మన కడుపు శుభ్రంగా ఉండటం మొత్తం ఆరోగ్యానికి చాలా అవసరం. మీ కడుపులోని వ్యర్థాలు బయటకు వెళ్లకుండా కడుపులోనే ఉంటే శారీరక ఆరోగ్యంతో పాటు మానసిక ఆరోగ్యం కూడా దెబ్బతింటుందని మీకు తెలుసా? అవును. ఇది నిజం. కడుపులోని వ్యర్థాలు సరిగ్గా బయటకు వెళ్లకపోతే జీర్ణ సమస్యలు, మలబద్ధకం, ఆకలి లేకపోవడం, అజీర్ణం, నడుము నొప్పి వంటి అనేక సమస్యలు వస్తాయి.
మీ కడుపులోని వ్యర్థాలు బయటకు వెళ్లకపోతే మీ శక్తి కూడా ప్రభావితమవుతుంది. చురుకుగా ఉండకుండా నీరసంగా అనిపిస్తుంది. ఈ సమస్యకు చెక్ పెట్టేందుకు వంటింటి చిట్కాలు ఫాలో అయితే చాలు.ఇంట్లో ఉండే వస్తువులతో కడుపులోని వ్యర్థాలను సులభంగా తొలగించవచ్చు. ఈ పోస్ట్‌లో కడుపును ఎలా సులభంగా శుభ్రం చేయాలో తెలుసుకుందాం.