వేసవిలో పెరుగు తినడం ఆరోగ్యానికి ఎంతమంచిదో అందరికీ తెలుసు. పెరుగు శరీర ఆరోగ్యానికి మాత్రమే కాదు చర్మ ఆరోగ్యానికి కూడా చాలా బాగా పనిచేస్తుంది. మండే ఎండల్లోనూ ముఖం అందంగా కనిపించాలంటే పెరుగును ఇలా వాడండి. తప్పకుండా మంచి ఫలితాలు చూస్తారు.
ఒక గిన్నె పెరుగు చర్మ సమస్యలకు మంచి ఇంటి చిట్కాగా పనిచేస్తుంది. వేసవిలో చర్మాన్ని కాంతివంతంగా చేయడానికి, చర్మం తేమను నిలుపుకోవడానికి పెరుగు చాలా ఉపయోగకరంగా ఉంటుంది. పెరుగును ఎలా వాడాలో ఇక్కడ చూద్దాం.
26
పెరుగు, ఓట్ మీల్
ముఖం అందం కోసం పెరుగుతో పాటు ఓట్ మీల్ వాడకం కూడా ఇటీవల బాగా పెరిగింది. ఓట్ మీల్ సహజ స్క్రబ్బర్ గా పనిచేస్తుంది. ఒక చెంచా పెరుగుతో ఒక చెంచా ఓట్ మీల్ కలిపి.. ఎండ నుంచి వచ్చిన తర్వాత ముఖానికి రాసుకోండి. ఈ సహజ స్క్రబ్బర్ మీ ముఖం మీద ముడతలను తగ్గిస్తుంది. చర్మంలోని కొల్లాజెన్ ను పెంచుతుంది. మృత కణాలు తొలగిపోయి చర్మం ఆరోగ్యంగా మారుతుంది.
36
నల్ల మచ్చలను తొలగిస్తుంది
పెరుగు మొటిమల సమస్యను మాత్రమే కాదు.. నల్ల మచ్చల నుంచి కూడా ఉపశమనం కలిగిస్తుంది. పెరుగు, నిమ్మరసం కలిపి ముఖానికి రాస్తే మొటిమల మచ్చలు, పాత మచ్చలను తొలగించడంలో సహాయపడుతుంది. నిమ్మరసంతో సమస్య ఉంటే.. కేవలం పెరుగును తీసుకొని మొటిమలపై రాసి రాత్రంతా ఉంచండి. ఉదయం లేచి చల్లటి నీటితో ముఖం కడుక్కోండి. కొన్ని రోజులు ఇలా చేస్తే మొటిమల సమస్య, నల్ల మచ్చలు తగ్గుతాయి.
రాత్రిపూట చదువుకోవడం, పని చేయడం ఇతర కారణాల వల్ల కళ్ల కింద నల్లటి వలయాలు ఏర్పడతాయి. ఈ సందర్భంలో కూడా పెరుగు చాలా ఉపయోగకరంగా ఉంటుంది. దూదితో కొంచెం పెరుగును తీసుకొని కళ్ల కింద రాసి 15 నిమిషాలు ఉంచండి. ఇలా కొన్ని రోజులు చేస్తే కళ్ల కింద వాపు, నల్లటి వలయాలు తగ్గుతాయి.
56
మేకప్ తర్వాత
ప్రతిరోజూ మేకప్ వేసుకునేవారికి పెరుగు చాలా ఉపయోగకరంగా ఉంటుంది. ఎండలో నిరంతరం మేకప్ వేసుకుంటే చర్మం పొడిబారుతుంది. ఈ సందర్భంలో ఒక చెంచా పెరుగుతో నిమ్మరసం, తేనె కలిపి ఇంట్లో తయారుచేసుకున్న ప్యాక్‌ను ముఖానికి రాస్తే చాలా ప్రయోజనాలు కలుగుతాయి.
66
చర్మం కాంతి కోసం పెరుగు
పెరుగు ముఖం కోల్పోయిన కాంతిని తిరిగి తెస్తుంది. పెరుగులో లాక్టిక్ యాసిడ్ ఉండటం వల్ల ఇది ముఖంలో మంటను తగ్గించి చర్మాన్ని కాంతివంతంగా చేస్తుంది. మొటిమల వంటి సమస్యలకు కూడా చెక్ పెడుతుంది. చందనం లేదా తేనెతో పెరుగు కలిపి మొటిమలపై రాస్తే ఈ సమస్య నుంచి ఉపశమనం లభిస్తుంది.