Cooking Oil: రోజూ ఎంత నూనె వాడితే ఆరోగ్యానికి మంచిదో తెలుసా?

Published : May 13, 2025, 02:21 PM IST

నూనెె లేకుండా వంటలు చేయడం కష్టం. అలా అని మోతాదుకు మించి వాడటం కూడా ఆరోగ్యానికి అంత మంచిది కాదు. మరి రోజుకు ఎంత నూనె వాడాలి? ఎంత మోతాదులో వాడితే చెడు కొలెస్ట్రాల్ పెరగకుండా ఉంటుంది? ఇతర విషయాలు మీకోసం. ఓసారి తెలుసుకోండి.

PREV
15
Cooking Oil: రోజూ ఎంత నూనె వాడితే ఆరోగ్యానికి మంచిదో తెలుసా?

ఎక్కువ నూనె వాడకం ఆరోగ్యానికి హానికరం. గుండె జబ్బులు, స్ట్రోక్ వచ్చే ప్రమాదం ఉంది. నూనె వినియోగం తగ్గించాలని నిపుణులు సూచిస్తున్నారు. ఓ అధ్యయనం ప్రకారం 2001లో ఒక వ్యక్తి 8.2 కిలోల నూనె వాడితే ఇప్పుడు 23 కిలోలకు పెరిగిందట. శుద్ధి చేసిన నూనెలో కేలరీలు ఎక్కువ. ఒక టీస్పూన్ నూనెలో 100 కేలరీలుంటాయి. ఎన్ని స్పూన్ల నూనె వాడితే అన్ని కేలరీలు తీసుకుంటున్నట్టే అంటున్నారు నిపుణులు. అయితే రోజూ ఎంత నూనె వాడితే మంచిదో ఇక్కడ చూద్దాం.

25
కొవ్వు ఎక్కువగా ఉండే ఆహారాలు వద్దు!

శరీరానికి అవసరమైన కొవ్వు ఎక్కువశాతం నూనె నుంచే వస్తుంది. కాబట్టి నూనె తక్కువ వాడటం మంచిది. నిపుణుల ప్రకారం రోజుకు 30 గ్రాముల కంటే ఎక్కువ కొవ్వు తీసుకోవద్దు. కానీ చాలామంది కొవ్వు ఎక్కువగా ఉండే ఆహారం తినడానికే ఇష్టపడుతున్నారు.

35
ఎంత నూనె వాడాలి?

నూనె పూర్తిగా మానేయద్దు. నెమ్మదిగా తగ్గించడం మంచిది. రోజుకు 15-20 మి.లీ. నూనె సరిపోతుంది. అంటే 3-4 స్పూన్లు. రిఫైన్డ్ ఆయిల్స్ వాడకపోవడం మంచిది. ఆహారాలు వేయించడానికి బదులు ఉడికించి తినండి. ఒకే నూనె కాకుండా ఆవ నూనె వంటివి కూడా వాడండి. దీనివల్ల కొవ్వు ఆమ్లాలు సమతుల్యంగా ఉంటాయి.

45
నెలకు ఎంత నూనె?

నెలకు ఎంత నూనె వాడుతున్నారో చూడండి. ఇంట్లో నలుగురుంటే మొత్తం నూనెను నాలుగో వంతు చేయండి. ఒకరు నెలకు అర లీటరు కంటే ఎక్కువ నూనె వాడితే అది ఎక్కువ. అంటే రోజుకు 4 స్పూన్లు వాడుతున్నారని అర్థం. దీన్ని లెక్కించి నూనె వాడకం తగ్గించండి. ప్రతి నెలా చూసుకుంటే కొన్నాళ్లకు నూనె వాడకం తగ్గుతుంది. ఈ అలవాటు అందరినీ ఆరోగ్యంగా ఉంచుతుంది.

55
నూనె ఎలా తగ్గించాలి?

- వేపుళ్ళు తినడం మానేయండి. 
- ఉడికించిన లేదా ఆవిరి మీద ఉడికించినవి తినండి.
- సలాడ్స్‌లో నూనె తక్కువ వాడండి.
- ప్యాక్ చేసిన ఆహారం తినడం తగ్గించండి. 
- ఇంట్లో వంట చేసేటప్పుడు నూనె తక్కువ వాడండి.
- ఒకే నూనె పదే పదే వాడకండి.
- వ్యాయామం చేసి కేలరీలు ఖర్చు చేయండి.
- నూనె వాడకం తగ్గించడం వల్ల ఆరోగ్యంగా ఉండొచ్చు. కొలెస్ట్రాల్ నియంత్రణలో ఉంటుంది. గుండె జబ్బులు రాకుండా చూసుకోవచ్చు. ఆరోగ్యకరమైన జీవితం గడపవచ్చు.

Read more Photos on
click me!

Recommended Stories