Hair Care: సమ్మర్ హెయిర్ కేర్‌కు సొల్యూషన్..అవకాడోతో బెస్ట్ రిజల్ట్

Published : Feb 25, 2026, 12:20 PM IST

Hair Care: సమ్మర్ మొదలైపోయింది. ఇప్పట్నుంచే జాగ్రత్త తీసుకోవాలని నిపుణులు సూచిస్తున్నారు. హెయిర్ విషయంలో కేర్ తీసుకోవాలంటున్నారు. దుమ్ము, ధూళితో జుట్టురాలే ఛాన్స్ ఉంది. ఖరీదైన ప్రొడక్ట్స్ కాకుండా అవకాడో ప్యాక్ తో బెస్ట్ రిజల్ట్ ఉంటుందని చెబుతున్నారు.

PREV
17
సమ్మర్ ప్లాన్స్ స్టార్ట్ చేశారా?

ఇంకా మార్చి ఎంటర్ కాకుండానే సమ్మర్ స్టార్ట్ అయిపోయింది. చెమట్లు, ఉక్కపోతతో జనాలు అల్లాడిపోతున్నారు. ఇక ఇప్పటి నుంచే జాగ్రత్తలు తీసుకోవడం మొదలు పెట్టాలి. తినే ఫుడ్ నుంచి వేసుకునే బట్టలు, స్కిన్ కేర్, హెయిర్ కేర్ ఇలా అన్ని విషయాల్లో ప్రణాళికలు పెట్టుకోవాలి.

27
హెయిర్ కేర్ చాలా ఇంపార్టెంట్

సమ్మర్ ప్లాన్స్ లో ముఖ్యంగా హెయిర్ కేర్ చాలా ఇంపార్టెంట్. మగవాళ్లు గానీ, ఆడవాళ్లు గానీ. మగవాళ్లు ఎక్కువగా హెల్మెట్ ధరించడం వల్ల చెమట పేరుకుపోతుంది. ఇంకా దానిపై దుమ్మ, ధూళి పడి డాండ్రఫ్ కు కారణమవుతుంది. మెల్లగా రాలిపోవడం స్టార్ట్ అవుతుంది. ఇక లేడిస్ కూడా తలస్నానం చేసి అలానే తడితో ఉంచేస్తుంటారు. అప్పుడు కూడా స్వెట్ అతుక్కుపోతుంది. దానివల్ల కూడా హెయిర్ రాలిపోవడం, పేన్లు పుట్టడం, దురద అన్నీ మొదలవుతాయి. అందుకే జాగ్రత్తలు తీసుకోవాలని నిపుణులు సూచిస్తున్నారు.

37
వేసవిలో కొత్త కొత్త ప్రొడక్ట్స్ మార్కెట్లోకి వస్తాయి

అందుకని వేసవిలో జుట్టు సంరక్షణ కోసం కొత్త కొత్త ప్రొడక్ట్స్ మార్కెట్లోకి వస్తుంటాయి. అలా అని కాస్ట్లీ హెయిర్ సీరమ్ లు, షాంపూలు వాడనవసరం లేదంటున్నారు. ఇంట్లోనే సహజ ప్యాక్ లు చేసుకోవచ్చని సూచిస్తున్నారు. మనం పనికిరానివని పడేసే వస్తువుతోనే మంచి జుట్టును సంరక్షించుకోవచ్చని చెబుతున్నారు. చెత్తగా భావించే అవకాడో విత్తనం ఇప్పుడు జుట్టు సంరక్షణలో కొత్త ట్రెండ్‌గా మారింది.

47
“అవకాడో పిట్ వాటర్” లో బోలెడన్నీ సహజ గుణాలు

అవకాడో తినేసిన తర్వాత మిగిలే ఆ గట్టి విత్తనాన్ని చాలామంది ఏమాత్రం ఆలోచించకుండా పారేస్తారు. అయితే ఇటీవల సోషల్ మీడియాలో “అవకాడో పిట్ వాటర్” అనే హోమ్‌మేడ్ హెయిర్ కేర్ ట్రెండ్ అవుతోంది. ఇది జుట్టు పెరుగుదల, తల చర్మ ఆరోగ్యానికి ఉపయోగపడుతుందని అనేక మంది చెబుతున్నారు. మొదట ఇది కేవలం మరో ఇంటి చిట్కా లాగా అనిపించినా, ఇందులో ఉన్న సహజ గుణాలు చూసినప్పుడు షాక్ అవుతున్నారు.

57
తరచూ వాడితే పెద్ద మార్పు కనిపిస్తుంది

జుట్టు ఆరోగ్యం అనేది ఎక్కువగా మాడుపై ఆధారపడి ఉంటుంది. మాడుకు పోషణ అంది, రక్తప్రసరణ బాగుంటే, జుట్టు బలంగా పెరుగుతుంది. అవకాడో విత్తనంలో సహజ యాంటీ ఆక్సిడెంట్లు, ఫైటో న్యూట్రియెంట్లు, కొన్ని ఉపయోగకరమైన మొక్కల సంయోగాలు ఉంటాయి. ఇవి మాడుకు కూలింగ్ తో పాటు, పొడిబారడం తగ్గించడంలో సహాయపడతాయని నిపుణులు చెబుతున్నారు. అలా అని ఒక్కసారి వాడితే మార్పు కనిపించదని, క్రమంగా వాడితేనే పెద్ద మార్పు కనిపిస్తుందని సూచిస్తున్నారు. జుట్టు మృదువుగా మారి, పగిలిపోవడం తగ్గుతుంది. తల తాజాగా అనిపించడం వంటి మార్పులు కనిపిస్తాయని చెబుతున్నారు.

67
అవకాడో ప్యాక్ ఇంట్లోనే ఈజీగా..

అవకాడో ప్యాక్ ఇంట్లో తయారు చేయడం కూడా సులభమే. అవకాడో విత్తనాన్ని బాగా కడిగి, చిన్న ముక్కలుగా కోయాలి లేదా తురుమాలి. తరువాత రెండు నుంచి మూడు కప్పుల నీటిలో సుమారు ఇరవై నుంచి ముప్పై నిమిషాలు మరిగించాలి. గులాబీ లేదా లేత ఎరుపు వర్ణంలోకి మారుతుంది. చల్లారిన తర్వాత వడకట్టి గాజు సీసాలో నిల్వ చేసి ఫ్రిజ్‌లో ఉంచాలి. రెండు మూడు రోజుల తర్వాత ఉపయోగించాలి.

షాంపూ చేసిన తర్వాత తలపై తేలికగా మసాజ్ చేయండి. లేదా తలస్నానం ముందు స్ప్రే చేసి 20 నిమిషాలు ఉంచి తర్వాత కడిగేయండి. వారానికి రెండు లేదా మూడు సార్లు సరిపోతుంది.

77
తీవ్రమైన జుట్టు రాలితే వైద్యులను సంప్రదించాలి

అయితే ఒక విషయం గుర్తుంచుకోవాలి. తీవ్రమైన జుట్టు రాలడం లేదా మాడు సమస్యలు ఉంటే వైద్యులను సంప్రదించాలి. సో ఈసారి అవకాడో కోసినప్పుడు ఆ విత్తనాన్ని పారేయడానికి ముందే ఒకసారి ఆలోచించండి. మీ జుట్టు సంరక్షణలో అది బెస్ట్ మెడిసిన్ గా ఉపయోగపడుతుంది.

Read more Photos on
click me!

Recommended Stories