Balanced Diet:హెల్తీ మీల్ కాదు, బ్యాలెన్స్‌డ్ మీల్ ముఖ్యం

Published : Jan 12, 2026, 01:51 PM IST

Balanced Diet:హెల్తీ ఫుడ్ అంటే ఆయిల్ తగ్గించడం, జంక్ ఫుడ్ మానేయడమే అనుకుంటున్నారా? నిపుణుల మాటల్లో హెల్తీ మీల్, బ్యాలెన్స్‌డ్ మీల్ ఒకటే కాదు. రోజూ అదే ఆహారం వల్ల పోషకాహార లోపం వచ్చే అవకాశం ఉందంటున్నారు. ఈ పద్ధతులు పాటించాలని చెబుతున్నారు. 

PREV
16
కనిపించేదంతా హెల్తీ కాదు

ఈ రోజుల్లో ఆరోగ్యంపై అవగాహన పెరిగింది అనేది నిజమే. ఆయిల్ తక్కువగా వాడితే చాలు, జంక్ ఫుడ్ మానేస్తే చాలు, ఆరోగ్యం ఆటోమేటిక్‌గా మెరుగవుతుందని చాలామంది అనుకుంటారు. కానీ వాస్తవం ఏమిటంటే, హెల్తీగా కనిపించే ఆహారం ప్రతిసారి శరీరానికి పూర్తి పోషణ ఇవ్వదు. రోజూ తీసుకెళ్లే టిఫిన్, లంచ్ విషయంలో మాత్రం చాలా మంది రోటీన్ గా ఉంటున్నారు. డైట్ అంటారు, హెల్తీ మీల్ అంటారు, కానీ ఇది బ్యాలెన్స్ డ్ ఫుడ్ కాదంటున్నారు..నిపుణులు.

26
హెల్తీ మీల్, బ్యాలెన్స్‌డ్ మీల్ రెండూ ఒకటి కావు

న్యూట్రిషన్ నిపుణుల ప్రకారం, హెల్తీ మీల్, బ్యాలెన్స్‌డ్ మీల్ రెండూ ఒకటి కావు. హెల్తీ మీల్ అంటే శరీరానికి మేలు చేసే ఆహారమే కావచ్చు. కానీ బ్యాలెన్స్‌డ్ మీల్ అంటే ప్రోటీన్, కార్బోహైడ్రేట్స్, ఫైబర్, విటమిన్లు, మినరల్స్, మంచి కొవ్వులు అన్నీ సరైన మోతాదులో ఉండటం. ఈ బ్యాలెన్స్ లేకపోతే శరీరం అలిసిపోతుంది. ఆకలి పదే పదే వేస్తుంది. దానివల్ల ఎక్కువ ఆహారం తీసుకోవల్సి వస్తుంది. అంతేకాకుండా త్వరగా బరువు పెరిగిపోయే ప్రమాదం ఉంది.

36
సోమవారం నుంచి శుక్రవారం వరకు టిఫిన్ ఐడియాస్

ఉద్యోగాలు చేసేవారు, కాలేజీకి వెళ్లేవారు, స్కూల్ కు వెళ్లేవారు రోజూ ఒకే టిఫిన్ లేదా లంచ్ తీసుకెళ్లే అలవాటు ఉంటుంది. ఇది సౌకర్యంగా అనిపించినా, దీనివల్ల దీర్ఘకాలంలో పోషకాహారలోపానికి దారి తీస్తుంది. అందుకే వారంలో 5 రోజులకు 5 రకాల ఆహారాన్ని ప్లాన్ చేయడం ఆరోగ్యానికి మంచిదని నిపుణులు చెబుతున్నారు. అందుకే సోమవారం నుంచి శుక్రవారం వరకు డైట్ ప్లాన్ చేసుకోవాలని న్యూట్రిషినిస్టులు చెబుతున్నారు. మామూలుగా శనివారం, ఆదివారం వీకెండ్ డేస్. ఆ రెండు రోజులు అయిపోగానే మళ్లీ సోమవారం నుంచి డ్యూటీకి వెళ్లాలన్నా, కాలేజీకి పోవాలన్నా బద్ధకంగా ఉంటుంది. అదే లంచ్, టిఫిన్ బాక్స్ తీసుకెళ్లాలంటే బోర్ అనిపిస్తుంది. అలాంటప్పుడు శరీరానికి ఉత్సాహంగా అనిపించే ఫుడ్ తీసుకోవడం బెస్ట్.

46
మొలకల సలాడ్ తీసుకుంటే ప్రోటీన్ అందుతుంది

సోమవారం రోజున శరీరానికి ఎనర్జీ అవసరం ఎక్కువగా ఉంటుంది. అందుకే మిల్లెట్స్ లేదా రవ్వతో చేసిన వెజిటబుల్ ఉప్మా మంచి ఆప్షన్. ఇందులో క్యారెట్, బీన్స్, బఠాణీలు వంటి కూరగాయలు కలపడం వల్ల శరీరానికి ఫైబర్ అందుతుంది. దీనితో పాటు మొలకల సలాడ్ తీసుకుంటే ప్రోటీన్ అందుతుంది. ఈ కాంబినేషన్ శరీరాన్ని ఎక్కువసేపు యాక్టివ్‌గా ఉంచుతుంది.

మంగళవారం టిఫిన్‌గా పప్పులు, కూరగాయలతో చేసిన ఇడ్లీలు తీసుకోవచ్చు. ఆవిరితో వండటం వల్ల ఇవి జీర్ణానికి తేలికగా ఉంటాయి. చాలామందికి మధ్యాహ్నం తర్వాత అలసట రావడానికి కారణం సరైన పోషణ లేకపోవడమే. ఇడ్లీలతో పాటు ఒక సీజనల్ ఫ్రూట్ తీసుకుంటే శరీరానికి కావాల్సిన విటమిన్లు అందుతాయి.

56
చనా దహీ చాట్ మంచి ఆప్షన్

బుధవారం రోజున చనా దహీ చాట్ మంచి ఆప్షన్. ఉడికించిన శనగలు, పెరుగు, దోసకాయ, కొద్దిగా మసాలా కలిపితే ఇది రుచిగా ఉండటమే కాదు, గట్ హెల్త్‌కు కూడా మేలు చేస్తుంది. పెరుగులో ఉండే ప్రోబయోటిక్స్ జీర్ణక్రియను మెరుగుపరుస్తాయి, శనగలు నెమ్మదిగా శక్తిని విడుదల చేస్తాయి.

గురువారం రోజున ఓట్స్‌తో చేసిన కట్లెట్స్ టిఫిన్‌గా పెట్టుకోవచ్చు. ఓట్స్‌లో ఫైబర్ ఎక్కువగా ఉండటంతో బరువు నియంత్రణకు సహాయపడుతుంది. పుదీనా లేదా టమాట చట్నీతో తీసుకుంటే పోషణ కూడా పెరుగుతుంది.

66
ఫుడ్ మార్చండి, బోర్ కొట్టదు

శుక్రవారం రోజున గోధుమ రోటీలో పనీర్, క్యాప్సికమ్, లెట్యూస్ వేసి చేసిన వెజ్ రాప్ సరైన ఎంపిక. పనీర్‌లో ప్రోటీన్ అధికంగా ఉండటంతో వారాంతానికి శరీరానికి కావాల్సిన బలం అందుతుంది. బయట ఫాస్ట్ ఫుడ్ తినాలనే కోరిక కూడా తగ్గుతుంది.

రోజూ అదే ఆహారం కాకుండా, చిన్న మార్పులు చేస్తే ఆరోగ్యంలో పెద్ద మార్పులు కనిపిస్తాయి. ఇంట్లో ఫుడ్ పై బోర్ కొట్టకుండా ఉంటుంది. రుచికి తగ్గట్టు, సీజన్‌కు అనుగుణంగా ఆహారం మార్చుకుంటూ బ్యాలెన్స్‌డ్ టిఫిన్ అలవాటు చేసుకుంటే దీర్ఘకాలంలో శరీరం ఆరోగ్యంగా ఉంటుంది.

Read more Photos on
click me!

Recommended Stories