30 ఏళ్లు దాటిన ఆడవాళ్లు కచ్చితంగా తినాల్సిన ఫుడ్స్ ఏంటో తెలుసా?

Published : Sep 05, 2025, 03:13 PM IST

వయసు పెరిగే కొద్దీ శరీరంలో శక్తి తగ్గిపోతుంది. ముఖ్యంగా ఆడవాళ్లలో ఇది ఎక్కువగా కనిపిస్తుంది. నిజానికి వారు తీసుకునే ఆహారమే వారి భవిష్యత్ ఆరోగ్యాన్ని నిర్ణయిస్తుంది. 30 ఏళ్లు దాటిన స్త్రీలు కచ్చితంగా తినాల్సిన ఫుడ్స్ కొన్ని ఉన్నాయి. అవేంటో చూద్దాం.

PREV
17
30 ఏళ్లు దాటిన స్త్రీలు తినాల్సిన ఫుడ్స్..

30 ఏళ్లు దాటిన తర్వాత స్త్రీ శరీరంలో చాలా మార్పులు చోటుచేసుకుంటాయి. హార్మోన్ల అసమతుల్యత, బోన్ డెన్సిటీ తగ్గుదల, మెటబాలిజం మందగించడం, చర్మంపై ముడతలు, పీరియడ్స్ సమస్యలు, ఫెర్టిలిటీ మార్పులు ఇలా అనేక సమస్యలు వస్తుంటాయి. ఈ దశలో స్త్రీలు తీసుకునే ఆహారమే.. వారి భవిష్యత్ ఆరోగ్యాన్ని నిర్ణయిస్తుంది. కాబట్టి 30 ఏళ్లు దాటిన స్త్రీలు తప్పనిసరిగా కొన్ని ఆహార పదార్థాలు తీసుకోవాలి. అవేంటో ఇక్కడ తెలుసుకుందాం.   

27
ఆకుకూరలు

తోటకూర, పాలకూర, గోంగూర వంటి ఆకుకూరల్లో విటమిన్ K, ఐరన్, కాల్షియం అధికంగా ఉంటుంది. వీటిని తీసుకోవడం ద్వారా ఎముకలు బలపడతాయి. హార్మోన్లు సమతుల్యంగా ఉంటాయి. అంతేకాదు వీటిలోని ఫైబర్ జీర్ణాశయ సమస్యలను తగ్గించడానికి సహాయపడుతుంది.

37
పండ్లు

ముప్పై ఏళ్లు దాటిన స్త్రీలు పండ్లు తినడం వల్ల గుండె ఆరోగ్యం, జీర్ణక్రియ మెరుగుపడుతుంది. ముఖ్యంగా ద్రాక్ష, బొప్పాయి, జామ, మామిడి, నారింజ, సీతాఫలం వంటివి తీసుకోవడం మంచిది. వీటిలోని యాంటీ ఆక్సిడెంట్లు వృద్ధాప్యాన్ని ఆలస్యం చేస్తాయి. విటమిన్ C చర్మ ఆరోగ్యానికి సహాయపడుతుంది. ఫైబర్ జీర్ణక్రియను మెరుగుపరుస్తుంది. 

47
పప్పులు, గింజలు

పప్పులు, గింజల్లో ప్రోటీన్, ఫైబర్, విటమిన్ B వంటివి పుష్కలంగా ఉంటాయి. వీటిని తీసుకోవడం ద్వారా శరీరానికి బలం చేకూరుతుంది. వీటిలోని ఐరన్ రక్తహీనతను నివారిస్తుంది. ఫైటోఎస్ట్రోజెన్లు.. ఈస్ట్రోజెన్‌ను సంతులితం చేస్తాయి.

57
పాల ఉత్పత్తులు

పాల ఉత్పత్తులు కూడా ఆరోగ్యానికి మేలు చేస్తాయి. ముఖ్యంగా వీటిలోని కాల్షియం, విటమిన్ D.. ఎముకల బలానికి సహాయపడతాయి. ప్రోబయోటిక్స్.. గట్స్ హెల్త్ కు మంచిది. కొన్ని అధ్యయనాల ప్రకారం.. పాల ఉత్పత్తులు తీసుకోవడం ద్వారా గుండె జబ్బులు, ఊబకాయం, కొన్ని క్యాన్సర్ల ప్రమాదం తగ్గుతుందట.  

67
డ్రై ఫ్రూట్స్

డ్రైఫ్రూట్స్ కూడా ఆరోగ్యానికి చాలా మంచిది. వీటిలోని ఓమేగా-3 ఫ్యాటీ యాసిడ్లు గుండె ఆరోగ్యానికి మేలు చేస్తాయి. మెగ్నీషియం నరాల వ్యవస్థ బలోపేతానికి సహాయపడుతుంది. విటమిన్ E చర్మ రక్షణకు, జుట్టుకు పోషణకు తోడ్పడుతుంది.

77
నాన్ వెజ్

30 ఏళ్లు దాటిన మహిళలు మాంసాహారం తినడం వల్ల చాలా లాభాలున్నాయి. నాన్ వెజ్ లోని ప్రోటీన్.. కండరాల నిర్మాణానికి సహాయపడుతుంది. ఐరన్, B12 శరీరానికి శక్తినిస్తుంది. మెదడు పనితీరును మెరుగుపరుస్తుంది. ఓమేగా-3 ఫ్యాటీ యాసిడ్స్ మెదడు, గుండె ఆరోగ్యానికి సహాయపడతాయి. 

గమనిక..

ఆరోగ్య నిపుణుల సలహా తీసుకున్న తర్వాత మాత్రమే మీ ఆహారంలో మార్పులు చేసుకోవడం మంచిది.

Read more Photos on
click me!

Recommended Stories