Cool Drinks: ఈ డ్రింక్స్ తాగితే క్యాన్సర్ ముప్పు.. ఇవి ఆల్కహాల్ కంటే ప్రమాదం!

కూల్ డ్రింక్స్ ని చాలామంది ఇష్టంగా తాగుతారు. చల్లగా, తియ్యగా ఉంటాయి కాబట్టి వాటి రుచిని చాలామంది ఇష్టపడతారు. ఎండాకాలంలో అయితే ఇంకా ఎక్కువగా తీసుకుంటారు. కానీ కూల్ డ్రింక్స్ తాగడం ఆరోగ్యానికి ఎంతమాత్రం మంచిది కాదని చెబుతున్నాయి పరిశోధనలు. ఎందుకు తాగకూడదు? తాగితే ఏమవుతుందో ఇక్కడ తెలుసుకుందాం.

Soft Drinks and Cancer Risk Increased in telugu KVG

ప్రపంచవ్యాప్తంగా క్యాన్సర్ వ్యాధి వేగంగా పెరుగుతోంది. సాధారణంగా స్మోకింగ్, డ్రింకింగ్ వల్లనే క్యాన్సర్ వస్తుందని చాలామంది అనుకుంటారు. కానీ కూల్ డ్రింక్స్ వల్ల కూడా క్యాన్సర్ వస్తుందని ఇటీవలి పరిశోధనలు చెబుతున్నాయి.

Soft Drinks and Cancer Risk Increased in telugu KVG
నోటి క్యాన్సర్..

వాషింగ్టన్ విశ్వవిద్యాలయం చేసిన పరిశోధనలో కూల్ డ్రింక్స్ లాంటి చక్కెర పానీయాలు నోటి క్యాన్సర్ వచ్చే ప్రమాదాన్ని 5 రెట్లు పెంచుతాయని తేలింది.


మహిళల్లో ఎక్కువ

గతంలో నోటి క్యాన్సర్ కేసులు పొగాకు, మద్యం, తాంబూలం, ధూమపానం వల్ల వచ్చేవి. నోటి క్యాన్సర్ పురుషుల్లో ఎక్కువగా ఉండేది. కానీ ప్రస్తుతం పురుషుల కంటే మహిళల్లో ఎక్కువగా కనిపిస్తోందని పరిశోధనలు చెబుతున్నాయి.

కూల్ డ్రింక్సే ప్రధాన కారణం

కూల్ డ్రింక్స్ నోటి క్యాన్సర్‌కి ప్రధాన కారణమని శాస్త్రవేత్తలు చెబుతున్నారు. వాటిని వీలైనంత తక్కువగా తీసుకోవాలని సూచిస్తున్నారు. ఎంత ఎక్కువ తీసుకుంటే అంత ప్రమాదాన్ని పెంచుకున్నట్లే అని హెచ్చరిస్తున్నారు.

ఇంట్లో తయారు చేసేవి..

చల్లని పానీయాలు తాగాలనిపిస్తే ఇంట్లోనే కొన్ని డ్రింక్స్ తయారు చేసుకోవచ్చు. నిమ్మకాయ సోడా, జల్జీరా, షర్బత్, షేక్ లేదా జ్యూస్ లాంటివి తయారు చేసుకొని తాగడం ఆరోగ్యానికి చాలా మంచిది.

Latest Videos

vuukle one pixel image
click me!