Curd: పెరుగు ఇలా తీసుకుంటే బరువు తగ్గడం ఖాయం..!

Published : Apr 21, 2025, 02:32 PM IST

ప్రస్తుతం అధిక బరువు చాలామందిని ఇబ్బంది పెడుతోంది. బరువు తగ్గడం కోసం వారు రకరకాల వ్యాయామాలు, డైట్ లు ఫాలో అవుతుంటారు. అయితే కొందరు బరువు తగ్గడానికి పెరుగు తీసుకుంటారు. కానీ పెరుగును సరైన పద్ధతిలో తినకపోతే బరువు పెరిగే అవకాశాలు ఎక్కువట. మరి పెరుగు ఎలా తింటే బరువు తగ్గుతారో ఇక్కడ తెలుసుకుందాం. 

PREV
15
Curd: పెరుగు ఇలా తీసుకుంటే బరువు తగ్గడం ఖాయం..!

అధిక బరువు గురించి చాలామంది ఆందోళన చెందుతారు. బరువు ఎలా తగ్గాలో తెలియక తికమక పడుతుంటారు. కొందరు ఇంటి చిట్కాలు పాటిస్తే, మరికొందరు కఠిన వ్యాయామాలు చేస్తుంటారు. కొందరు బరువు తగ్గడానికి వారి డైట్ లో పెరుగును చేర్చుకుంటారు. కానీ పెరుగు ఎలా తీసుకుంటే బరువు తగ్గుతారో ఇక్కడ తెలుసుకుందాం.

25
పెరుగు ఎలా తింటే మంచిది?

చాలామంది బరువు తగ్గడానికి రెండు పూటలా పెరుగు తింటారు. పెరుగు తినడం మంచిదే అయినప్పటికీ.. సరైన పద్ధతిలో తినకపోతే బరువు పెరుగుతారని నిపుణులు చెబుతున్నారు. డైటింగ్ చేసేటప్పుడు పెరుగు తినాలంటే ఇవి తప్పకుండా పాటించాలని సూచిస్తున్నారు.

35
ఎలాంటి పెరుగు తినాలి?

బరువు తగ్గాలి అనుకున్నప్పుడు ప్లెయిన్ పెరుగు ఎంచుకోండి. తీపి పెరుగు లేదా ఏదైనా ఫ్లేవర్ ఉన్న పెరుగు తినకూడదు. పుల్లటి పెరుగు తినాలి. దానికి ఏ రకమైన తీపి కూడా కలపకూడదు.

45
ఎంత పెరుగు తినాలి?

పెరుగు పరిమితంగా తినాలి. 150 నుంచి 200 గ్రాముల కంటే ఎక్కువ పెరుగు తినకూడదు. రోజంతా ఈ పరిమాణం కంటే ఎక్కువ పెరుగు తింటే నష్టం జరుగుతుంది. పెరుగు ఎక్కువగా తింటే బరువు తగ్గే బదులు పెరుగుతారు.

55
పెరుగు ఎప్పుడు తినచ్చు?

బ్రేక్ ఫాస్ట్ లో పెరుగు తినడం మంచిదని నిపుణులు చెబుతున్నారు. దీనివల్ల బరువు త్వరగా తగ్గుతారట. కానీ కేవలం పెరుగు తినడం మాత్రమే కాదు.. ప్రతిరోజూ వ్యాయామం చేస్తూ మంచి డైట్ ఫాలో కావాలని నిపుణులు సూచిస్తున్నారు.

Read more Photos on
click me!

Recommended Stories