Published : Mar 11, 2025, 12:49 PM ISTUpdated : Mar 11, 2025, 12:58 PM IST
ఎండాకాాలం వచ్చిందంటే చాలు అధిక ఉష్ణోగ్రతల నుండి ఉపశమనం కోసం కొందరు చల్లచల్లని కొబ్బరి నీళ్లు తాగితే మరికొందరు తియ్యతియ్యని చెరకు రసం ఇష్టంగా తాగుతారు. మరి ఈ రెండిట్లో ఏది మన దాహాన్ని ఎక్కువగా తీరుస్తుంది? ఎందులో ఎక్కువ హెల్త్ బెనిఫిట్స్ ఉన్నాయో తెలుసుకుందాం.
Sugarcane Juice vs Coconut Water : వేసవికాలం ఆరంభంలోనే ఎండలు మండిపోతున్నాయి. ఇంకా మార్చ్ లోనే ఉన్నాం... అప్పుడే నడి వేసవికాలంలో నమోదయ్యే ఉష్ణోగ్రతలు నమోదవుతున్నాయి. ఇప్పుడే పరిస్థితి ఇలాఉంటే మేలో ఎండలు ఎలా ఉంటాయో ఊహించుకుంటనే భయంగా ఉంది. ఈ ఎండల్లో బయటకు వెళ్లాలంటే భయపడిపోతున్నారు ప్రజలు.
అయితే ఈ ఎండలనుండి కాస్త ఉపశమాన్ని పొందేందుకు కొందరు చల్లని కొబ్బరి నీళ్లు తాగుతుంటారు. ఇక మరికొందరు తియ్యని చెరకు రసం తాగేందుకు ఇష్టపడతారు. ఈ రెండు కూడా సహజ పానియాలే కాబట్టి ఆరోగ్యానికి చాలా మంచివి. కానీ ఏది తాగడం వల్ల మనకు తొందరగా దాహం తీరుతుంది? ఎండ నుండి ఎక్కువ ఉపశమనం పొందుతాం? వీటివల్ల కలిగే ఆరోగ్యపరమైన ప్రయోజనాలేమిటి? అనేది తెలుసుకుందాం.
25
Sugarcane Juice vs Coconut Water
కొబ్బరి నీళ్లు vs చెరకు రసం : ఎందులో ఏ హెల్త్ బెనిఫిట్స్
ఎండాకాలం వచ్చిందంటే చాలు కొబ్బరి నీళ్ళు, చెరకు రసం వ్యాపారులకు గిరాకీ పెరుగుతుంది. కేవలం ఈ వేసవి నాలుగునెలల కోసమే చాలామంది కొబ్బరిబోండాలు అమ్మడం, చెరకు రసం బండ్ల పెట్టుకోవడం చేస్తుంటారు. వేడి వాతావరణంలో ఈ రెండిట్లో ఏది తాగినా రిఫ్రెషింగ్ గా ఉంటుంది.
కెమికల్స్ ను ఉపయోగించిన తయారుచేసే సాప్ట్ డ్రింక్స్ తాగడంకంటే ప్రకృతి నుండి లభించే ఈ కొబ్బరి నీళ్లు, చెరకురసం ఆరోగ్యానికి చాలా మంచింది. ఎండలో బయటకు వచ్చేవారికే కాదు అధిక ఉష్ణోగ్రతలతో ఇంట్లోనే ఉండి ఇబ్బందిపడే చిన్నపిల్లలు, వృద్దులు కూడా కొబ్బరినీళ్లు, చెరకు రసం ఎంతో మేలుచేస్తుంది.
అయితే ఈ రెండు ఆరోగ్యానికి మంచివే ... కానీ ఇవి వేరువేరు హైడ్రేషన్ బెనిఫిట్స్ కలిగి ఉన్నాయి. కాబట్టి మండుటెండల సమయంలో వెంటనే దాహం తీరాలంటే కొబ్బరి నీళ్లు తాగడం బెటరా లేక చెరకురసం మంచిదా తెలుసుకుందాం.
35
Sugarcane Juice vs Coconut Water
కొబ్బరి నీళ్లు vs చెరకు రసం : ఎలక్ట్రోలైట్స్ ఎందులో అధికం
ఎలక్ట్రోలైట్స్ స్థాయి శరీరంలో సరిగ్గా లేకపోతే ఆరోగ్య సమస్యలు తలెత్తుతాయి. అయితే కొబ్బరినీళ్లలో పుష్కలంగా ఈ ఎలక్ట్రోలైట్స్ ఉంటాయి. పొటాషియం,సోడియం, మెగ్నిషియం వంటి మినరల్స్ కొబ్బరినీళ్లలో ఉంటాయి... కాబట్టి ఎండలో తిరగడంవల్ల కోల్పోయిన ఎలక్ట్రోలైట్స్, ప్లూయిడ్స్ ను ఇవి భర్తీ చేస్తాయి.
చెరకురసంలో కూడా మినరల్స్ ఉంటాయి... కానీ కొబ్బరినీళ్లలో ఉండే స్థాయిలో ఉండవు. ఇక ఎలక్ట్రోలైట్స్ కొరత కూడా ఈ చెరకు రసంలో ఉంటుంది. కాబట్టి శరీరం కోల్పోయిన ప్లూయడ్స్ భర్తీ చేయడంతో చెరకు రసం కంటే కొబ్బరినీళ్లే చాలాబాాగా పనిచేస్తాయి.
45
Sugarcane Juice vs Coconut Water
కొబ్బరి నీళ్లు vs చెరకు రసం : తక్షణ ఎనర్జీ కోసం ఏది తాగితే బెటర్
ఎండల్లో బాగా తిరిగినే దాహం వేయడమే కాదు శరీరంలో ఎనర్జీ తగ్గుతుంది. ఈ ఎనర్జీని భర్తీ చేయడంలో చెరకు రసం బాగా పనిచేస్తుంది. ఇందులో అధికంగా షుగర్ కంటెట్ ఉంటుంది... కాబట్టి ఈ నేచురల్ షుగర్స్ శరీరానికి తక్షణ ఎనర్జీ అందించడంలో తోడ్పడతాయి.
కొబ్బరినీళ్లలో షుగర్ కంటెంట్ తక్కువగా ఉంటుంది. కాబట్టి ఇది వెంటనే ఎనర్జీ ఇవ్వలేదు... కానీ దాహం తీర్చి శరీరానికి తగిన ప్లూయిడ్స్ అందిస్తుంది.
చెరకు రసం, కొబ్బరినీళ్లు : ఎందులో ఎక్కువ క్యాలరీలు?
చెరకు రసంతో పోలిస్తే కొబ్బరి నీళ్లలోనే ఎక్కువ క్యాలరీలు ఉంటాయి. కాబట్టి శరీరానికి అధిక క్యాలరీలు కావాలనుకునేవారు కొబ్బరి నీళ్లు తాగడం బెటర్. అదే ఎనర్జీ కావాలనుకునేవారు చెరకురసం తాగితే మంచింది. మొత్తంగా కొబ్బరినీళ్లు, చెరకు రసం ప్రకృతి ప్రసాదించే పానియాలే కాబట్టి ఆరోగ్యానికి చాలామంచివి.
55
Sugarcane Juice vs Coconut Water
కొబ్బరినీళ్లు, చెరకు రసం లలో ఏది ఎందుకు బెటర్ :
ఎలక్ట్రోలైట్స్ అధికంగా ఉండటంవల్ల అనారోగ్యంతో బాధపడేవారు చెరకురసం కంటే కొబ్బరినీళ్లు తాగడమే మంచింది. అలాగే వ్యాయామం చేయగానే కొబ్బరి నీళ్లు తాగడం మంచింది. ఎండలో బయటకు వెళితే వెంటనే రిఫ్రెషింగ్ కోసం కూడా కొబ్బరి నీళ్లు మంచివి.
మొత్తంగా కొబ్బరి నీళ్లు హైడ్రేషన్, ఎలక్ట్రోలైట్స్ అధికంగా ఉంటాయి. అదే చెరకు రసం తక్షణ ఎనర్జీని ఇచ్చి దాహం తీరుస్తుంది. కాబట్టి ఈ రెండు ఆరోగ్యానికి మంచిందే... మీ అవసరాన్ని బట్టి ఏది తాగాలో ఎంచుకోవచ్చు.