యాలకులు వంటలకు రుచి, సువాసన పెంచుతాయి. వాటిలో ఉండే ఔషధ గుణాలు ఆరోగ్యానికి మేలు చేస్తాయి. ప్రతి రోజూ యాలకులు నానబెట్టిన నీళ్లను తాగితే అనేక ఆరోగ్య ప్రయోజనాలు ఉన్నాయని చెబుతున్నారు నిపుణులు. అవేంటో ఇక్కడ చూద్దాం.
నిపుణుల ప్రకారం యాలకుల నీళ్లు తాగడం వల్ల చాలా ఆరోగ్య ప్రయోజనాలున్నాయి. యాలకులను వేడి నీటిలో నానబెట్టి తాగితే చాలా లాభాలు కలుగుతాయి. యాలకుల నీళ్లు జీర్ణ ఎంజైమ్‌ల ఉత్పత్తిని ప్రేరేపించి, ఆహారం సులభంగా జీర్ణం కావడానికి సహాయపడతాయి. అజీర్తి, గ్యాస్, ఉబ్బరం వంటి జీర్ణ సమస్యలను, కడుపు నొప్పిని తగ్గిస్తాయి. మలబద్ధకాన్ని నివారించడంలో కూడా ఈ వాటర్ బాగా సహాయపడతాయి.
25
నోటి ఆరోగ్యానికి..
యాలకులలోని యాంటీ మైక్రోబయల్ గుణాలు నోటిలోని బ్యాక్టీరియాతో పోరాడి, నోటి దుర్వాసనను దూరం చేస్తాయి. ఇది సహజ మౌత్ ఫ్రెషనర్‌లా పనిచేస్తుంది. రోజూ రెండు యాలకులు నమిలి తింటే నోరు తాజాగా ఉంటుంది. అంతేకాదు ఇవి శరీరంలోని విష పదార్థాలను మూత్రం ద్వారా బయటకు పంపి.. మూత్రపిండాలు, కాలేయ ఆరోగ్యాన్ని మెరుగుపరుస్తాయి.
35
చర్మ ఆరోగ్యానికి..
యాలకుల నీరు తాగితే రక్తపోటు నియంత్రణలో ఉంటుంది. దీనిలోని పొటాషియం, ఇతర ఖనిజాలు రక్త ప్రసరణను మెరుగుపరిచి, అధిక రక్తపోటును తగ్గిస్తాయి. జలుబు, దగ్గు, ఆస్తమా, ఇతర శ్వాసకోశ సమస్యల నుంచి ఉపశమనం కలిగించడంలో యాలకులు సహాయపడతాయి. ఇందులోని యాంటీఆక్సిడెంట్లు చర్మ కణాలను దెబ్బతీసే ఫ్రీ రాడికల్స్‌తో పోరాడుతాయి. ఇవి చర్మాన్ని ఆరోగ్యంగా, కాంతివంతంగా ఉంచడంలో సహాయపడతాయి.
యాలకులకు మనసును ప్రశాంతపరిచే గుణాలున్నాయి. యాలకుల నీళ్లు తాగితే ఒత్తిడి, ఆందోళన తగ్గి, మానసిక స్థితి మెరుగుపడుతుంది. యాలకుల నీళ్లు జీవక్రియను పెంచుతాయి. అంతేకాదు యాలకుల నీళ్లు రక్తంలో చక్కెర స్థాయిలను నియంత్రించడంలో సహాయపడతాయని కొన్ని అధ్యయనాలు చెబుతున్నాయి.
55
యాలకుల నీళ్లు ఎలా తయారు చేసుకోవాలి?
1-2 యాలకులను తీసుకుని పై తొక్క తీసి లోపలి గింజలను ఒక గ్లాసు నీటిలో నానబెట్టండి. ఉదయం లేవగానే ఈ నీళ్లను అలాగే తాగవచ్చు లేదా గింజలు తీసేసి తాగవచ్చు. యాలకుల పొడి వాడితే, గోరువెచ్చని నీటిలో కలిపి తాగవచ్చు. ఏవైనా ఆరోగ్య సమస్యలు ఉన్నవారు లేదా గర్భిణీలు యాలకుల నీళ్లు తాగే ముందు వైద్యుల సలహా తీసుకోవడం మంచిది.