Biscuits: టాప్ 5 చెత్త బిస్కెట్లు ఇవే.. తిన్నారంటే ఈ సమస్యలు తప్పవు జాగ్రత్త!

Published : Apr 15, 2026, 03:40 PM IST

చిన్నపిల్లల నుంచి పెద్దవాళ్ల వరకు అందరూ బిస్కెట్లను ఇష్టంగా తింటుంటారు. అయితే రుచికోసం మనం తరచూ తినే ఈ బిస్కెట్లు నిజంగా ఆరోగ్యానికి మంచివేనా? ఆరోగ్యంపై వీటి ప్రభావం ఎలా ఉంటుంది? డాక్టర్ల ప్రకారం టాప్ 5 చెత్త బిస్కెట్లు ఏవో ఇక్కడ తెలుసుకుందాం. 

PREV
16
టాప్ 5 చెత్త బిస్కెట్లు

ప్రస్తుత కాలంలో బిస్కెట్లు రోజువారీ ఆహారంలో భాగమైపోయాయి. టీతో పాటు తేలికపాటి స్నాక్‌గా చాలామంది వీటిని తీసుకుంటారు. అయితే ఇవి ఆరోగ్యానికి అంత మంచివి కావంటున్నారు నిపుణులు. ముఖ్యంగా ఎక్కువగా ప్రాసెస్ చేసిన కొన్ని రకాల బిస్కెట్లు.. అధిక చక్కెర, ఉప్పు, ట్రాన్స్ ఫ్యాట్స్, ప్రిజర్వేటివ్‌లతో నిండిపోయి ఉంటాయి. ఇవి దీర్ఘకాలంలో ఊబకాయం, గుండె సంబంధిత సమస్యలు, షుగర్ వంటి సమస్యలకు దారితీయవచ్చు. అందుకే ఏ బిస్కెట్లు ఎంతమేరకు తీసుకోవాలి అనే విషయంపై అవగాహన ఉండటం అవసరమంటున్నారు నిపుణులు. మరి ఏ బిస్కెట్లకు దూరంగా ఉండాలో ఇక్కడ చూద్దాం.

26
క్రీమ్ బిస్కెట్లు

పిల్లలు, యువత క్రీమ్ బిస్కెట్లను ఎక్కువగా తింటుంటారు. మధ్యలో ఉండే క్రీమ్ కారణంగా ఇవి రుచిగా అనిపించినా, అందులో అధిక చక్కెర, కృత్రిమ రుచులు, కలర్స్ ఉంటాయి. ఎక్కువగా తీసుకుంటే బరువు పెరగడం, దంత సమస్యలు, శరీరంలో ఫ్యాట్ పేరుకుపోవడం వంటి సమస్యలు వస్తాయి. ముఖ్యంగా చిన్న పిల్లలు వీటిని ఎక్కువగా తినడం వల్ల పోషకాహార లోపాలు వచ్చే ప్రమాదం ఉంది.

36
గ్లూకోజ్ బిస్కెట్లు

చాలామంది గ్లూకోజ్ బిస్కెట్లను ఎనర్జీ కోసం మంచివని భావిస్తారు. కానీ వీటిలో మైదా, చక్కెర శాతం అధికంగా ఉండటం వల్ల రక్తంలో గ్లూకోజ్ స్థాయిలు ఒక్కసారిగా పెరిగి మళ్లీ త్వరగా పడిపోతాయి. దీని వల్ల తాత్కాలికంగా ఎనర్జీ వచ్చినా, త్వరగా అలసట అనిపిస్తుంది. దీర్ఘకాలంగా ఇవి అధికంగా తీసుకుంటే డయాబెటీస్ వచ్చే ప్రమాదం కూడా పెరుగుతుంది.

46
చాక్లెట్ బిస్కెట్లు

చాక్లెట్ బిస్కెట్లు కూడా ఆరోగ్యానికి అంతగా మంచివి కావు. ఇవి చాక్లెట్ ఫ్లేవర్ పేరుతో ఎక్కువగా చక్కెర, కొవ్వు పదార్థాలు కలిగి ఉంటాయి. కృత్రిమ ఫ్లేవర్స్, కోకో ఆధారిత పదార్థాలు అధికంగా ఉండటం వల్ల శరీరంలో కేలరీలు ఎక్కువగా చేరుతాయి. తరచూ వీటిని తీసుకోవడం వల్ల బరువు పెరగడం, చక్కెరపై ఇష్టం పెరగడం జరుగుతుంది. పిల్లల్లో ఈ అలవాటు ఎక్కువగా కనిపిస్తుంది.

56
బట్టర్ బిస్కెట్లు

బట్టర్ బిస్కెట్లు కూడా టేస్టీగా ఉండటం వల్ల ఎక్కువగా తింటారు. కానీ వీటిలో శాచ్యురేటెడ్ ఫ్యాట్స్, ట్రాన్స్ ఫ్యాట్స్ అధికంగా ఉంటాయి. ఇవి గుండె ఆరోగ్యంపై ప్రతికూల ప్రభావం చూపవచ్చు. అలాగే కొలెస్ట్రాల్ స్థాయిలను పెంచి గుండె సంబంధిత వ్యాధుల ప్రమాదాన్ని పెంచుతాయి. రోజూ ఎక్కువగా తీసుకుంటే బరువు పెరగడం ఖాయమంటున్నారు నిపుణులు.

66
కిడ్స్ బిస్కెట్లు

కిడ్స్ బిస్కెట్లను ప్రత్యేకంగా పిల్లల కోసం మార్కెట్ చేస్తారు కాబట్టి.. చాలామంది ఇవి ఆరోగ్యకరమైనవని భావిస్తారు. కానీ వాస్తవానికి వీటిలో కూడా చక్కెర, ఉప్పు, ప్రిజర్వేటివ్‌లు, కృత్రిమ విటమిన్ ఫోర్టిఫికేషన్ ఎక్కువగా ఉంటుంది. ప్యాకేజింగ్ ఆకర్షణీయంగా ఉన్నప్పటికీ, పోషక విలువలు తక్కువగా ఉండే అవకాశం ఉంది. పిల్లలకు ఇవి తరచూ ఇవ్వడం కంటే సహజ ఆహారాలు ఇవ్వడం ఉత్తమం.

Read more Photos on
click me!

Recommended Stories