కొబ్బరి నీళ్లు ఆరోగ్యానికి చాలా మంచిది. ముఖ్యంగా ఎండాకాలంలో శరీరంలో నీటి కొరత ఏర్పడినప్పుడు కొబ్బరి నీళ్లు తాగితే శరీరం చల్లగా ఉంటుంది. రోగనిరోధక శక్తి కూడా పెరుగుతుంది. కొబ్బరి నీళ్లలో యాంటీ ఆక్సిడెంట్ లక్షణాలు ఉన్నాయి. ప్రతిరోజు కొబ్బరి నీళ్లు తాగితే శరీరం నుంచి చాలా రకాల టాక్సిన్స్ బయటకు పోతాయి.
కొబ్బరి నీళ్ల ప్రయోజనాలు
గుండె ఆరోగ్యానికి
కొబ్బరి నీళ్లు తాగడం వల్ల గుండె ఆరోగ్యంగా ఉంటుంది. కొబ్బరి నీళ్లు కొలెస్ట్రాల్, ట్రై-గ్లిజరైడ్ల స్థాయిని తగ్గిస్తుంది. క్రమం తప్పకుండా తాగితే రక్తం గడ్డకట్టడం, గుండెపోటు లేదా స్ట్రోక్ వచ్చే ప్రమాదం తగ్గుతుందని నిపుణులు చెబుతున్నారు.
రక్తపోటు అదుపులో..
రోజుకు ఒకటి లేదా రెండుసార్లు కొబ్బరి నీళ్లు తాగడం వల్ల రక్తపోటు నియంత్రణలో ఉంటుంది. కొబ్బరి నీళ్లలో పొటాషియం పుష్కలంగా ఉంటుంది. ఇది రక్తపోటును సాధారణంగా ఉంచడానికి సహాయపడుతుంది.
బరువు తగ్గడానికి..
ఇతర జ్యూస్‌లతో పోలిస్తే కొబ్బరిలో చక్కెర, పిండి పదార్థాలు చాలా తక్కువగా ఉంటాయి. ఇవి బరువు తగ్గడానికి కూడా సహాయపడుతాయి. కొబ్బరి నీళ్లు తాగితే జీవక్రియ పెరుగుతుంది, ఇందులో చాలా తక్కువ మొత్తంలో కార్బోహైడ్రేట్లు ఉంటాయి. అంతేకాదు రోగనిరోధక శక్తి పెరగడానికి కూడా కోకోనట్ వాటర్ తాగడం మంచిది.
కొబ్బరి నీళ్లు ఎవరు తాగొద్దు?
నిపుణుల అభిప్రాయం ప్రకారం అధిక రక్తపోటు, కిడ్నీ, డయాబెటిస్, అలర్జీ, జీర్ణ సమస్యలు ఉన్నవాళ్లు కొబ్బరి నీళ్లు తాగకపోవడమే మంచిది. కొబ్బరి నీళ్లు తాగడం వల్ల వారికి మరిన్ని సమస్యలు వచ్చే ప్రమాదం ఉందట. ఒకవేళ వారు తాగాలి అనుకుంటే కచ్చితంగా డాక్టర్ సలహా తీసుకున్నాకే తాగాలని నిపుణులు సూచిస్తున్నారు.