రాత్రి పడుకునే ముందు ఈ పనులు అస్సలు చేయకూడదు! ఎందుకో తెలుసా?

Published : Sep 21, 2025, 04:25 PM IST

మంచి నిద్ర ప్రతి ఒక్కరికీ అవసరం. రాత్రి కరెక్టుగా నిద్రపోతేనే మరుసటి రోజు ఉత్సాహంగా పని చేసుకోగలం. లేదంటే రోజంతా అలసట, నీరసం, తలనొప్పి వంటివి వస్తాయి. రాత్రి పడుకునే ముందు మనం చేసే కొన్ని తప్పులు నిద్రలేమికి కారణం కావచ్చు. అవేంటో ఇక్కడ చూద్దాం

PREV
14
పడుకునే ముందు చేయకూడని పనులు

రాత్రి నిద్రపోయే ముందు మనం చేసే కొన్ని పనులు శారీరక, మానసిక ఆరోగ్యంపై తీవ్ర ప్రభావాన్ని చూపుతాయి. శరీరం విశ్రాంతి తీసుకునే సమయంలో ఈ అలవాట్ల వల్ల ఒత్తిడి పెరుగుతుంది. కాబట్టి రాత్రి పడుకునే ముందు అస్సలు చేయకూడని పనుల గురించి ఇక్కడ తెలుసుకుందాం.

24
మొబైల్ ఫోన్, లాప్‌టాప్‌ల వాడకం

మనలో చాలామంది నిద్రపోయే ముందు మొబైల్ ఫోన్‌లో గడుపుతుంటారు. అయితే, డిజిటల్ స్క్రీన్ల నుంచి వచ్చే బ్లూ లైట్ నిద్ర హార్మోన్ అయిన మెలటోనిన్ ఉత్పత్తిని తగ్గిస్తుంది. దానివల్ల నిద్ర సరిగ్గా పట్టదు.

అతిగా ఆలోచించడం 

రేపు ఏం చేయాలి? ఆ పని ఎలా జరుగుతుంది? ఎలా చేస్తాను? వంటి ఆలోచనలతో మనసును కష్టపెట్టడం మంచిది కాదు. మానసిక ఒత్తిడిని పెంచడం వల్ల శరీరానికి విశ్రాంతి లభించదు. కాబట్టి ధ్యానం, శ్వాస సాధన వంటివి అనుసరించడం మంచిది.

34
ఎక్కువగా తినడం

రాత్రి భోజనం తేలికగా ఉండాలి. పడుకునే సమయానికి చాలా ఆలస్యంగా తినడం లేదా నూనె, మసాలా అధికంగా ఉన్న ఆహారాన్ని తీసుకోవడం మంచిది కాదు. ఇది జీర్ణక్రియను దెబ్బతీస్తుంది. ఫలితంగా నిద్రకు ఆటంకం కలుగుతుంది.

కాఫీ, టీ, ఆల్కహాల్

కాఫీ, టీ వంటి కెఫిన్ ఉండే డ్రింక్స్ నిద్రను రాకుండా చేస్తాయి. ఆల్కహాల్ తీసుకుంటే తాత్కాలికంగా నిద్ర వచ్చినట్లు అనిపిస్తుంది. కానీ అది నిద్ర నాణ్యతను తగ్గిస్తుందని నిపుణులు చెబుతున్నారు.

44
గొడవలు

కొన్ని ఇళ్లల్లో రాత్రిపూట పదే పదే గొడవలు జరుగుతుంటాయి. కానీ రాత్రిపూట మానసికంగా ప్రశాంతంగా ఉండాల్సిన సమయం. ఆ సమయంలో గొడవలు పెట్టుకోవడం వల్ల మనసు కలత చెందుతుంది. నిద్రకు ఆటంకం కలుగుతుంది.

శ్రమతో కూడిన వ్యాయామం

వ్యాయామం ఆరోగ్యానికి మంచిదే. కానీ పడుకునే సమయానికి ముందు కఠినమైన వ్యాయామం చేయడం వల్ల శరీర ఉష్ణోగ్రత పెరిగి.. నిద్రకు ఆటంకం కలుగుతుంది. 

Read more Photos on
click me!

Recommended Stories