Summer Health Tips: సమ్మర్ వచ్చిందంటే ఎండలు, ఉక్కపోత, చెమటలతో అన్ ఈజీగా ఉంటుంది. దానికి తోడు ఇరిటేషన్, ఫ్రస్ట్రేషన్. ఏసీ, కూలర్లు ఉన్నా అసౌకర్యంగా ఉంటుంది. ఆరోగ్యపరంగా సవాళ్లు ఎదుర్కోవాలి. జాగ్రత్తలు తీసుకుంటే వేసవిలో హెల్దీ లైఫ్ లీడ్ చేయోచ్చు.
వేసవి కాలం వచ్చిందంటే ఎండలు, ఉక్కపోత, చెమటలు తప్పవు. దానికి తోడు ఇరిటేషన్, ఫ్రస్ట్రేషన్. ఏసీలు, కూలర్ లు ఉన్నా కూడా కాస్త అసౌకర్యంగానూ ఉంటుంది. ఆరోగ్యపరంగా కూడా అనేక సవాళ్లు ఎదుర్కోవల్సి ఉంటుంది. చిన్న పిల్లల నుంచి వృద్ధుల వరకూ అందరికీ ఈ వేసవి అందరికీ పెద్ద సమస్యే.
టెంపరేచర్లు పెరగడం వల్ల శరీరం తన సహజ కూలింగ్ సిస్టమ్‌పై ఎక్కువగా పని చేయాల్సి వస్తుంది. చెమట రూపంలో నీరు, లవణాలు బయటకు వెళ్లిపోతాయి. సరైన హైడ్రేషన్ లేకపోతే డీహైడ్రేషన్, అలసట, తలనొప్పి, బీపీ ఫ్లక్చుయేషన్స్ వంటి సమస్యలు మొదలవుతాయి. ప్రత్యేకంగా పిల్లలు, వృద్ధులు, బయట పని చేసే వారు ఎక్కువ రిస్క్‌లో ఉంటారు.
25
వేసవిలో హీట్ స్ట్రోక్ అలెర్ట్
ఎండల్లో ఎక్కువసేపు తిరగడం వల్ల హీట్ స్ట్రోక్ ప్రమాదం పెరిగే అవకాశం ఉంది. శరీర ఉష్ణోగ్రత ఒక్కసారిగా పెరగడం, తల తిరగడం, వాంతులు, స్పృహ కోల్పోవడం వంటి లక్షణాలు కనిపిస్తే వెంటనే డాక్టర్లను కలవాలి. మధ్యాహ్నం పీక్ అవర్స్‌లో బయట పనులు తగ్గించడం, తగినంత నీరు తాగడం, లైట్ కలర్ కాటన్ దుస్తులు వేసుకోవడం మంచిదని ఎక్స్ పర్ట్స్ చెబుతున్నారు.
35
డీహైడ్రేషన్
డీహైడ్రేషన్ కూడా వేసవిలో సాధారణంగా కనిపించే సమస్య. చెమట రూపంలో శరీరంలోని నీరు, లవణాలు ఎక్కువగా బయటకు వెళ్లిపోతాయి. తగినంత లిక్విడ్స్ తీసుకోకపోతే అలసట, తలనొప్పి, బీపీ మార్పులు వస్తాయి. రోజుకు కనీసం 3 నుంచి 4 లీటర్ల వరకు నీరు తాగాలని, కొబ్బరి నీరు, మజ్జిగ, ఫ్రూట్ జ్యూస్ లు వంటి లిక్విడ్స్ ఆహారంలో చేర్చాలని నిపుణులు సూచిస్తున్నారు.అలాగే తగినంత నీరు తాగకపోతే యూరినరీ ట్రాక్ట్ ఇన్ఫెక్షన్లు వచ్చే అవకాశముంది, ముఖ్యంగా మహిళల్లో ఎక్కువగా కనిపిస్తుంది.
ఆహారం విషయంలో కూడా జాగ్రత్తలు తప్పనిసరి. వేడి వాతావరణంలో బ్యాక్టీరియా వేగంగా పెరిగే అవకాశం ఉంది. బయట ఎక్కువసేపు ఉంచిన ఆహారం తీసుకోవడం వల్ల ఫుడ్ పాయిజనింగ్, విరేచనాలు, వాంతులు వంటి సమస్యలు తలెత్తుతాయి. స్ట్రీట్ ఫుడ్ విషయంలో నీట్ అండ్ క్లీన్ గా ఉందో లేదో చూసుకోవాలి. తాగేనీరు కచ్చితంగా ప్యూరిఫైర్ చేసినదే ఉపయోగించాలని సూచిస్తున్నారు.
55
సింపుల్ సొల్యూషన్స్ తో సమ్మర్ టెన్షన్ నుంచి బయటపడొచ్చు
సూర్యకిరణాల తీవ్రత కూడా ఈ సీజన్‌లో అధికంగా ఉంటుంది. సన్‌బర్న్, హీట్ రాష్ వంటి చర్మ సమస్యలు పెరుగుతున్నాయి. SPF ఉన్న సన్‌స్క్రీన్ వాడటం, టోపీలు, గాగుల్స్ ఉపయోగించడం మంచిదని చర్మ వైద్యులు చెబుతున్నారు. అలాగే నీరు ఎక్కడైనా పేరుకుపోతే వెంటనే క్లీన్ చేసుకోవాలి. లేదంటే దోమల బెడద ఎక్కువగా ఉంటుంది. డెంగ్యూ, మలేరియా, చికెన్‌గున్యా కేసులు పెరిగే అవకాశం ఉందని వైద్యులు హెచ్చరిస్తోంది.
మొత్తానికి వేసవి సీజన్‌లో సింపుల్ జాగ్రత్తలు చాలానే ఉపశమనం ఇస్తాయి. ఎక్కువగా నీరు తాగడం, హెల్తీ ఫుడ్ తీసుకోవడం, పరిశుభ్రత పాటించడం, ఎండ నుంచి రక్షణ తీసుకోవడం ఇవి డైలీ రొటీన్‌లో భాగం చేస్తే ఆరోగ్య సమస్యలను చాలావరకు నివారించవచ్చు. ముందస్తు జాగ్రత్తే బెస్ట్ ప్రొటెక్షన్ అని గుర్తుంచుకోవాలి.