నడక శరీరానికి చాలా అవసరం. అన్ని శరీర అవయవాలు, భాగాలు యాక్టివ్ గా పనిచేయాలంటే కచ్చితంగా అవసరమైనంత నడవాలి. ఎవరు ఎంత నడవాలి అనే విషయం వారి వయసు, శారీరక బలంపై ఆధారపడి ఉంటుంది. ఇక 6-6-6 నడక నియమం విషయానికొస్తే ఇది సాధారణ వాకింగ్ తర్వాత నెక్ట్ లెవర్ వాకింగ్ అని చెప్పొచ్చు. రోజూ ఒకేలా నడిచేవాళ్లు ఈ నియమాన్ని పాటిస్తే మరింత ఎక్కువ ప్రయోజనాలు పొందొచ్చు. డయాబెటిస్, గుండె సంబంధిత రోగాలు వచ్చే ప్రమాదం తగ్గడానికి 6-6-6 వాకింగ్ రూల్ సహాయపడుతుందని వైద్యులు చెబుతున్నారు.
6-6-6 వాకింగ్ రూల్ అంటే ఏమిటి?
సాధారణంగా చాలా మంది ఉదయం, లేదా సాయంత్రం వాకింగ్ చేస్తారు. 6-6-6 రూల్ ఏంటంటే ఉదయం 6 గంటలకు, సాయంత్రం 6 గంటలకు కూడా వాకింగ్ చేయాలి. అయితే నడకకు వెళ్లే ముందు, తర్వాత 6 నిమిషాలు వార్మ్ అప్, కూల్ డౌన్ వ్యాయామాలు చేయాలి. దీన్నే 6-6-6 రూల్ అంటారు.
నడిచే ముందు వార్మప్, నడిచిన తర్వాత కూల్ డౌన్ వ్యాయామాలు చేయడం వల్ల శరీరం సమతుల్యంగా ఉంటుంది. దీని వల్ల అనవసరమైన గాయాలు కాకుండా ఉంటాయి. దీన్ని పాటించడం వల్ల మొత్తం ఆరోగ్యం మెరుగుపడుతుంది.
దీన్ని కూడా చదవండి: ఇది నిజంగా మిరాకిల్ ట్రీ.. మునగతో ఇన్ని ఆరోగ్య ప్రయోజనాలా?
6-6-6 నడక నియమం వల్ల లాభాలు
ఉదయం నడవడం వల్ల జీవక్రియలు ఉత్తేజితమై రక్త ప్రసరణ మెరుగుపడుతుంది. సాయంత్రం నడక మనస్సును, శరీరాన్ని ప్రశాంతంగా ఉంచుతుంది. ప్రతిరోజు ఉదయం, సాయంత్రం 6 గంటలకు నడవడం వల్ల బరువు తగ్గుతారు. శరీరంలో ఉండే ఎక్కువ క్యాలరీలను కరిగించడానికి, కొవ్వును తగ్గించడానికి ఈ నడక సహాయపడుతుంది.
దీన్ని కూడా చదవండి: ఏప్రిల్‌లో పెళ్లిల్లే.. పెళ్లిళ్లు.. ఇన్ని ముహూర్తాలు కుదరడం చాలా అరుదు
గుండె ఆరోగ్యం:
గుండె ఆరోగ్యం:
ప్రతిరోజు నడవడం వల్ల గుండె జబ్బులు వచ్చే ప్రమాదం తగ్గుతుంది. రక్తపోటును అదుపులో ఉంచడం వల్ల గుండె సమస్యలను నివారించవచ్చు.
శరీర కింది భాగం బలంగా మారుతుంది
మన మొత్తం శరీరాన్ని మోసేది కింది భాగమే. దాన్ని బలంగా తయారు చేయడానికి నడక సహాయపడుతుంది. అందులోనూ 6-6-6 వాకింగ్ రూల్ పాటిస్తే త్వరగా ఫలితాలు చూడొచ్చు.
మనసు హాయిగా ఉంటుంది
నడవడం వల్ల మానసిక ఒత్తిడి క్రమంగా తగ్గుతుంది. మనసు ప్రశాంతంగా, హాయిగా ఉండటానికి నడక సహాయపడుతుంది.
శరీరం ఫ్లెక్సిబుల్ గా మారుతుంది
ప్రతిరోజు వార్మ్ అప్, కూల్ డౌన్ వ్యాయామాలు చేయడం వల్ల శరీరం సులభంగా వంగుతుంది. కూల్ డౌన్ వ్యాయామాలు చేయడం వల్ల కండరాల్లో ఉండే అసౌకర్యం తగ్గిపోతుంది. కండరాలు బిగుతుగా ఉండకుండా వదులుగా ఉంటాయి.
గమనిక: ఇప్పటికే వైద్య చికిత్సలో ఉన్నవాళ్లు జాగ్రత్తగా వ్యాయామం చేయాలి. ఏ కొత్త వ్యాయామం చేసినా డాక్టర్ సలహా తీసుకోవాలి.