కూడా లోబీపీ సమస్య వస్తుంది.
blood pressure
ఇలాంటప్పుడు ఏం చేయాలి?
ప్రతి అరగంటకోసారి బీపీని చెక్ చేసుకోవాలి. ముఖ్యంగా డాక్టర్ దగ్గరకు వెళ్లే వరకు..
నేలపై పడుకోండి కాని తల కింద దిండు పెట్టకూడదు
పాదాలలో 2 నుంచి 3 యూనిట్ల రక్తం ఉంటుంది. అందుకే రక్తం సులభంగా తలకు చేరడానికి రెండు పాదాల కింద 3 నుంచి 4 దిండ్లను పెట్టండి
ఒకవేళ లో బీపీ కారణంగా వ్యక్తి అపస్మారక స్థితికి చేరుకుంటే.. వీళ్లకు ఎలాంటి ఆహారాలను తినిపించకూడదు. తాగించకూడదు. ఎందుకంటే ఇది ఊపిరితిత్తుల్లోకి వెళ్లి సమస్య మరింత దిగజారొచ్చు.
స్పృహలో ఉంటే వాళ్లకు ఒక గ్లాసు నీటిలో 1 నుంచి 2 టీస్పూన్ల ఉప్పు లేదా ఓఆర్ఎస్ ద్రావణాన్ని ఇవ్వండి
ఈ సమస్య ఉన్నవారు నీటిని పుష్కలంగా తాగాలి.