ఇటీవల దేశవ్యాప్తంగా కరోనా వైరస్ కేసులు మళ్లీ పెరుగుతున్నాయి. వైరస్ తిరిగి విజృంభిస్తోంది. కొత్త కేసుల పెరుగుదల పట్ల కేంద్ర ఆరోగ్యశాఖ, వైద్య నిపుణులు అప్రమత్తమయ్యారు. పుణెలోని నేషనల్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ వైరాలజీ (NIV) తాజాగా వెల్లడించిన సమాచారం ప్రకారం, కరోనా పెరుగుదలకు ఒమిక్రాన్‌కు చెందిన నాలుగు కొత్త ఉపరకాలు (Subvariants) కారణమని నిపుణులు చెబుతున్నారు.
జీనోమ్ సీక్వెన్సింగ్ ద్వారా NIV గుర్తించిన వేరియంట్లు ఇవే:LF.7, XFG, JN.1.16, NB.1.8.1. ప్రాథమికంగా JN.1.16 వలన కేసులు పెరిగినా, మే నెల నుంచి XFG ప్రభావం అధికంగా కనిపిస్తోంది. LF.7, LP.81.2 అనే రెండు ఉపరకాలు కలిసి XFGగా రూపాంతరం చెందినట్టు నిపుణులు వెల్లడించారు. వైరస్‌లో జరిగే నిరంతర మార్పులు దీనికి కారణని అంటున్నారు.
26
కేసులు ఎలా ఉన్నాయి.?
కేంద్ర ఆరోగ్యశాఖ తెలిపిన వివరాల ప్రకారం ప్రస్తుతం మొత్తం 6483 యాక్టివ్ కేసులున్నాయి. జనవరి 1 నుంచి ఇప్పటివరకు 113 మరణాలు సంభవించాయి. కేరళ, గుజరాత్, కర్ణాటక, ఢిల్లీలో కేసులు ఎక్కువగా నమోదవుతున్నాయి. అయితే ఈసారి ఇన్ఫెక్షన్ తీవ్రత తక్కువగానే ఉంది. రోగులు చాలా మంది హాస్పిటల్ అవసరం లేకుండా ఇంట్లోనే చికిత్స పొందుతున్నారు.
36
అమెరికాలో నింబస్ వేరియంట్ కలకలం
ఇండియాలో కొత్త వేరియంట్లు కలవరం రేపుతున్న నేపథ్యంలో, అమెరికాలో నింబస్ (Nimbus) అనే వేరియంట్ పెద్ద కలకలం సృష్టిస్తోంది. ఈ వేరియంట్‌కు శాస్త్రీయ నామం NB.1.8.1. ఇది గతేడాదే మొదట చైనాలో వెలుగులోకి వచ్చింది. ఇప్పుడు అమెరికాలో కేసుల్లో 37 శాతం ఈ వేరియంట్ కారణంగా నమోదవుతున్నాయి. దీని వ్యాప్తి చాలా వేగంగా జరుగుతోంది.
నింబస్ వేరియంట్ ప్రధాన లక్షణంగా ‘రేజర్ బ్లేడ్ థ్రోట్’ కనిపిస్తోంది. అంటే గొంతు కోసుకుపోయినట్టుగా తీవ్రమైన నొప్పి వస్తోంది. ఇది చాలా మంది బాధితులకు తీవ్రమైన అసౌకర్యాన్ని కలిగిస్తోంది. అమెరికాతో పాటు యూకే, ఇండియాలో కూడా ఇటువంటి లక్షణాలు ఉన్న కేసులు గుర్తించారు. మింగుతున్న సమయంలో గొంతు బ్లేడ్‌తో కోసుకుపోయిన భావన కలుగుతుంది.
వీటితో పాటు పొడి దగ్గు, అధిక జ్వరం, శ్వాస సంబంధిత ఇబ్బందులు, మతి మరుపు, నిద్రమత్తు, కండరాల నొప్పులు, డయేరియా వంటి లక్షణాలు కనిపిస్తున్నట్లు గుర్తించారు.
56
వ్యాక్సిన్‌లు పనిచేస్తాయా?
ప్రపంచ ఆరోగ్య సంస్థ (WHO) ప్రకారం, ప్రస్తుతానికి ఇది తీవ్రమైన ప్రమాదంగా లేకపోయినా, అప్రమత్తంగా ఉండాలని సూచిస్తోంది. ప్రస్తుతం ఉన్న వ్యాక్సిన్లతో ఈ వేరియంట్‌ను ఎదుర్కోవచ్చని స్పష్టంగా తెలిపింది. అయినప్పటికీ, ఈ వేరియంట్ యాంటీబాడీస్‌ను ఛేదించగల సామర్థ్యం కలిగి ఉండటమే ఆందోళన కలిగిస్తోంది.
66
నిరంతర మార్పులే కొత్త వేరియంట్లకు కారణం
నిపుణుల అంచనా ప్రకారం, ఒమిక్రాన్ వేరియంట్ అనేక మ్యూటేషన్లకు లోనవుతూ నింబస్ వేరియంట్‌గా రూపాంతరం చెందింది. ఈ మార్పుల వల్లే ఇది చాలా వేగంగా వ్యాప్తి చెందుతోంది. ఇప్పటికే యాంటీబాడీస్ ఉన్నవారికి కూడా ఇది సోకుతోంది.
అయితే ప్రస్తుతం కేసుల తీవ్రత తక్కువగానే ఉన్నా, ప్రజలు జాగ్రత్తగా ఉండాలి. మాస్కులు ధరించడం, శానిటైజర్లు ఉపయోగించడం, రద్దీ ప్రాంతాల్లోకి వెళ్లడాన్ని తగ్గించడం వల్ల రక్షణ పొందవచ్చు. ప్రభుత్వ సూచనలను పాటిస్తూ, అనుమానాస్పద లక్షణాలుంటే వెంటనే పరీక్షలు చేయించుకోవాలి.