చింతపండుతో శరీరంలోని మైక్రోప్లాస్టిక్ మాయం! ఎలా తీసుకోవాలంటే?

Published : Nov 12, 2025, 03:52 PM IST

మన శరీరంలో రోజురోజుకు పెరుగుతున్న కనిపించని శత్రువు మైక్రోప్లాస్టిక్. తాగే నీటి నుంచి పీల్చుకునే గాలివరకు అంతా ప్లాస్టిక్ కణాలతో నిండిపోయింది. అవి మన శరీరాన్ని సైలెంట్ గా దెబ్బతీస్తాయి. అయితే వంటింట్లో ఉండే ఒక్క పదార్థంతో దీనికి చెక్ పెట్టవచ్చు.

PREV
16
చింతపండు ఆరోగ్య ప్రయోజనాలు

ప్రస్తుతం మన జీవితంలో ప్లాస్టిక్ ఎంతలా కలిసిపోయిందో చెప్పలేము. ప్లాస్టిక్ నుంచి తప్పించుకోవడం దాదాపు అసాధ్యమైపోయింది. గాలి, నీరు, ఆహారం ఇలా అన్నింట్లో ప్లాస్టిక్ అణువులు చేరుతున్నాయి. ఇవి కనిపించనంత చిన్న ప్లాస్టిక్ కణాలు. ఈ మైక్రోప్లాస్టిక్ మన శరీరంలో చేరి పెద్ద సమస్యలకు కారణమవుతున్నాయి. తాజాగా ప్రపంచ వ్యాప్తంగా జరిగిన పరిశోధనల్లో రక్తంలో, మూత్రంలో, ప్లాసెంటాలో కూడా మైక్రోప్లాస్టిక్ గుర్తించారు. ఇవి కిడ్నీలు, కాలేయం, గుండె, ఊపిరితిత్తుల వంటి అవయవాలను దెబ్బతీస్తాయని శాస్త్రవేత్తలు చెబుతున్నారు.

26
చింతపండుతో మైక్రోప్లాస్టిక్ కి చెక్

ప్రస్తుత పరిస్థితుల్లో మనం ప్లాస్టిక్ నుంచి పూర్తిగా దూరంగా ఉండలేకపోయినా దాని ప్రభావాన్ని తగ్గించే సహజమైన పరిష్కారాన్ని కనుగొన్నారు శాస్త్రవేత్తలు. తాజా పరిశోధనల ప్రకారం చింత పండు మైక్రో ప్లాస్టిక్ సమస్యకు చెక్ పెడుతుందని శాస్త్రవేత్తలు చెబుతున్నారు.

36
చింతపండులోని పోషకాలు

చింత పండులో పొటాషియం, మెగ్నీషియం, ఐరన్, ఫైబర్, టార్టారిక్ యాసిడ్, సిట్రిక్ యాసిడ్ వంటి పోషకాలు సమృద్ధిగా ఉంటాయి. ముఖ్యంగా టార్టారిక్ యాసిడ్‌ శరీరంలో పేరుకుపోయిన హానికర లోహాలు, విష పదార్థాలను బయటకు తీయగల శక్తిని కలిగి ఉంటుంది. తాజాగా చేసిన పరిశోధనల్లో చింత పండు తరచుగా తీసుకుంటే శరీరంలోని మైక్రోప్లాస్టిక్ కణాలు, హెవీ మెటల్స్‌ స్థాయిలు తగ్గిపోతాయని తేలింది.

46
విష పదార్థాల తొలగింపు

చింత పండులోని ఆమ్లాలు, ఫైబర్‌ కణాలు జీర్ణాశయంలోని విష పదార్థాలను బయటకు పంపిస్తాయి. ఈ ప్రక్రియ శరీరంలో డీటాక్స్ మెకానిజం లాంటిది. అంతేకాక చింత పండు లివర్‌ ఫంక్షన్‌ను మెరుగుపరచి, రక్తాన్ని శుభ్రపరుస్తుంది. ఈ ప్రక్రియ నిరంతరం కొనసాగితే, ప్లాస్టిక్ కణాలు సహా అనవసరమైన విష పదార్థాలు శరీరంలో నిల్వ కాకుండా బయటకు వెళ్తాయి.

56
ఎలా తీసుకోవాలంటే?

ఉదయం లేవగానే ఒక గ్లాస్ గోరువెచ్చని నీటిలో ఒక చిన్న ముద్ద చింత పండు నానబెట్టి, దాన్ని వడకట్టి తాగొచ్చు. లంచ్ లేదా డిన్నర్‌లో చింత పండుతో చేసిన పులిహోర, సాంబార్, రసం వంటివి తరచుగా తీసుకోవడం కూడా ప్రయోజనకరంగా ఉంటుంది. వారానికి రెండు, మూడు సార్లు చింత పండు రసం తాగితే జీర్ణక్రియ మెరుగుపడుతుంది. టాక్సిన్స్‌ బయటకు వెళ్తాయి.

66
ఎక్కువగా తీసుకుంటే?

చింత పండు సహజ డీటాక్స్ అయినా ఎక్కువగా తీసుకోవడం వల్ల గ్యాస్ట్రిక్ సమస్యలు రావచ్చు. కాబట్టి పరిమిత మోతాదులో తీసుకోవడం మంచిది. చింతపండు ఎక్కువగా తింటే దంతాలకు నష్టం కలగవచ్చు. కాబట్టి తిన్న తర్వాత నీటితో నోరు శుభ్రం చేసుకోవడం ముఖ్యం. 

Read more Photos on
click me!

Recommended Stories