Sea buckthorn: వ్యోమగాములు తినే అరుదైన పండు.. దాని ప్రయోజనాలు తెలిస్తే అస్సలు వదలరు..

Published : Jun 30, 2025, 09:42 AM IST

Sea buckthorn Health Benefits: హిమాచల్ ప్రదేశ్, ఉత్తరాఖండ్‌లలో లభించే అరుదైన పండు సీ బక్‌థార్న్. ఇది ఆరోగ్యానికి ఎంతో మేలు చేస్తుంది. ఈ పండులో ఎన్నో విటమిన్లు,  ఖనిజాలు పుష్కలంగా ఉంటాయి.  వ్యోమగాములు తినే ఈ పండు వల్ల కలిగే లాభాలేంటో ఓ లూక్కేద్దామా?

PREV
110
ఎన్నో ఔషధ గుణాలు

సీ బక్‌థార్న్ అంటే సముద్రంలో దొరికే మొక్క అనుకుంటే పొరపాటు. హిమాచల్ ప్రదేశ్, ఉత్తరాఖండ్‌ లోని ఎత్తైన ప్రాంతాలలో దొరికే ఔషధ మొక్క. సీ బక్‌థార్న్ ఫ్రూట్ ఆరోగ్యానికి ఎంతో మేలు చేస్తుంది. 

210
ప్రత్యేకత

సీ బక్‌థార్న్ పండును అమెస్ అని కూడా పిలుస్తారు. సీ బక్‌థార్న్ పేరు వినగానే ఇది సముద్రపు మొక్కనో, సముద్ర ప్రాంతంలో లభించే పండు కావచ్చని భావించారు కదా. ఈ మొక్క ఉత్తరాఖండ్‌లోని ఎత్తైన ప్రాంతాలలో పెరుగుతుంది. ఇది పసుపు రంగులో ఉంటుంది. ఈ పండుతో చేసిన చట్నీకి  డిమాండ్ ఎక్కువే. 

310
పోషకాల ఖని

సీ బక్‌థార్న్ ఫ్రూట్ లో విటమిన్లు సి, ఇ, అమైనో ఆమ్లాలు, లిపిడ్లు, బీటా కెరోటిన్, లైకోపీన్, ప్రో-విటమిన్లు, ఖనిజాలు పుష్కలంగా ఉంటాయి. అలాగే..  ఇందులో యాంటీ ఆక్సిడెంట్లు పుష్కలంగా ఉంటాయి. రోగనిరోధక శక్తిని బలోపేతం చేసే అద్భుతమైన ఫలం ఇది. 

410
కలియుగ సంజీవని

శాస్త్రీయ అధ్యయనాల ప్రకారం.. సీ బక్‌థార్న్ పండు కలియుగ సంజీవని. ఈ పండులో అనేక ఔషధ గుణాలు ఉన్నాయి. ఈ  పండు ప్రతిరోజూ తీసుకుంటే.. అనేక ఆరోగ్య ప్రయోజానాలు పొందవచ్చు. ముఖ్యంగా ఇది ఇమ్యూనిటీ పెంపునకు మేలుచేస్తుంది. ఇందులో ఉన్న విటమిన్ C శరీరాన్ని రోగాలకు వ్యతిరేకంగా పోరాడే శక్తిని ఇస్తుంది.

510
గుండె ఆరోగ్యాన్ని

ఇందులో ఓమెగా-3, 6, 7, 9 ఫ్యాటీ యాసిడ్లు, విటమిన్ C, A, E, ఫ్లేవనాయిడ్స్, యాంటీ ఆక్సిడెంట్లు పుష్కలంగా ఉంటాయి. ఇవి గుండె ఆరోగ్యాన్ని కాపాడతాయి. కొలెస్ట్రాల్ స్థాయిలను తగ్గించి హృద్రోగాల నివారణకు తోడ్పడతుంది. 

610
చర్మ సమస్యలకు చెక్

చర్మ సమస్యలకు ఇది ఒక అద్భుత ఔషధం. ఓమెగా-7 ఫ్యాటీ యాసిడ్ చర్మాన్ని తేమగా ఉంచి ముడతలు తగ్గించడంలో సహాయపడుతుంది. 

710
పలు వ్యాధులకు పరిష్కారం

డయాబెటిస్ ఉన్నవారు ఈ పండు తినడం వల్ల షుగర్ నియంత్రణలోకి వస్తుంది.  అలాగే, కాలేయ ఆరోగ్యానికి కూడా ఇది ఎంతో మేలు చేస్తుంది. అలాగే.. శ్వాసనాళ సంబంధిత ఇన్ఫెక్షన్లు, గొంతు వాపులు వంటి వాటిని తగ్గించడంలో కూడా ఇది ఉపయోగపడుతుంది. మెదడు పనితీరును మెరుగుపరిచి మానసిక ఒత్తిడిని తగ్గిస్తుంది.

810
జీర్ణ వ్యవస్థ మెరుగు

జీర్ణక్రియను మెరుగు చేయడంలో సీ బక్‌థార్న్ ఎంతగానో ఉపయోగపడుతుంది. ఇందులోని శోథ నిరోధక లక్షణాలు గట్ ఆరోగ్యానికి సహాయపడతాయి, మలబద్ధకం నుండి ఉపశమనం అందిస్తాయి. 

910
బరువు తగ్గడంలో

సీ బక్‌థార్న్ పండును రోజూ తినడం వల్ల ఎన్నో ఆరోగ్య ప్రయోజనాలు పొందవచ్చు. అలాగే బరువు తగ్గడంలో సహాయపడుతుంది. సీ బక్‌థార్న్ రసం జీవక్రియను ప్రోత్సహిస్తుంది. అలాగే.. ఇది కొవ్వు నిల్వను నియంత్రించడం ద్వారా బరువు తగ్గుతుంది.

1010
వ్యోమగాముల ఆహారంలో భాగం.

మరో ఆసక్తికర విషయమేమిటంటే.. ఈ పండులో ఎన్నో ఆర్యోగ ప్రయోజనాలు ఉండటంతో 80 వ దశకంలో రష్యా అంతరిక్ష విభాగం ఓ కీలక నిర్ణయం తీసుకుంది. తమ వ్యోమగాములకు డైట్ లో పండును కూడా చేర్చింది. ఇది రేడియేషన్‌ను ఎదుర్కోవడానికి కావాల్సిన శక్తిని అందిస్తుందట.

Read more Photos on
click me!

Recommended Stories