చాలామంది ఉదయం లేవగానే ఒక కప్పు టీ లేదా కాఫీతో రోజు మొదలుపెడతారు. ఆ తర్వాత ఆఫీస్‌కి వెళ్లే తొందరలో లేకపోతే ఇంకేదైనా పని వల్ల తినకుండానే వెళ్లిపోతుంటారు. చాలామందికి ఇది అలవాటుగా మారిపోతుంటుంది. కానీ పొద్దున్నే టిఫిన్ తినకపోతే ఆరోగ్యానికి అస్సలు మంచిది కాదట. టిఫిన్ మానేస్తే వచ్చే నష్టాల గురించి ఇప్పుడు తెలుసుకుందాం.
శరీరంపై ప్రభావం:
పొద్దున్న టిఫిన్ మానేస్తే ఆ ప్రభావం శరీరంపై పడుతుంది. టిఫిన్ తినకపోవడం వల్ల బాడీలో ఏమీ లేకుండా ఖాళీగా ఉంటుంది. దీనివల్ల శరీర మార్పులు నెమ్మదిస్తాయి. ఇలాగే కంటిన్యూ చేస్తే బరువు పెరిగే అవకాశం ఉంటుంది. శరీరంలో క్యాలరీలు శక్తి కోసం కరిగే బదులు కొవ్వుగా మారడం మొదలవుతుంది. అలాగే ఆకలిని పుట్టించే హార్మోన్ లెవెల్ పెరుగుతుంది. దీనివల్ల ఎక్కువగా తినే అవకాశం ఉంటుంది.
గుండె జబ్బులు
పొద్దున్నే టిఫిన్ మానేస్తే గుండె జబ్బులు పెరిగే ప్రమాదం ఉందని కొన్ని పరిశోధనలు చెబుతున్నాయి. టిఫిన్ మానేయడం వల్ల బాడీలో ఎక్కువ కొలెస్ట్రాల్, రక్తపోటుకు దారితీస్తుంది. దీనివల్ల గుండె జబ్బులు వచ్చే ప్రమాదం ఉంది. అలాగే టిఫిన్‌లో ఎక్కువ కొవ్వు, క్యాలరీలు ఉన్న ఫుడ్స్ తిన్నా గుండె జబ్బులు పెరుగుతాయి.
శరీరంలో శక్తి తగ్గుతుంది:
ఉదయం టిఫిన్ మానేస్తే రోజంతా బాడీకి కావాల్సిన శక్తి తగ్గుతుంది. నిజానికి టిఫిన్ చాలా ముఖ్యం. పొద్దున్నే తినే ఫుడ్ బాడీకి కావాల్సిన శక్తిని, పోషకాలను అందిస్తుంది. టిఫిన్ మానేస్తే రోజంతా నీరసంగా, మందకొడిగా, ఏ పని మీద శ్రద్ధ పెట్టలేనట్టు ఉంటుంది.
పోషకాహార లోపం
టిఫిన్ మానేస్తే పోషకాహార లోపం వస్తుంది. శరీరం సరిగ్గా పనిచేయడానికి కావాల్సిన విటమిన్లు, ఖనిజాలు చాలా ముఖ్యం. కాబట్టి అవి ఉండే ఆహారాన్నిఉదయాన్నే తినడం వల్ల ఆరోగ్యంగా ఉండొచ్చు. టిఫిన్ మానేస్తే బాడీలో చాలా ముఖ్యమైన పోషకాలు కోల్పోతారు. దీనివల్ల రోగనిరోధక శక్తి తగ్గుతుంది. ఎముకల ఆరోగ్యం దెబ్బతినే ప్రమాదం ఉంటుంది.