Health Tips: వెల్లుల్లిని ఇలా తీసుకుంటే చెడు కొలెస్ట్రాల్ మాయం..!

Published : Jul 20, 2025, 03:08 PM IST

వెల్లుల్లి ఆరోగ్యానికి ఎంత మేలు చేస్తుందో ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. రెగ్యులర్ గా వెల్లుల్లిని ఆహారంలో చేర్చుకోవడం ద్వారా చెడు కొలెస్ట్రాల్‌ను తగ్గించుకోవచ్చు అంటున్నారు నిపుణులు. ఎలాగో ఇక్కడ చూద్దాం.  

PREV
16
వెల్లుల్లి ఔషధ గుణాలు

వెల్లుల్లిని మనం వంటల్లో రెగ్యులర్ గా వాడుతుంటాం. ఇందులోని సల్ఫర్ సమ్మేళనాలు, ముఖ్యంగా అల్లిసిన్ ఆరోగ్యానికి ఎంతగానో మేలు చేస్తుంది. వెల్లుల్లిలో విటమిన్లు, ఖనిజాలు, ఫ్లేవనాయిడ్లు, ఇతర పోషకాలు పుష్కలంగా ఉన్నాయి. వీటిని రెగ్యులర్ గా తీసుకోవడం ద్వారా శరీరంలో చెడు కొలెస్ట్రాల్ ను తగ్గించుకోవచ్చు. 

26
చెడు కొలెస్ట్రాల్ తగ్గించడంలో..

వెల్లుల్లిలోని అల్లిసిన్, ఇతర సల్ఫర్ సమ్మేళనాలు కొలెస్ట్రాల్ ఉత్పత్తిని తగ్గిస్తాయని అధ్యయనాలు చెబుతున్నాయి. ముఖ్యంగా నీటిలో కరిగే సల్ఫర్ సమ్మేళనాలు కాలేయంలో కొలెస్ట్రాల్ ఉత్పత్తిని నిరోధించడంలో కీలక పాత్ర పోషిస్తాయట.

36
యాంటీఆక్సిడెంట్ లక్షణాలు :

వెల్లుల్లి శక్తివంతమైన యాంటీఆక్సిడెంట్ లక్షణాలను కలిగి ఉంది. ఇది LDL (చెడు కొలెస్ట్రాల్) ఆక్సీకరణను నిరోధిస్తుంది. సాధారణంగా ఆక్సీకరణ చెందిన LDL కొలెస్ట్రాల్ రక్తనాళాల్లో పేరుకుపోయి అడ్డంకులను సృష్టిస్తుంది. అయితే ఈ ఆక్సీకరణ ప్రక్రియను వెల్లుల్లి నిరోధిస్తుంది. తద్వారా గుండె జబ్బుల ప్రమాదం తగ్గుతుంది. 

46
రక్తనాళాల వ్యాకోచం :

వెల్లుల్లి నైట్రిక్ ఆక్సైడ్ ఉత్పత్తిని పెంచడం ద్వారా రక్తనాళాలను వ్యాకోచింపజేస్తుంది. ఇది రక్తపోటును తగ్గించడమే కాకుండా, రక్త ప్రసరణను కూడా మెరుగుపరుస్తుంది. మంచి రక్త ప్రసరణ గుండె ఆరోగ్యానికి చాలా ముఖ్యం.

56
వెల్లుల్లి పాలు:

5-8 వెల్లుల్లి రెబ్బలను బాగా ఉడికించి, పాలలో కలిపి ఉదయం, సాయంత్రం తాగితే, శరీరంలోని చెడు కొలెస్ట్రాల్ గణనీయంగా తగ్గుతుంది. వెల్లుల్లి పాలు గుండె జబ్బులతో బాధపడుతున్నవారికి చాలా మంచిదని, ఇది రక్తనాళాల్లో పేరుకుపోయిన చెడు కొలెస్ట్రాల్‌ను తగ్గించడంలో సహాయపడుతుందని అధ్యయనాలు చెబుతున్నాయి.

66
వెల్లుల్లి నూనె:

వెల్లుల్లి నూనెను సాంప్రదాయ వైద్యంలో ఉపయోగిస్తుంటారు. ఇందులోని సల్ఫర్ సమ్మేళనాలు హృదయ ధమనుల్లో ఏర్పడే రక్తం గడ్డకట్టడాన్ని సరిచేసి, రక్తనాళాలను వ్యాకోచింపజేస్తాయి. 

గమనిక

వైద్యుల సలహా తీసుకున్న తర్వాత ఆహారంలో మార్పులు చేసుకోవడం మంచిది.  

Read more Photos on
click me!

Recommended Stories