Weight loss Injection: 100 కేజీల బరువునైనా ఇట్టే తగ్గించే ఇంజెక్షన్.. ధరెంతంటే?

Published : Jun 30, 2025, 07:54 AM IST

Weight Loss Injection: ఈ రోజుల్లో చాలామంది ఊబకాయం, అధిక బరువుతో బాధపడుతున్నారు. కొంతమంది బరువు తగ్గడానికి నానా తంటాలు పడుతుంటారు. మరికొందరూ ఈ సమస్యకు సులభమైన పరిష్కారం కోసం చూస్తున్నారు. అలాంటి వారి కోసం ఓ మెడిసిన్ అందుబాటులోకి వచ్చింది. వివరాలు 

PREV
14
బరువు తగ్గించే ఇంజెక్షన్

ఈ మధ్యకాలంలో చాలా మంది ఊబకాయంతో బాధపడుతున్నారు. దీంతో కొంతమంది బరువు తగ్గడానికి నానా తంటాలు పడుతుంటారు. మరికొందరూ ఈ సమస్యకు సులభ, త్వరిత పరిష్కారం కోసం చూస్తున్నారు. మీ అందరికీ తెలిసినట్లుగానే కొవ్వును తగ్గించే మాత్రలు, సప్లిమెంట్స్, పౌడర్లు ఇంజెక్షన్లు ఇప్పటికే మార్కెట్లో విచ్చలవిడిగా అందుబాటులోకి వచ్చాయి. తాజాగా ఇంజెక్షన్ రూపంలో మరో మెడిసిన్ వచ్చింది. ఇంతకీ ఆ మెడిసిన్ ఏంటీ? ధర ఎంత?  

24
భారతదేశ మార్కెట్లోకి

తాజాగా అధిక బరువును తగ్గించే మరో ఔషధం భారతీయ మార్కెట్లోకి అడుగుపెట్టింది. డెన్మార్క్‌కు చెందిన నోవో నార్డిస్క్ అనే ఫార్మా కంపెనీ వెగోవీ అనే కొత్త మెడిసిన్‌ని భారత మార్కెట్లోకి విడుదల చేసింది. నోవో నార్డిస్క్ జూన్ 24న భారతదేశంలో బరువు తగ్గించే మందు వెగోవీని ప్రారంభించింది. నోవో నార్డిస్క్ ఇండియా మేనేజింగ్ డైరెక్టర్ విక్రాంత్ శ్రోత్రియా మంగళవారం ఈ మెడిసిన్‌ని విడుదల చేశారు.

34
ఊబకాయానికి చెక్

ఈ మెడిసిన్ ఇండియా మార్కెట్ లో అన్ని అనుమతులతో అందుబాటులోకి వచ్చిందని నోవో నార్డిస్క్ ఇండియా మేనేజింగ్ డైరెక్టర్ విక్రాంత్ శ్రోత్రియా తెలిపారు. ఈ నెలాఖరులోగా ఫార్మా దుకాణాల్లోనూ లభిస్తుందని చెప్పారు. అధిక బరువు, ఊబకాయం వల్ల వచ్చే ఆరోగ్య సమస్యలతో బాధపడుతున్నవారికి ఈ ఔషధం మంచి ఫలితాలనిస్తుందని అన్నారు.

44
ధరెంతంటే?

ఇక ఈ మెడిసన్ వాడకం విషయానికి వస్తే.. ఈ ఇంజెక్షన్ ను వారానికి ఒకసారి తీసుకోవాల్సి ఉంటుందని చెప్పారు. ఇక ధర విషయానికి వస్తే..  

  • 0.25 ఎంజీ, 0.5 ఎంజీ, 1 ఎంజీ డోసుల ధర నెలకు రూ. 17,345 (వారానికి రూ. 4,366) ఉంటుంది. 
  • 1.7 ఎంజీ డోసుకు నెలకు రూ. 24,280,
  • 2.4 ఎంజీ డోసుకు నెలకు రూ. 26,015 . 
Read more Photos on
click me!

Recommended Stories