Health Tips: గోళ్లపై ఇలాంటి గీతలు కనిపిస్తుంటే.. అస్సలు నెగ్లెక్ట్ చేయకండి

Published : Jun 19, 2025, 01:26 PM IST

Health Tips: మనం ఆరోగ్యంగా ఉన్నామా? లేదా ? అనేది ఇట్టే తెలుసుకోవచ్చు. మన శరీరంలో ఏ సమస్య వచ్చిన దానికి సంబంధించిన సంకేతాలు బయటపడుతాయి. అలాగే.. గోళ్లపై కొన్ని సంకేతాలు మనల్ని హెచ్చరిస్తాయి. ఇంతకీ ఆ సంకేతాలేంటో.. ఆ సమస్యను సూచిస్తుందో తెలుసుకుందాం.. 

PREV
15
గోళ్ళపై గీతలు

శరీరంలో ఏదైనా లోపం ఏర్పడితే..అది ఏదో ఒక విధంగా బయటపడుతుంది. గోళ్ళలో వచ్చే మార్పులు శరీరంలో వ్యాధులు ఉన్నాయని సూచిస్తాయని వైద్యులు చెబుతున్నారు. అలాగే శరీరంలో ఏదైనా ఆరోగ్య సమస్య వస్తే.. గోళ్ళ రంగు మారడం,  గోళ్ళపై గీతలు రావడం  చూడవచ్చు. ఇంతకీ ఆ సంకేతాలేంటీ? ఆ సమస్యను సూచిస్తుందనేది తెలుసుకుందాం..

25
గోళ్ళపై గీతలు ఎందుకు ?

మీ గోళ్ళపై పొడవైన, తెల్లటి గీతలు కనిపిస్తే అది వృద్ధాప్య సంకేతం. వయసు పెరిగే కొద్దీ శరీరంలో పోషకాల లోపం ఏర్పడుతుంది. గోళ్ళపై సగం గీతలు కనిపిస్తే అది వయసు పెరగడం వల్లనే కానీ, ప్రమాదకరం కాదు. గీతలు చాలా లోతుగా ఉండి, గోళ్ళు విరిగి నల్లగా మారితే అది ప్రమాదకరం.

35
గోళ్ళపై నిలువు గీతలు

గోళ్ళపై గీతలు లోతుగా ఉండి, గోళ్ళు విరిగిపోవడం లేదా రంగు మారడం వంటివి లక్షణాలుంటే.. ఆరోగ్య సమస్యలకు సంకేతం కావచ్చు. .

45
గోళ్ళపై తెల్ల గీతలు:

గోళ్ళలో 'ల్యుకోనిచియా స్ట్రైటా' అనే గీతలు కనిపించడం ఫంగల్ ఇన్ఫెక్షన్లు, వంశపారంపర్య వ్యాధులు, కొన్ని వ్యాధులు   సంభవించవచ్చు. ఈ గీతలు ఎక్కువైతే, వైద్యుడిని సంప్రదించడం మంచిది.

గోళ్ళపై నలుపు/గోధుమ రంగు గీతలు: వీటిని 'మెలనోనిచియా' అంటారు. మెలనిన్ అనే వర్ణద్రవ్యం పెరగడం వల్ల ఇవి వస్తాయి.

55
గోళ్ళపై నల్ల గీతలు:

గోళ్ళపై నల్ల గీతలు శరీరంలో విటమిన్ సి, జింక్ వంటి పోషకాలు లోపాన్ని సూచిస్తాయి. గోర్ల చిగుర్లలో రక్తస్రావం/నొప్పి ఉంటే వైద్యుడిని సంప్రదించండి.

గోళ్ళపై తెల్ల గీతలు: గోళ్ళపై తెల్ల గీతలు ఉంటే తేలికగా తీసుకోకండి. ఇవి కిడ్నీ సమస్యలకు సంకేతం కావచ్చు. వెంటనే వైద్యుడిని సంప్రదించండి.

Read more Photos on
click me!

Recommended Stories