
బరువు తగ్గాలని చాలా మంది ఉదయం పూట వ్యాయామాలు చేస్తారు, ఆహార నియమాల్లో మార్పులు చేస్తారు, జీవనశైలిని మార్చేందుకు ప్రయత్నిస్తారు. అయితే కొన్ని సందర్భాల్లో ఎంత కృషి చేసినా శరీరం వెయిట్ తగ్గడాన్ని సహకరించదు. దీనికి అనేక కారణాలు ఉండవచ్చు కానీ చాలా మంది గుర్తించని ఒక ముఖ్యమైన అంశం ఉంది.అదే రాత్రిపూట శరీరానికి సహజంగా సహకరించే కొన్ని పానీయాలు.
నిద్రలో ఉన్నప్పటికీ మన శరీరం పనిని ఆపదు. కొన్ని ప్రత్యేకమైన పదార్థాలతో తయారైన పానీయాలు జీవక్రియను ఉత్తేజితం చేసి కొవ్వు కరిగే ప్రక్రియను ముందుకు నడిపించగలవు. దీని వలన నిద్ర లేచిన తరువాత మన శరీరం మరింత ఆరోగ్యంగా ఉండే అవకాశం ఉంటుంది.
ఇవి సహజ పదార్థాలతో ఉండే పానీయాలు కావడంతో ఎటువంటి దుష్పరిణామాలు లేకుండా పని చేస్తాయి. ఇలా శరీరానికి సహజమైన మార్గంలో సహకరించే కొన్ని ప్రధాన నైట్ డ్రింక్స్ గురించి తెలుసుకుందాం.
మొదటగా చెప్పుకోవాల్సింది నిమ్మరసం. కానీ ఇది చల్లగా కాకుండా గోరువెచ్చగా తాగితేనే లాభం ఉంటుంది. ఈ విధంగా తాగితే శరీరంలోని టాక్సిన్లు బయటకు వెళ్లిపోయి, జీవక్రియలో గణనీయమైన మార్పులు వస్తాయి. నిమ్మలో ఉండే విటమిన్ సి శరీర రక్షణ వ్యవస్థను బలోపేతం చేస్తుంది.
దాల్చిన చెక్కతో తయారయ్యే నీరు కూడా అద్భుత ఫలితాలు ఇస్తుంది. దీనిలో ఉండే యాంటీ ఇన్‌ఫ్లమేటరీ లక్షణాలు శరీరంలోని మంటలను తగ్గించడమే కాకుండా, నిద్రలో ఉండగానే క్యాలొరీలు ఖర్చు అయ్యేలా చేస్తాయి. ఇది రక్తంలో చక్కెర మోతాదును కూడా నియంత్రించి, కొవ్వు నిల్వలను తగ్గిస్తుంది.
మెంతులు కూడా శరీరానికి ఎంతో మేలు చేస్తాయి. రాత్రంతా మెంతులను నీటిలో నానబెట్టి, ఆ నీటిని పడుకునే ముందు తాగితే జీర్ణవ్యవస్థ బాగా పని చేస్తుంది. ఇది కేవలం జీర్ణక్రియకే కాదు, శరీరంలోని కొవ్వును కూడా సహజంగా తగ్గించడంలో ఉపయోగపడుతుంది.
ప్రశాంతమైన నిద్ర కూడా బరువు తగ్గడంలో కీలక పాత్ర వహిస్తుంది. ఇక్కడే చమోమిలే టీ ఉపయోగపడుతుంది. ఇది ఒత్తిడిని తగ్గించి మంచి నిద్రను కలిగిస్తుంది. రాత్రిపూట సుఖంగా నిద్రపోతే శరీరంలోని కార్టిసాల్ హార్మోన్ స్థాయిలు తగ్గి, కొవ్వు పేరుకుపోవడం తగ్గుతుంది.
పసుపు పాలు గురించి మనకు తెలిసిందే. పసుపులో ఉండే కర్కుమిన్ శరీరంలో మంటను తగ్గించి యాంటీఆక్సిడెంట్‌గా పనిచేస్తుంది. ఇది రోగనిరోధక శక్తిని పెంచడమే కాకుండా జీవక్రియను కూడా ఉత్తేజితం చేస్తుంది. పసుపుతో చేసిన గోరువెచ్చని పాలను రాత్రిపూట తాగడం వల్ల శరీరాన్ని శుభ్రపరిచి, కొవ్వు కరిగే ప్రక్రియను సహజంగా ప్రేరేపిస్తుంది.
కొంతమంది సెలెరీతో తయారు చేసిన నీటిని, లేదా కలబంద రసం, అల్లం, నిమ్మతో కలిపిన టీని కూడా రాత్రిపూట తీసుకుంటారు. ఇవన్నీ కలిసి జీర్ణవ్యవస్థను శుభ్రం చేసి, శరీరాన్ని డీటాక్స్ చేస్తాయి. సెలెరీ ముఖ్యంగా పొట్ట భాగంలో పేరుకుపోయే కొవ్వును లక్ష్యంగా చేసుకుని పనిచేస్తుంది. అల్లం శరీరాన్ని వేడిగా ఉంచి జీవక్రియను వేగవంతం చేస్తుంది. నిమ్మ ఈ ప్రాసెస్‌ను శక్తివంతం చేస్తుంది.
ఈ డ్రింక్స్ అన్నీ సహజమైనవి కావడంతో రోజు రోజుకీ శరీరంలో స్వల్పంగా అయినా మార్పులు రావడం ఖాయం. అయితే ఇవి ఒక్కరోజు తాగితే చాలు అన్నదిలేదు. రోజువారీ అలవాటుగా చేసుకుంటేనే దీర్ఘకాలిక ప్రయోజనాలు పొందగలం. ఇవి కేవలం బరువు తగ్గడానికే కాదు, శరీరాన్ని అంతర్గతంగా శుభ్రపరిచి ఆరోగ్యాన్ని మెరుగుపరచడంలో ఎంతో ఉపయోగపడతాయి.