చర్మ సౌందర్యానికి, జుట్టు ఆరోగ్యానికి విటమిన్లు చాలా అవసరం. మరీ ముఖ్యంగా విటమిన్ ఇ. చాలామంది ఇందుకోసం విటమిన్ ఇ సప్లిమెంట్స్ వాడుతుంటారు. కానీ అవి ఎంతమాత్రం మంచిది కాదు. విటమిన్ ఇ.. ఎక్కువగా ఉండే ఫుడ్స్ తీసుకోవడం ద్వారా మెరిసే చర్మం, ఒత్తైన జుట్టు పొందవచ్చు. ఆ ఫుడ్స్ ఏంటో ఇక్కడ చూద్దాం.
చర్మం, జుట్టు అందంగా ఉండాలని అందరు కోరుకుంటారు. అందుకోసం చాలామంది విటమిన్ E క్యాప్సూల్స్ వాడుతుంటారు. కానీ వాటికి బదులు విటమిన్ E ఉన్న ఆహారం తీసుకోవడం మంచిదని నిపుణులు చెబుతున్నారు. విటమిన్ E అధికంగా ఉండే ఆహారాలు ఏంటో ఇక్కడ తెలుసుకుందాం.
26
విటమిన్ E
విటమిన్ E శక్తివంతమైన యాంటీఆక్సిడెంట్. ఇది కణాలను ఆక్సీకరణ ఒత్తిడి నుంచి కాపాడుతుంది. దీనివల్ల చర్మ కణాలు ఆరోగ్యంగా ఉండి.. చర్మం మెరుస్తుంది. జుట్టు, చర్మానికి మేలు చేసే విటమిన్ E ఉన్న ఆహారాల గురించి ఇక్కడ తెలుసుకుందాం.
36
ఆరోగ్యకరమైన గింజలు
కొన్ని గింజల్లో విటమిన్ E అధికంగా ఉంటుంది. సన్ ఫ్లవర్ గింజలు, వేరుశనగలు, పిస్తా, గుమ్మడికాయ గింజలు, జీడిపప్పు, వాల్‌నట్స్ లాంటివి తినడం ద్వారా విటమిన్ E పొందవచ్చు.
46
ఆకు కూరలు..
పాలకూర, బ్రోకలీ, బీట్‌రూట్ ఆకుకూర, కోలార్డ్ ఆకుకూరల్లో విటమిన్ E అధికంగా ఉంటుంది. క్యాప్సికం, గుమ్మడికాయను కూడా తినవచ్చు. ఇది చర్మ, జుట్టు ఆరోగ్యానికి బాగా పనిచేస్తుంది.
56
విటమిన్ E ఉన్న పండ్లు
విటమిన్ E కోసం కొన్ని పండ్లు తినాలి. మామిడి, బ్లాక్‌బెర్రీ, రాస్ప్బెర్రీ, కివీ, అవకాడో వంటి పండ్లలో విటమిన్ E ఉంటుంది. వీటితో స్మూతీలు, ఫ్రూట్ చాట్ చేసుకుని తినవచ్చు. వేసవిలో మామిడి పండ్లు ఎక్కువగా లభిస్తాయి. వీటిని తినడం ద్వారా విటమిన్ E పొందవచ్చు.
66
గుడ్లు, చేపలు
గుడ్డులోని పచ్చసొనలో విటమిన్ E ఉంటుంది. గుడ్డు తినడం అలవాటు ఉంటే రోజూ తినవచ్చు. కొన్ని చేపలు కూడా విటమిన్ Eకి మంచి వనరులు. కొన్ని నూనెల్లో కూడా విటమిన్ E పుష్కలంగా ఉంటుంది. బాదం నూనె, రైస్ బ్రాన్ ఆయిల్, పామాయిల్, కొబ్బరి నూనె లాంటివి కూడా తీసుకోవచ్చు.