Beer Side effects: మద్యం ఆరోగ్యానికి హానికరమని తెలిసిందే. అయితే కొందరిలో మాత్రం ఆల్కహాల్ తీవ్ర ప్రభావాన్ని చూపుతుంది. కొన్ని రకాల అనారోగ్య సమస్యలతో బాధపడేవారు ఎట్టి పరిస్థితుల్లో బీర్‌కి దూరంగా ఉండాలని నిపుణులు చెబుతున్నారు.
బీర్ అనేది ప్రపంచంలో అత్యంత ప్రజాదరణ పొందిన ఆల్కహాలిక్ డ్రింక్‌లలో ఒకటి. కొంతమంది దీన్ని రిఫ్రెష్‌మెంట్‌గా భావించి చల్లగా తాగుతుంటారు. తక్కువ ఆల్కహాల్ శాతం ఉన్నప్పటికీ, ఇది తరచుగా తాగే అలవాటుగా మారితే ఆరోగ్యానికి ప్రమాదం కలిగిస్తుంది. ముఖ్యంగా కొన్ని ఆరోగ్య సమస్యలున్న వారు బీర్ తాగడం వలన తీవ్రమైన దుష్ప్రభావాలు ఎదుర్కొనే అవకాశం ఉంటుంది.
25
సెలియాక్ డిసీజ్ ఉన్నవారికి ప్రమాదం
సెలియాక్ డిసీజ్ అనేది చిన్న పేగును ప్రభావితం చేసే జీర్ణ సంబంధ వ్యాధి. గ్లూటెన్ ఉన్న ఆహారాలు లేదా పానీయాలు తీసుకుంటే ఈ వ్యాధి తీవ్రమవుతుంది. బీర్‌లో గ్లూటెన్ ఎక్కువగా ఉంటుంది. అందువల్ల ఈ వ్యాధిగ్రస్తులు బీర్ తాగితే పేగుల్లో వాపు, కడుపులో మంట, వాంతులు, డయేరియా వంటి సమస్యలు వస్తాయి. దీర్ఘకాలంగా బీర్ తాగడం వల్ల శరీరానికి అవసరమైన పోషకాలు శోషించబడకపోవడం కూడా జరుగుతుంది. కాబట్టి సెలియాక్ డిసీజ్ ఉన్నవారు బీర్‌ను పూర్తిగా మానేయడం మంచిది.
35
బరువు తగ్గాలనుకునే వారికి బీర్ శత్రువు
బరువు తగ్గాలని ప్రయత్నిస్తున్నవారికి బీర్ పెద్ద అడ్డంకి. ఇందులో ఉన్న అధిక కేలరీలు, తక్కువ పోషక విలువల కారణంగా శరీరంలో కొవ్వు పేరుకుపోతుంది. రెగ్యులర్‌గా బీర్ తాగేవారిలో బెల్లీ ఫ్యాట్, బరువు పెరుగుదల కనిపిస్తుంది. దీని వల్ల వ్యాయామం చేసినా ఫలితం ఉండదు. కాబట్టి వెయిట్ లాస్ జర్నీలో ఉన్నవారు బీర్ తాగకపోవడమే ఉత్తమం.
డయాబెటిస్ ఉన్నవారు లేదా ప్రీడయాబెటిస్ దశలో ఉన్నవారు బీర్ తాగితే రక్తంలో గ్లూకోజ్ స్థాయిలు అకస్మాత్తుగా పెరుగుతాయి. బీర్‌లో ఉండే చక్కెర, కార్బోహైడ్రేట్స్ కారణంగా ఇన్సులిన్ రెసిస్టెన్స్ పెరిగి హైపోగ్లైసీమియా ప్రమాదం కూడా ఉంటుంది. దీర్ఘకాలంలో షుగర్ నియంత్రణ కష్టమవుతుంది. కాబట్టి ఈ వర్గానికి చెందినవారు బీర్‌ను పూర్తిగా దూరంగా ఉంచుకోవాలి.
55
గుండెల్లో మంట లేదా IBS ఉన్నవారు
హార్ట్‌బర్న్ లేదా యాసిడ్ రిఫ్లక్స్ సమస్య ఉన్నవారు బీర్ తాగితే పరిస్థితి మరింత క్షీణిస్తుంది. ఇది అన్నవాహిక కండరాలపై ప్రభావం చూపి యాసిడ్ పైకి వచ్చే పరిస్థితికి కారణమవుతుంది. అలాగే ఇరిటబుల్ బవెల్ సిండ్రోమ్ (IBS) ఉన్నవారికి బీర్ తాగడం వల్ల ఉబ్బరం, గ్యాస్, డయేరియా, కడుపు నొప్పి వంటి సమస్యలు పెరుగుతాయి. కాబట్టి ఈ వ్యాధిగ్రస్తులు ఆల్కహాల్ పూర్తిగా మానేయడం ఆరోగ్యానికి మేలు.