ఎంతో రుచికరమైన క్రిస్పీ మసాలా వడ తయారీ విధానం ఎలానో తెలుసా?

First Published Dec 2, 2021, 1:10 PM IST

వర్షాకాలం, చలికాలం మొదలవ్వగానే చల్లని సాయంత్రం వేళ వేడి వేడిగా క్రిస్పీగా మంచి స్నాక్ ఐటం తినాలనిపిస్తుంది. ఇలా ఏదైనా తినాలి అనుకున్నప్పుడు ముందుగా గుర్తొచ్చేది వడలు. అందులోనూ మసాలా వడలు అంటే అందరికీ తినాలని మరింత ఇష్టంగా ఉంటుంది. అలాంటప్పుడు మసాలా వడలు (Masala vadalu) తయారు చేసుకుని చల్లటి సాయంత్రాన్ని కుటుంబ సభ్యులతో గడపండి. మసాలా వడలు ఒక మంచి హెల్తీ స్నాక్. దీని తయారీ విధానం చాలా సులభం. ఇవి క్రిస్పీగా, టేస్టీగా, రుచిగా ఉంటాయి. ఇంకెందుకు ఆలస్యం ఇప్పుడు ఈ ఆర్టికల్ (Article) ద్వారా మసాలా వడ తయారీ విధానం గురించి తెలుసుకుందాం..
 

కావలసిన పదార్థాలు: ఒక కప్పు సెనగపప్పు (Chana dal), రెండు పచ్చి మిరపకాయలు (Green chillies), రెండు ఎండు మిరపకాయలు (Red chillies), తగినంత అల్లం (Ginger) ముక్క, కొన్ని వెల్లుల్లి (Garlic) రెబ్బలు, అర స్పూన్ జీలకర్ర (Cumin seeds), ఒక ఉల్లిపాయ (Onion), సరిపడ ఉప్పు (Salt), కట్ చేసుకున్న కరివేపాకు (Curries), ఢీ ఫ్రైకి సరిపడా నూనె (Oil). 
 

తయారీ విధానం: ఒక కప్పు సెనగపప్పును నీళ్లు పోసి నాలుగు గంటల పాటు నానబెట్టుకోవాలి. ఇలా నాలుగు గంటల పాటు నానబెట్టుకున్న సెనగపప్పును (Soaked chana dal) నీళ్లు వంపేసి వడకట్టుకోవాలి (Filter).
 

ఇప్పుడు ఒక మిక్సీ జార్ (Mixi Jar) తీసుకొని అందులో నానబెట్టుకున్న సెనగపప్పును, రెండు ఎండు మిరపకాయలు రెండు పచ్చి మిరపకాయలు, అల్లం వెల్లుల్లి (Ginger Garlic) ముక్కలు వేసి బరకగా మిక్సీ పట్టుకోవాలి.
 

ఇలా బరకగా మిక్సీ పట్టుకున్న సెనగపప్పును ఒక గిన్నెలో (Bowl) తీసుకుని ఇందులో కట్ చేసుకున్న ఉల్లిపాయ ముక్కలు, తరిగిన కొత్తిమీర, తరిగిన (chopped) కరివేపాకు, అర స్పూన్ జీలకర్ర, తగినంత ఉప్పు వేసి కలుపుకోవాలి.
 

ఈ మిశ్రమాన్ని నీళ్లు లేకుండా బాగా కలుపుకోవాలి. ఈ మిశ్రమం చాలా పొడిగా ఉంటే అవసరమైతే రెండు టేబుల్ స్పూన్ ల నీళ్ళు వేసుకొని కలుపుకోవాలి. అప్పుడే వడలు విరగకుండా (Without breaking) మంచి ఆకారంలో (Shaped) వస్తాయి.
 

ఇప్పుడు వడల (vadala) తయారీకి స్టవ్ మీద కడాయి పెట్టి అందులో నూనె (Oil) వేసి వేడిచేయాలి. నూనె బాగా వేడెక్కిన తరువాత సెనగపిండి మిశ్రమాన్ని చేత్తో వడలుగా గుండ్రంగా ఒత్తుకుని నూనెలో వేసి ఢీ ఫ్రై (Fry) చేసుకోవాలి.
 

వడలను తక్కువ మంట (Low flame) మీద రెండు వైపులా మంచి కలర్ వచ్చేంత వరకూ ఫ్రై చేసుకోవాలి. ఇలా ఫ్రై అయిన వడలను ఒక ప్లేట్ లో టిష్యూ పేపర్ (Tissue paper) ఉంచి అందులో తీసుకోవాలి. ఇలా మొత్తం పిండిని వడలుగా తయారు చేసుకోవాలి.
 

ఇలా తయారు చేసుకున్న వడలను టమోటా సాస్ తో కానీ, చట్నీతో కాని సర్వ్ చేయండి. అంతే ఎంతో రుచికరమైన క్రిస్పీ (Crispy) వేడివేడి మసాలా వడలు రెడీ (Ready). ఇంకెందుకు ఆలస్యం మీరు కూడా ఒకసారి ఈ వడలను ట్రై చేయండి.

click me!