Skin care tips: మెరిసే చర్మం కావాలంటే ? ఈ సింపుల్​ టిప్స్‌ పాటిస్తే సరి!

Published : Jun 28, 2025, 08:39 AM IST

Skin Care Tips: అందమైన, మెరిసే చర్మం కావాలని ప్రతి ఒక్కరూ కోరుకుంటూ ఉంటుంది. మచ్చలేని అందం కోసం రకరకాల క్రీమ్‌లు, ఫేస్‌ ప్యాక్స్‌ ట్రై చేస్తూ ఉంటారు. కానీ,  మీ చర్మాన్ని అందంగా, ఆరోగ్యంగా ఉంచుకోవడానికి కొన్ని జాగ్రత్తలు పాటిస్తే చాలంట. అవేంటో? 

PREV
15
మెరిసే చర్మం కోసం

చర్మ సంరక్షణలో శుభ్రపరచడం, తేమను అందించడం, రక్షించడం అనే మూడు ముఖ్యమైన దశలు ఉన్నాయి. ధూళి, చెమట కారణంగా రంధ్రాలు మూసుకుపోయి మొటిమలు వస్తాయి. కాబట్టి, ఉదయం, రాత్రి పూట క్లెన్సర్ తో ముఖాన్ని శుభ్రం చేసుకోవడం చాలా ముఖ్యం.

25
సబ్బుకి బదులుగా

ముఖాన్ని శుభ్రం చేయడానికి సబ్బుకి బదులుగా మృదువైన క్లెన్సర్‌ను ఉపయోగించాలి. ఎందుకంటే సబ్బులు చర్మంపై ఉన్న సహజ నూనెలను తొలగిస్తాయి. చర్మాన్ని పొడిగా మారుస్తాయి. అలా ముఖాన్ని గోరువెచ్చని నీటిలతో శుభ్రం చేసుకోవాలి. ఆరిన తర్వాత  సీరం లేదా మాయిశ్చరైజర్ ఆప్లై చేయాలి. ఇది చర్మ సంరక్షణకు చాలా ముఖ్యం.

35
మాయిశ్చరైజర్ ఎందుకు?

సీరం తర్వాత మాయిశ్చరైజర్ వాడటం ముఖ్యం. సీరం చర్మాన్ని లోతుగా హైడ్రేట్ చేస్తుంది, మాయిశ్చరైజర్ ఆ హైడ్రేషన్‌ను లాక్ చేసి, చర్మాన్ని మృదువుగా, తేమగా ఉంచుతుంది. జిడ్డు చర్మానికి జెల్ మాయిశ్చరైజర్లు, పొడి చర్మానికి క్రీమ్ మాయిశ్చరైజర్లు వాడటం బెటర్. 

45
ఎలాంటి సన్‌స్క్రీన్ వాడాలి?

సూర్యరశ్మి నుంచి చర్మాన్ని రక్షించుకోవడానికి సన్‌స్క్రీన్ ఉపయోగించడం చాలా ముఖ్యం. SPF 30 లేదా అంతకంటే ఎక్కువ ఉన్న సన్‌స్క్రీన్‌ను ప్రతిరోజూ ఉపయోగించాలి, వర్షాకాలం, చలికాలంలో కూడా దీనిని ఉపయోగించాలి. 

55
ఇతర మార్గాలు

చర్మం ఆరోగ్యం కోసం మీ జీవనశైలిలో కొన్ని మార్పులు చేసుకోవాలి. నీరు ఎక్కువగా త్రాగాలి, పండ్లు, కూరగాయలు తినాలి, మంచి నిద్ర అవసరం, ఒత్తిడి తగ్గించుకోవాలి, చర్మ రకానికి తగ్గ ఉత్పత్తులను వాడాలి.

Read more Photos on
click me!

Recommended Stories