Kitchen tips: మొలకెత్తిన అల్లాన్ని వంటల్లో వాడితే ఏమవుతుందో తెలుసా?

Published : Jun 27, 2025, 02:37 PM IST

అల్లాన్ని మనం చాలా రకాల వంటకాల్లో వాడుతుంటాం. ఇది వంటలకు రుచిని పెంచడమే కాదు ఆరోగ్యానికి కూడా మంచిది. అయితే చాలామందికి మొలకలు వచ్చిన అల్లం తినచ్చా లేదా అనే సందేహం ఉంటుంది. దాని గురించి ఆరోగ్య నిపుణులు ఏమంటున్నారో ఇక్కడ చూద్దాం. 

PREV
14
మొలకొచ్చిన అల్లం తినచ్చా?

అల్లం భూమిలో పెరుగుతుంది కాబట్టి ఇతర దుంపలు, కూరగాయల లాగా త్వరగా పాడవదు. దానిలో సహజంగానే ఎక్కువ నీటి శాతం ఉండటం వల్ల ఎక్కువ కాలం నిల్వ ఉంటుంది. అయితే సరిగ్గా నిల్వ చేయకపోతే మాత్రం త్వరగా పాడైపోతుంది. మొలకలు కూడా వస్తాయి. సాధారణంగా మొలకెత్తిన బంగాళాదుంప, ఉల్లిపాయలను మనం పడేస్తూ ఉంటాం. మరి మొలకలు వచ్చిన అల్లం వాడచ్చా? వాడకూడదా? వాడితే కలిగే లాభాలు, నష్టాలు ఏంటో ఇక్కడ చూద్దాం.  

24
మొలకలు వచ్చిన అల్లం వాడచ్చా?

మొలకెత్తిన అల్లం వాడచ్చు. కొంతవరకు ఇది సురక్షితమే. సాధారణంగా అల్లం రుచి కారంగా ఉంటుంది. మొలకెత్తిన అల్లంలో తేలికపాటి తీపి రుచి ఉంటుంది. కాబట్టి మొలకెత్తిన అల్లాన్ని సలాడ్, సూప్ లలో వాడచ్చు. కానీ ఎక్కువగా తీసుకోకూడదు.

34
మొలకెత్తిన అల్లం వల్ల కలిగే లాభాలు:

- సాధారణ అల్లంలో ఉండే పోషకాల కంటే మొలకెత్తిన అల్లంలో విటమిన్లు, ఖనిజాలు, యాంటీఆక్సిడెంట్లు ఎక్కువగా ఉంటాయి. కానీ ఎక్కువ రోజులు మొలకెత్తిన అల్లం కాకుండా, కొత్తగా మొలకెత్తింది మంచిది. ఎక్కువ రోజుల కింద మొలకెత్తిన అల్లం చేదుగా ఉంటుంది.

- సాధారణ అల్లం లాగే మొలకెత్తిన అల్లం కూడా జీర్ణ సమస్యలకు మంచిది. ఇది అజీర్తి, వికారం, వాంతులు, కడుపు ఉబ్బరం, గ్యాస్, నోటి దుర్వాసన వంటి సమస్యలను తగ్గిస్తుంది.

- మొలకెత్తిన అల్లంలో ఉండే యాంటీ ఇన్ఫ్లమేటరీ లక్షణాలు శరీరంలో కణాలు దెబ్బతినకుండా, ఫ్రీ రాడికల్స్ తో పోరాడటానికి సహాయపడతాయి.

- మొలకెత్తిన అల్లంలో ఉండే యాంటీఆక్సిడెంట్ లక్షణాలు క్యాన్సర్ రాకుండా సహాయపడతాయి.

44
మొలకెత్తిన అల్లం వల్ల కలిగే దుష్ప్రభావాలు:

- మొలకెత్తిన అల్లాన్ని ఎక్కువగా తీసుకుంటే దానిలోని కారం వల్ల గుండెల్లో మంట, కడుపు నొప్పి, విరేచనాలు వంటి సమస్యలు వస్తాయి.

- యాంటీప్లేట్లెట్ మందులు వాడేవారు మొలకెత్తిన అల్లాన్ని ఎక్కువగా వాడకూడదు.

- తక్కువ రక్తపోటు ఉన్నవారు మొలకెత్తిన అల్లాన్ని ఎక్కువగా తీసుకుంటే బీపీ తగ్గిపోతుంది.

- అల్లం తింటే పడనివారు మొలకెత్తిన అల్లాన్ని వాడకూడదు. అది అలెర్జీని మరింత పెంచుతుంది.

Read more Photos on
click me!

Recommended Stories