Night Bath: ఉరుకుల పరుగుల జీవితంలో ప్రతి ఒక్కరూ రోజంతా ఏదో ఒక పనిచేస్తూనే ఉంటారు. దానివల్ల శరీరం, మనసు రెండూ అలిసిపోతాయి. మళ్లీ ఉదయాన్నే ఫ్రెష్ గా నిద్రలేవాలంటే పడుకునే ముందు కచ్చితంగా స్నానం చేయాలి. దానివల్ల చాలా ఆరోగ్య ప్రయోజనాలు ఉన్నాయి.
మన జీవనశైలిలో రోజంతా పరుగులు, పనులు, ఒత్తిడి సాధారణమైపోయాయి. ఉదయం మొదలు పెట్టిన హడావుడి రాత్రి వరకు కొనసాగుతుంది. ఆఫీస్ పని, కాలేజీ, ట్రాఫిక్, పొల్యూషన్ వంటివి మన శరీరాన్ని మాత్రమే కాదు, మనసుని కూడా అలసిపోయేలా చేస్తాయి. కాబట్టి శరీరానికి కూడా రిఫ్రెష్ అవసరం. రాత్రిపూట స్నానం చేయడం కేవలం శుభ్రతకే కాదు. ఆరోగ్యానికి కూడా చాలా మంచిది. దానివల్ల కలిగే పూర్తి ప్రయోజనాల గురించి వివరంగా తెలుసుకుందాం.
25
శరీర ఉష్ణోగ్రత
రాత్రిపూట స్నానం చేయడం వల్ల శరీర ఉష్ణోగ్రత సమతుల్యం అవుతుంది. రోజు మొత్తం వేడి, చెమట, పొల్యూషన్ కారణంగా శరీర ఉష్ణోగ్రత పెరిగిపోతుంది. రాత్రి నిద్రకు ముందు చల్లటి లేదా గోరువెచ్చని నీటితో స్నానం చేస్తే శరీర ఉష్ణోగ్రత తగ్గుతుంది. ఇది మన బ్రెయిన్‌కి “ఇప్పుడు విశ్రాంతి తీసుకో” అనే సిగ్నల్ ఇస్తుంది. దానివల్ల ఈజీగా నిద్ర వస్తుంది. ముఖ్యంగా నిద్రలేమి లేదా టెన్షన్ ఉన్నవారికి ఇది చాలా ఉపయుక్తంగా ఉంటుంది. కొన్ని అధ్యయనాల ప్రకారం, నిద్రకు ముందు స్నానం చేసిన వాళ్లలో నిద్ర నాణ్యత గణనీయంగా మెరుగుపడిందని తేలింది.
35
మానసిక ప్రశాంతత
నీరు కేవలం శరీరాన్ని మాత్రమే క్లీన్ చేయదు. మన ఆలోచనలను కూడా తేలిక చేస్తుంది. రోజు మొత్తం మనం ఎదుర్కొన్న ఒత్తిడి, ఆందోళన, నిరాశ వంటివి మనలో బరువుగా పేరుకుపోతాయి. రాత్రిపూట స్నానం చేయడం వల్ల ఆ మానసిక భారం తగ్గిపోతుంది. మనసుకు ప్రశాంతత లభిస్తుంది. నీరు నాడీ వ్యవస్థను శాంతపరుస్తుంది. హార్ట్ బీట్ రేటును సమతుల్యం చేస్తుంది.
రోజు మొత్తం మన చర్మంపై దుమ్ము, చెమట, బ్యాక్టీరియా పేరుకుపోతాయి. రాత్రి స్నానం చేయకపోతే ఇవి రాత్రంతా చర్మంపై ఉండి, చర్మ సమస్యలకు దారితీస్తాయి. రాత్రిపూట స్నానం చేయడం ద్వారా ఈ మలినాలు తొలగిపోతాయి. శుభ్రంగా నిద్రపోతే మన నిద్ర కూడా ప్రశాంతంగా ఉంటుంది. ఉదయం లేచినప్పుడు ఒక ఫ్రెష్ ఎనర్జీ ఉంటుంది. అంతేకాదు గోరువెచ్చని నీటితో స్నానం చేస్తే కండరాలు సడలుతాయి. నర్వ్స్ రిలాక్స్ అవుతాయి. రోజు మొత్తం కూర్చుని పనిచేసే ఉద్యోగులకైనా, ఎక్కువ శారీరక శ్రమ చేసే కార్మికులకైనా రాత్రి స్నానం శరీరానికి మంచి రిఫ్రెష్ లాగా పనిచేస్తుంది.
55
జుట్టు ఆరోగ్యానికి
చాలామంది రాత్రిపూట అలిసిపోయి నిద్రపట్టక మొబైల్ ఫోన్ చూస్తుంటారు. కానీ చల్లని నీటితో స్నానం చేస్తే.. త్వరగా నిద్ర వస్తుంది. ఫలితంగా మొబైల్ చూసే అలవాటు కూడా తగ్గిపోతుంది. అంతేకాదు రాత్రిపూట స్నానం చేయడం జుట్టు ఆరోగ్యానికి కూడా మంచిది. రోజంతా పొల్యూషన్ కారణంగా తలపై పేరుకుపోయిన ధూళి, ఆయిల్ క్లీన్ అవుతాయి. జుట్టు రూట్స్ బలపడతాయి.