Noodles ఎప్పుడు పడితే అప్పుడు నూడిల్స్ తింటే.. ఎప్పుడో రోగాలపాలవడం ఖాయం: ఎంత హానికరం అంటే..

తయారు చేయడం తేలికగా ఉంటుందనీ, నోటికి రుచికరంగా ఉంటుందనే ఉద్దేశంతో చాలామంది నూడిల్స్ ని అతిగా తింటుంటారు. వేళాపాళా లేకుండా ఇలా నూడిల్స్ తినడం ఆరోగ్యానికి చాలా హానికరం అంటున్నారు నిపుణులు. అందులో ఉండే ట్రాన్స్ ఫ్యాట్, సోడియం, మైదా మీ శరీరానికి చాలా నష్టం చేస్తాయట.

ఆరోగ్యానికి హానికరం

ఉదయం కాని, సాయంత్రం కాని, ఎప్పుడు ఆకలి వేస్తే అప్పుడు తినేస్తారా? తెలియకుండానే మీ శరీరాన్ని పాడుచేసుకుంటున్నారు. మ్యాగీలో  ట్రాన్స్ ఫ్యాట్ ఉంటుంది. ఇది శరీరంలో చెడు కొలెస్ట్రాల్ సమస్యను పెంచుతుంది. దీని వల్ల డయాబెటిస్ వస్తుంది.

Maggi side effects health risks of instant noodles consumption in telugu

మాగ్గీలో సోడియం, ట్రాన్స్ ఫ్యాట్ ఉండటం వల్ల పిల్లల్లో రోగ నిరోధక శక్తి తగ్గిపోతుంది. నూడిల్స్ లో శరీరానికి ఉపయోగపడే పోషకాలు ఏమీ ఉండవు. దీనిలో ఉండే కొన్ని పదార్థాల వల్ల పిల్లలకు సమస్యలు వస్తాయి.


మ్యాగీలో  46 శాతం సోడియం ఉంటుంది. ఇది శరీరంలోకి ఎక్కువగా వెళితే ప్రాణాంతక వ్యాధులు వచ్చే ప్రమాదం ఉంది. ఇందులో  మైదాను ఎక్కువగా ఉపయోగిస్తారు. దీన్ని రెగ్యులర్‌గా తింటే ఆరోగ్యం పాడవుతుంది. దీని వల్ల గుండె సమస్యలు వస్తాయి.

మ్యాగీని రెగ్యులర్‌గా తినడం వల్ల రక్తపోటు పెరిగే అవకాశం ఉంది. అందులో సిట్రిక్ యాసిడ్ ఉండటం వల్ల కడుపులో ఎసిడిటీ, ఇతర సమస్యలు వచ్చే అవకాశం ఉంది.

Latest Videos

vuukle one pixel image
click me!