వేడి నీరు
వేడి నీరు కూడా చెవిలో ఉండే గులిమిని బయటకు తీయడానికి సహాయపడుతుంది. దీనికోసం ఒక సిరంజిలో గది ఉష్ణోగ్రత వద్ద నీటిని నింపి, తలను వంచి ఒకవైపు చెవిలో నీటిని పోయాలి. నీరు చెవిలో ఉండే గులిమిని మెత్తగా చేస్తుంది. తర్వాత చెవిని వ్యతిరేక దిశలో వంచితే గులిమి బయటకు వస్తుంది. ఆ తర్వాత గుడ్డతో చెవిని మెల్లగా తుడవాలి.
గుర్తుంచుకోండి : చెవిలోని గులిమిని తీయడానికి పెన్ను మూతలు, సూదులు, వేళ్లు, పిన్నులు, బడ్స్ వంటి వస్తువులను ఉపయోగించకూడదు.