Iodized Salt: మన రోజువారీ ఆహారంలో ఉప్పు తప్పనిసరి. ఉప్పులేని ఆహారాపదార్థాలు తినడం కష్టం. అయితే.. కొంతమంది అయోడైజ్డ్ ఉప్పు బదులుగా ఇతర ప్రత్యామ్నాయాలు వాడుతున్నారు. కానీ, అయోడిన్ ఉప్పు బదులుగా వేరే ఉప్పు వాడటం ప్రమాదకరమని వైద్యులు హెచ్చరిస్తున్నారు.
ఉప్పు వంటకు రుచిని ఇస్తుంది. ఉప్పు లేకుండా తినలేరు. ఇందులో అయోడైజ్డ్ ఉప్పు మన ఆరోగ్యానికి కీలకం. ఇది శరీరానికి అవసరమైన సూక్ష్మపోషకాలను అందిస్తుంది. ఇది ముఖ్యంగా థైరాయిడ్ హార్మోన్ల పనితీరుపై ప్రభావం చూపుతుంది. అందుకే భారత ప్రభుత్వం కూడా అయోడైజ్డ్ ఉప్పు తినాలని ప్రజలకు అవగాహన కల్పిస్తోంది. దీని వల్ల అయోడిన్ లోపం వల్ల వచ్చే వ్యాధులను నివారించవచ్చు.
25
అయోడిన్ లోపం వల్ల
అయోడిన్ లోపం ఉన్న పిల్లలకు నేర్చుకునే సామర్థ్యం తక్కువగా ఉంటుంది. ముఖ్యంగా ఏకాగ్రత లోపం, జ్ఞాపకశక్తి సమస్యలు వంటివి తలెత్తవచ్చు. పిల్లల శారీరక అభివృద్ధి ఆలస్యం కావచ్చు. థైరాయిడ్ హార్మోన్లు శరీరంలో శక్తి ఉత్పత్తికి సహాయపడతాయి కాబట్టి అలసట, బలహీనత కలుగుతుంది.
35
అయోడిన్ లోపం వల్ల సమస్యలు
ప్రస్తుతం అయోడిన్ తక్కువగా ఉన్న ఉప్పును ఎంచుకోవాలని తప్పుడు ప్రచారం జరుగుతుంది. దానికి బదులుగా ఇతర ప్రత్యామ్నాయాలను వెతుకుతున్నారు. అయితే.. ఈ చర్య చాలా ప్రమాదకరం. మన శరీరం అయోడిన్‌ను ఉత్పత్తి చేయలేదు. ఆహారం ద్వారా మాత్రమే పొందవచ్చు. అది కూడా ఉప్పు ద్వారానే.
కొంతమంది నిపుణులు అయోడిన్ లోపాన్ని నివారించడం అనేది టీకా వేయించుకోవడం వంటి సురక్షితమని భావిస్తున్నారు. ఉప్పులోనే కాకుండా మరికొన్ని ఆహారాల ద్వారా కూడా అయోడిన్ లభిస్తుంది. ట్యూనా వంటి చేపలు, ఎండ్రకాయలు, సముద్రపు పాచి వంటి వాటిలో అయోడిన్ పుష్కలంగా ఉంటుంది.
55
వైద్యుల సలహా
అయోడిన్ ఉప్పు అనేది అయోడిన్ లోపాన్ని నివారించడానికి సులభమైన, సురక్షితమైన , ప్రభావవంతమైన మార్గం. అయోడిన్ ఉప్పు నకు ప్రత్యామ్నాయం వెతకడం, దానిని తప్పించడం తీవ్రమైన ఆరోగ్య సమస్యలకు దారితీయవచ్చు.