Guava Leaves: జామ ఆకుల్లో ఇన్ని పోషకాలు ఉంటాయా? రోజూ తింటే ఆశ్చర్యపరిచే లాభాలు!

Published : Jun 27, 2025, 11:32 AM IST

Guava Leaves: సామాన్యులకు చౌకగా దొరికే పండ్లల్లో జామ ఒకటి. ఎన్నో పోషకాలున్న జామ తినడం వల్ల పలు ఆరోగ్య సమస్యలకు చెక్ పెట్టవచ్చు. కేవలం జామలోనే కాదు.. జామఆకుల్లోనూ విటమిన్లు, ఖనిజాలు పుష్కలంగా ఉంటాయి. జామ ఆకుల వల్ల కలిగే ప్రయోజనాలేంటో ఓ లూక్కేయండి. 

PREV
15
జామ ఆకు ప్రయోజనాలు

జామ కాయలోనే కాదు.. జామ ఆకులతో కూడా ఎన్నో అద్బుతమైన ఆరోగ్య ప్రయోజనాలున్నాయి. జామ ఆకులో ఎన్నో యాంటీఆక్సిడెంట్లు, వాపును తగ్గించే యాంటీ అలెర్జిక్ లక్షణాలు, బాక్టీరియాను నాశనం చేసే యాంటీ బాక్టీరియల్ ఉన్నాయి. ఇవి ఫంగస్, క్రిములను నాశనం చేసే క్రిమిసంహారిణిగా, నొప్పిని తగ్గించే నొప్పి నివారిణిగా, శ్వాసకోశంలోని కఫాన్ని బయటకు పంపే కఫ నివారిణిగా, రక్తంలో చక్కెర స్థాయిలను నియంత్రించే ఔషదంగా పని చేస్తాయి.  

25
షుగర్ పేషంట్స్ కు దివ్వ ఔషదం

డయాబెటిస్ ఉన్నవారికి జామ ఆకులు కూడా ఓ వరంలాగా పని చేస్తాయి. జామ ఆకులో ఉండే ఫినోలిక్ రక్తంలో చక్కెర స్థాయిని నియంత్రించడంలో సహాయపడుతుంది. జామ ఆకురసంలో ఉండే యాంటీ హైపర్ గ్లైసెమిక్ లక్షణాలు రక్తంలో చక్కెరను కూడా నియంత్రిస్తాయి.  జామ ఆకులను రోజూ తినడం వల్ల బ్లడ్‌షుగర్‌ లెవెల్స్ అదుపులో ఉంటాయి. 

35
జీర్ణక్రియకు మేలు

జామపండ్లలో ఉన్నట్లే జామ ఆకుల్లో కూడా అధిక మొత్తంలో ఫైబర్ ఉంటుంది. ఇది జీర్ణక్రియను మెరుగుపరిచి, మలబద్ధకాన్ని నివారిస్తుంది. ఇందులోని యాంటీ బాక్టీరియల్ లక్షణాలు పేగుల్లో పెరిగే చెడు బాక్టీరియాకు చెక్ పెడుతుంది. అలాగే.. గ్యాస్, ఎసిడిటీ వంటి కడుపు సమస్యలను పరిష్కరిస్తుంది. 

45
బరువు తగ్గడానికి

జామ ఆకు జీవక్రియను మెరుగుపరుస్తుంది. బరువు తగ్గడానికి కూడా దోహదపడుతుంది. బరువు తగ్గాలనుకునేవారు జామఆకులను తరచుగా తీసుకోవచ్చు. ఇది చెడు కొలెస్ట్రాల్ అయిన LDL స్థాయిలను తగ్గించి, మంచి కొలెస్ట్రాల్‌ను మెరుగుపరుస్తుంది. రక్తపోటును కూడా తగ్గిస్తుంది. దీనివల్ల గుండె జబ్బుల ప్రమాదం తగ్గుతుంది. అలెర్జీ, ఆస్తమా వంటి శ్వాసకోశ సమస్యలు ఉన్నవారు కూడా జామ ఆకు టీని తాగవచ్చు. ఈ ఆకును నీటిలో వేసి మరిగించి ఆవిరి పట్టడం వల్ల ముక్కు దిబ్బడ తగ్గుతుంది.

55
జామ ఆకు టీ ఎలా తయారు చేయాలి?

ఐదు నుండి పది జామఆకులను నీటిలో వేసి నీరు సగం అయ్యే వరకు మరిగించాలి. ఆ తరువాత వడగట్టి తాగవచ్చు. డయాబెటిస్ లేనివారు రుచికి తేనె కలుపుకోవచ్చు. డయాబెటిస్ ఉన్నవారు తేనె, పంచదార, బెల్లం వంటివి పూర్తిగా మానేసి, నిమ్మరసం కలుపుకుని తాగవచ్చు. టీలా తాగాలని అనిపించని వారు ఆకులను నేరుగా నమిలి తినవచ్చు. 

( గమనిక: పైన పేర్కొన్న సమాచారం అంతా ఇంటర్నెట్‌లో లభించే ప్రాథమిక సమాచారం ఆధారంగా మాత్రమే వ్రాయబడింది. దీనికి ఏషియానెట్ వెబ్‌సైట్ ఎలాంటి బాధ్యత వహించదు. ) 

Read more Photos on
click me!

Recommended Stories