Smoking: ద‌మ్ము కొడుతున్నారా.? అయితే మీకు పిల్ల‌లు పుట్ట‌డం క‌ష్టం

Published : Aug 06, 2025, 03:51 PM IST

Infertility: ఒక‌ప్పుడు సంతాన‌లేమి అంటే మ‌హిళ‌ల్లో క‌నిపించే స‌మ‌స్య‌గానే భావించేవాళ్లం. కానీ ప్ర‌స్తుతం పురుషుల్లో కూడా ఈ స‌మ‌స్య ఎక్కువుతోంది. దీనికి ఎన్నో కార‌ణాలు ఉన్నాయి. అలాంటి వాటిలో ఒక కార‌ణం గురించి ఇప్పుడు తెలుసుకుందాం. 

PREV
14
పెరుగుతోన్న సంతాన‌లేమి స‌మ‌స్య‌

ఇటీవ‌ల సంతాన‌లేమి స‌మ‌స్య పెరుగుతోంది. పురుషులు కూడా దీంతో బాధ‌ప‌డుతున్నారు. మారిన జీవన విధానం, తీసుకుంటున్న ఆహారంలో మార్పులు, ఒత్తిడి పెరగడం, మారిన పని విధానం ఇలా రకరకాల కారణాల కారణంగా పురుషుల్లో సంతానలేమి సమస్యలు వస్తున్నాయి.

DID YOU KNOW ?
స్పెర్మ్ కౌంట్‌పై ప్ర‌భావం
ధూమపానం వల్ల పురుషుల్లో స్పెర్మ్ కౌంట్ 19% వరకు తగ్గుతుంది. స్పెర్మ్ క్వాలిటీ, చలనం, డీఎన్ఏ ఆరోగ్యంపై దీని ప్రభావం తీవ్రంగా ఉంటుంది.
24
పొగాకు ఏదైనా ప్రమాదమే

సిగరెట్, బీడీ, హుక్కా ఇలా ఎలాంటి వాటిలో అయినా కామన్‌గా ఉండే ర‌సాయ‌నం నికోటిన్‌. ఈ విష ప‌దార్థం ర‌క్త‌నాళాల‌ల‌ను దెబ్బ‌తీస్తుంది. స‌హ‌జంగానే పురుషుల్లో అంగం గ‌ట్టిప‌డాలంటే ర‌క్తం స‌రిగ్గా స‌ర‌ఫ‌రా ఉండాలి. అయితే ధూమ‌పానం కార‌ణంగా ర‌క్త‌నాళాల లోప‌ల గ‌ట్టిత‌నం ఏర్ప‌డుతుంది. ర‌క్త స‌ర‌ఫ‌రా స‌రిగ్గా లేక‌పోవ‌డంతో అంగ‌స్తంభ‌న స‌మ‌స్య‌లు వ‌స్తాయి. ఇది సంతాన‌లేమికి దారి తీస్తుంది.

34
టెస్టో స్టిరాన్‌పై ప్ర‌భావం

పొగాకు తాగే వారిలో టెస్టోస్టిరాన్‌పై ప్రభావం ప‌డుతుంది. దీంతో వీర్య క‌ణాల ఉత్ప‌త్తి త‌గ్గ‌డంతో పాటు నాణ్య‌త కూడా త‌గ్గుతుంది. ఇది కూడా పురుషుల్లో సంతాన‌లేమి స‌మ‌స్య‌కు దారి తీస్తుంది. గ‌ర్భం దాల్చాలంటే వీర్య క‌ణాలు స‌మృద్ధిగా ఉండాలి. అయితే స్మోకింగ్ వ‌ల్ల ఆ సంఖ్య త‌గ్గుతుంది. టెస్టోస్టిర‌న్ హార్మోన్ విడుద‌లపై కూడా తీవ్ర ప్ర‌భావం ప‌డుతుంది.

44
ఫిల్ట‌ర్ సిగ‌రెట్ అయినా ప్ర‌మాద‌మే

కొంద‌రు ఫిల్ట‌ర్ సిగ‌రెట్స్‌, హుక్కాతో పెద్ద‌గా ప్ర‌మాదం ఉండ‌ద‌నే అభిప్రాయంతో ఉంటారు. అయితే ఇందులో నిజం లేదు. ఎలాంటి పొగాకు ప్రొడ‌క్ట్ అయినా అందులో నికోటిన్ ఉంటుంది. క‌చ్చితంగా దాంపత్య జీవితంపై ప్ర‌భావం చూపుతుంది. స్మోకింగ్ మానేస్తే దాని దుష్ప్ర‌భావాలు క్ర‌మంగా త‌గ్గుతాయి.

పూర్తి వీడియో ఇక్కడ చూడండి..

(ఇక్కడ డాక్టర్ గొపరాజు సమరం గారు తెలిపిన వైద్య సమాచారం, అభిప్రాయాలు, ఆయన వైద్య అనుభవం, ప్రజారోగ్య రంగంలో చేసిన సేవల ఆధారంగా అందించాము. దీనిని కేవలం ప్రాథమిక సమాచారంగానే భావించాలి. ఇది వైద్యుల సలహాకు బదులుగా భావించకండి. దయచేసి మీ ఆరోగ్య పరిస్థితులకు సరైన నిర్ధారణ, చికిత్స కోసం అర్హత గల వైద్యులను సంప్రదించండి.)

Read more Photos on
click me!

Recommended Stories