Weight Loss: రోజూ ఈ డ్రింక్స్ తాగినా బరువు తగ్గొచ్చు

Published : Jan 09, 2026, 07:28 PM ISTUpdated : Jan 09, 2026, 07:39 PM IST

Weight Loss: ఈ మధ్య వెయిట్ లాస్ డ్రింక్స్ అంటూ కొన్ని రకాల పానీయాలుట్రెండ్ అవుతున్నాయి. “ఈ డ్రింక్ తాగితే ఫ్యాట్ కరిగిపోతుంది” అంటూ చెబుతుంటారు. అయితే ఆయుష్ మంత్రిత్వ శాఖకు చెందిన యోగా ట్రైనర్, న్యూట్రిషన్ నిపుణురాలు జ్యోతి గార్గ్ ఏం చెప్తున్నారంటే 

PREV
16
బరువు తగ్గడం రాత్రికి రాత్రే జరగదు

ఈ రోజుల్లో బరువు పెరగడం చాలా మందికి ఓపెద్ద తలనొప్పిగా మారింది. బరువు తగ్గాలంటే జిమ్, డైట్, సప్లిమెంట్లు అంటూ ఏవేవో ప్రయత్నాలు చేస్తున్నారు. కానీ నెలలు గడిచినా ఫలితం కనిపించకపోతే నిరాశ పడిపోతారు. అసలు విషయం ఏంటంటే… బరువు తగ్గడం రాత్రికి రాత్రే జరిగే పని కాదు. ఓ ప్రాసెస్ లాంటిది. దీనికి ఓపిక కూడా కావాలి, మన డైలీ రొటీన్‌లో మార్పులు కూడా అవసరం అని నిపుణులు చెబుతున్నారు.

26
నిపుణురాలు ఏం చెప్తున్నారంటే..

ఆయుష్ మంత్రిత్వ శాఖకు చెందిన యోగా ట్రైనర్, న్యూట్రిషన్ నిపుణురాలు జ్యోతి గార్గ్ ఏం చెప్తున్నారంటే..డ్రింక్స్ బరువు తగ్గే ప్రయాణంలో కొంతవరకు హెల్ప్ చేస్తాయే తప్ప, అవే పరిష్కారం కావని అంటున్నారు. బరువు తగ్గాలంటే మూడు విషయాలు తప్పనిసరని చెబుతున్నారు.

1. మనం తినే ఆహారం. జంక్ ఫుడ్ ఎక్కువగా తింటూ బరువు తగ్గాలని అనుకుంటే కుదరదు.

2. రోజూ కాసేపు అయినా వ్యాయామం చేయాలి

3. సరైన నిద్ర, స్ట్రెస్ కంట్రోల్ ఉండాలి

ఇవి లేకుండా ఎంత ఆరోగ్యకరమైన డ్రింక్స్ తాగినా ఫలితం ఉండదు. అసలు వీటి పని మన శరీరంలోని మెటబాలిజాన్ని యాక్టివ్ చేయడం మాత్రమే.

36
మెంతులు వాటర్ చాలా బెస్ట్

అయితే సరైన లైఫ్ స్టైల్‌తో పాటు కొన్ని సహజ పానీయాలు తాగితే మంచి రిజల్ట్ ఉంటుంది. వాటిలో మెంతులు నానబెట్టిన నీరు. ఒక టీస్పూన్ మెంతులు రాత్రంతా నీటిలో నానబెట్టి, ఉదయం మరిగించి వడకట్టి తాగాలి. నిలబడి కాకుండా కూర్చుని నెమ్మదిగా తాగడం మంచిది. అప్పుడు స్లోగా శరీరంలో ఉండే చెడు కొలెస్ట్రాల్ కరిగే అవకాశం ఉంటుంది.

46
ఆకలిని కంట్రోల్ చేస్తుంది

ఇంకో మంచి ఆప్షన్ చియా గింజలు. లెమన్ వాటర్ వర్కౌట్ చేసే వాళ్లకు ఇది బాగా పనిచేస్తుంది. చియా గింజలు ఆకలిని కంట్రోల్ చేస్తాయి, ఎనర్జీ కూడా ఇస్తాయి. గ్లాసుడు నీళ్లలో స్పూన్ చియాగింజలు వేసి దానిలో నిమ్మరసం, తేనె కలిపితే ఫలితం ఉంటుంది.   

56
రోగనిరోధకశక్తిని పెంచుతుంది

దాల్చిన చెక్క టీ: దాల్చిన చెక్క జీవక్రియను పెంచుతుంది. ఒక గ్లాసు నీటిలో 1/4 టీస్పూన్ దాల్చిన చెక్క పొడిని వేసి, అది సగానికి తగ్గే వరకు మరిగించి తాగాలి. అల్లం, పసుపు టీ వింటర్ లో బెస్ట్ ఆప్షన్. నీటిలో తురిమిన అల్లం, పసుపు వేసి మరిగించాలి. ఇది శరీరం నుండి వేడిని పెంచి రోగనిరోధక శక్తిని పెంచుతుంది. కాబట్టి వేసవిలో అయితే తాగకపోవడం మంచిది.

66
మీ శరీరానికి సరిపోయే వాటిని మాత్రమే ఎంచుకోండి

వేసవిలో కూల్ డ్రింక్స్ తాగేటప్పుడు జాగ్రత్తగా ఉండండి. దాల్చిన చెక్క, అల్లం శరీరానికి వేడి చేస్తుంది కాబట్టి తాగకపోవడం ఉత్తమం. లేదంటే వేసవిలో ముఖంపై మొటిమలు, కడుపులో గందరగోళం కలిగిస్తాయి. మీ శరీర రకానికి సరిపోయే వాటిని మాత్రమే తెలుసుకుని పాటించడం మంచిది. ఇవన్నీ చేస్తూనే వ్యాయామం, మంచి ఆహారం, లైఫ్ స్టైల్ మార్చుకుంటే..మంచి ఫలితం కనిపిస్తుంది.

Read more Photos on
click me!

Recommended Stories