Onion Juice Benefits: ‘ఉల్లి చేసే మేలు తల్లి కూడా చేయదు’ అంటారు. ఉల్లి కేవలం వంటకాలను రుచిగా మార్చడంలోనే కాకుండా రోగనిరోధక శక్తిని పెంచడం నుంచి షుగర్ ను నియంత్రించడం వరకు ఎన్నో ప్రయోజనాలున్నాయి. అలాంటి ఉల్లిరసం తాగితే కలిగే ప్రయోజనాలేంటీ?
ఉల్లిపాయ ఆరోగ్యానికి ఎంతోమేలు చేస్తాయి. ఇది రక్తంలో చక్కెర స్థాయిలను నియంత్రించడంలో, గుండె ఆరోగ్యాన్ని మెరుగుపరచడంలో, రోగనిరోధక శక్తిని పెంచడంలో సహాయపడుతుంది. అలాగే ఉల్లిలో యాంటీఆక్సిడెంట్లు, యాంటీబాక్టీరియల్, యాంటీ ఇన్‌ఫ్లమేటరీ గుణాలు ఉంటాయి. అలాంటి ఉల్లి రసాన్ని ఉదయాన్నే ఖాళీ కడుపుతో తాగితే ఎలాంటి ఆరోగ్య సమస్యలకు పరిష్కారం లభిస్తుందో తెలుసుకుందాం.
25
ఉల్లిపాయలో ఉండే పోషకాలు :
ఉల్లిపాయలో ఫోలేట్, విటమిన్ C, విటమిన్ B6, పొటాషియం, మెగ్నీషియం వంటి ముఖ్యమైన పోషకాలు పుష్కలంగా ఉన్నాయి. ఇవి శరీరంలో రోగనిరోధక శక్తిని పెంచడంలో, శరీర క్రియాశీలతను మెరుగుపరచడంలో సహాయపడతాయి. జర్నల్ ఆఫ్ న్యూట్రిషన్ (2024)లో ప్రచురితమైన అధ్యయనం ప్రకారం.. ఉల్లిపాయలో ఉండే శక్తివంతమైన యాంటీఆక్సిడెంట్లు మన శరీరంలోని ఫ్రీ రాడికల్స్‌ను నాశనం చేస్తాయి.
35
రోగనిరోధక శక్తిని బలోపేతం
ఉల్లిపాయలో విటమిన్ C, జింక్, యాంటీఆక్సిడెంట్లు పుష్కలంగా ఉంటాయి. ఇవి శరీరంలో రోగనిరోధక శక్తిని బలోపేతం చేయడంలో కీలక పాత్ర పోషిస్తాయి. అలాగే, ఉల్లిపాయలోని యాంటీ అలెర్జీ, యాంటీ బాక్టీరియల్ గుణాలు శరీరాన్ని బ్యాక్టీరియా, వైరస్ ఇన్ఫెక్షన్ల నుండి రక్షిస్తాయి. అలాగే జలుబు, దగ్గు వంటి సాధారణ శ్వాసకోశ వ్యాధులను నిరోధిస్తాయి.
జీర్ణక్రియను మెరుగుపరిచే శక్తి కూడా!
ఉల్లిపాయలో ఉండే ఇన్యులిన్ అనే ప్రీబయోటిక్ ఫైబర్ ప్రేగుల్లోమంచి బ్యాక్టీరియాల పెరుగుదలకు సహాయపడుతుంది. ఇవి జీర్ణవ్యవస్థను బలోపేతం చేస్తాయి. ఫుడ్ అండ్ ఫంక్షన్ జర్నల్ ప్రకారం.. ఉల్లిపాయ రసం తరచుగా తీసుకోవడం వల్ల జీర్ణక్రియ మెరుగవుతుంది, అలాగే మలబద్ధకం, ఉబ్బరం వంటి సమస్యలు తగ్గుతాయి.
ఉల్లి రసం ఒక సహజ డిటాక్సిఫైయర్‌గా పనిచేస్తుంది. ఇది శరీరంలో టాక్సిన్లను బయటకు పంపడమే కాకుండా, జీర్ణవ్యవస్థను బలోపేతం చేస్తుంది. అంతేకాదు, రక్తంలో చక్కెర, కొవ్వు స్థాయిలను నియంత్రించడంలో ఉపయోగపడుతుందని నిపుణులు చెబుతున్నారు. అయితే దీన్ని సరైన మోతాదులో మాత్రమే తీసుకోవాలి.
చక్కెర వ్యాధిగ్రస్తులకు: ఉల్లి రసం రక్తంలో చక్కెర స్థాయిలను స్థిరంగా ఉంచడంలో సహాయపడుతుంది. ఇందులో ఉండే సహజ గుణాలు ఇన్సులిన్ సెన్సిటివిటీని పెంచి, గ్లూకోజ్ శోషణను మెరుగుపరుస్తాయి. దీంతో షుగర్ లెవెల్స్ అదుపులో ఉండే అవకాశం ఉంటుంది.
55
చర్మ సంరక్షణ
చర్మ సంరక్షణ: ఉల్లిపాయ రసం చర్మం టోన్‌ను మెరుగుపరుస్తుంది. మచ్చలు, మొటిమలను తగ్గించడంలో సహాయపడుతుంది. అలాగే… చర్మం యవ్వనంగా కనిపించేలా చేస్తుంది.
గుండె ఆరోగ్యానికి ఉల్లి రసం: ఉల్లిపాయలో ఉండే క్వెర్సెటిన్ (Quercetin), ఇతర శక్తివంతమైన యాంటీఆక్సిడెంట్లు గుండె ఆరోగ్యాన్ని మెరుగుపరచడంలో కీలక పాత్ర పోషిస్తాయి. జర్నల్ ఆఫ్ న్యూట్రిషన్ లో ప్రచురితమైన ఒక అధ్యయనం ప్రకారం.. ఉల్లి రసాన్ని క్రమం తప్పకుండా తాగడం వల్ల చెడు కొలెస్ట్రాల్ (LDL) స్థాయిలు తగ్గుతాయి. రక్తపోటు నియంత్రణలో ఉంటుంది. తద్వారా గుండె సంబంధిత వ్యాధుల ప్రమాదం గణనీయంగా తగ్గుతుంది. ఇవి గుండె ఆరోగ్యాన్ని పరిరక్షించడంలో సహాయపడతాయి.
గమనిక: ఉల్లి రసం ఆరోగ్యానికి మంచిదే అయినా, గుండె జబ్బులు ఉన్నవారు లేదా మందులు వాడుతున్నవారు ఉల్లి రసాన్ని ఉపయోగించే ముందు తప్పనిసరిగా వైద్యుల సలహా తీసుకోవాలి.