Vitamin D: విటమిన్ డి ఎక్కువ మోతాదులో తీసుకుంటే ఏమౌతుంది?

Published : Oct 27, 2025, 12:44 PM IST

Vitamin D ఈ రోజుల్లో ఎండల్లో తిరిగే వారు లేరనే చెప్పాలి. దీంతో, చాలా మందిలో ఈ విటమిన్ లోపం ఉంటుంది. ఈ విటమిన్ ని చాలా మంది సప్లిమెంట్ల రూపంలో తీసుకుంటూ ఉంటారు. కానీ, మరీ ఎక్కువగా తీసుకుంటే మాత్రం ఆరోగ్య సమస్యలు వచ్చే ప్రమాదం చాలా ఎక్కువగా ఉంటుంది. 

PREV
14
Vitamin D

మనం ఆరోగ్యంగా ఉండటానికి శరీరానికి విటమిన్ D ఎంత అవసరమో ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. విటమిన్ డి శరీరానికి పుష్కలంగా అందినప్పుడు... ఎముకలు బలంగా ఉంటాయి. రోగనిరోధక శక్తి మెరుగుపడుతుంది. ఈ విటమిన్ మనకు సూర్య రశ్మి ద్వారా లభిస్తుంది. అందుకే, దీనిని సన్ షైన్ విటమిన్ అని పిలుస్తారు.

24
విటమిన్ డి ఎక్కువగా తీసుకుంటే ఏమౌతుంది..?

విటమిన్ డి.. కొవ్వులో కరిగే విటమిన్. కాబట్టి, ఇది శరీరంలోని కణజాలాల్లో నిల్వ అవుతుంది. ఎక్కువ కాలం ఈ విటమిన్ డి అధిక మొత్తంలో తీసుకుంటే, ఇది కాల్షియం స్థాయిలను పెంచుతుంది. కాల్షియం ఎక్కువ అవ్వడం కూడా ఆరోగ్యానికి ప్రమాదమే.

34
విటమిన్ డి ఎక్కువ అయినప్పుడు కనిపించే లక్షణాలు...

వికారం, అలసట

కండరాల బలహీనత

ఆకలి తగ్గడం

ఎముక నొప్పులు

వాంతులు

గందరగోళం, మూర్ఖత్వం

మూత్రపిండాల్లో రాళ్లు

అధిక మూత్రవిసర్జన, దాహం

కాలక్రమేణా, ఇది మూత్రపిండాల నష్టానికి, హృదయ సంబంధ వ్యాధులకు దారితీయవచ్చు.

44
ఇలా ఎందుకు జరుగుతుంది?

సాధారణంగా సూర్యరశ్మి లేదా ఆహారం ద్వారా విటమిన్ డి తీసుకుంటే... దాని వల్ల ఎలాంటి నష్టం ఉండదు. కానీ, సప్లిమెంట్ల రూపంలో ఎక్కువగా తీసుకుంటే మాత్రం ఆరోగ్య సమస్యలు వచ్చే ప్రమాదం ఎక్కువగా ఉంటుంది. ప్రతి ఒక్కరికీ విటమిన్ డి అవసరం ఉండదు.

రోజుకు 10,000 IU కంటే ఎక్కువ విటమిన్ D ను ఎక్కువకాలం తీసుకోవడం ప్రమాదకరం.

తీసుకోవాల్సిన జాగ్రత్తలు...

రక్త పరీక్ష చేయించుకోండి: మీ విటమిన్ D స్థాయిలు తక్కువగా ఉన్నాయో లేదా తెలుసుకోండి.

డాక్టర్ సలహా తీసుకోండి: స్వయంగా సప్లిమెంట్లు మొదలుపెట్టకండి.

విటమిన్ K2 , మెగ్నీషియంతో కలిపి తీసుకోండి: ఇవి కాల్షియం ఎముకల్లో నిల్వ ఉండటానికి సహాయపడతాయి.

సూర్యరశ్మిని ఉపయోగించుకోండి: ఉదయం 15–20 నిమిషాలు సూర్యకాంతిలో గడపడం సహజమైన మార్గం.

Read more Photos on
click me!

Recommended Stories