Lemon Tea vs Green Tea: ప్రస్తుతం చాలామంది ఊబకాయంతో బాధపడుతున్నారు. ఈ క్రమంలోనే బరువు తగ్గడానికి అయ్యేందుకు గ్రీన్ టీ, లెమన్ గ్రాస్ టీలను కూడా తాగుతున్నారు. అయితే ఈ రెండింటిలో ఏది తాగితే ఫాస్ట్‌గా వెయిట్ లాస్ అవుతారో ఇప్పుడు తెలుసుకుందాం.
Lemon Tea vs Green Tea: చాలా మందికి ఉదయం టీ తాగే అలవాటు ఉంటుంది. అయితే పాలు, చక్కెర కలిపిన సాధారణ టీ తాగడం వల్ల బరువు పెరగవచ్చు. దీని బదులుగా.. ఆరోగ్యపరంగా ప్రయోజనం కలిగించే లెమన్ టీ లేదా గ్రీన్ టీ వంటివి తాగడం బెటర్. ఇంతకీ ఈ రెండింట్లో బరువు తగ్గడంలో ఏది ప్రయోజనకరమో వివరంగా తెలుసుకుందాం.
25
ఆకలిని నియంత్రించడంలో
ఆకలిని నియంత్రించడంలో
లెమన్ టీ శరీరాన్ని హైడ్రేట్ చేసి, కడుపు నిండిన అనుభూతిని కలిగిస్తుంది. ఇది ఆకలిని తగ్గించడంలో సహాయపడుతుంది.
గ్రీన్ టీలో ఉండే కాఫీన్ ఆకలిని నియంత్రించడంలో మరింత ప్రభావవంతంగా పనిచేస్తుంది.
టాక్సిన్లను బయటకు పంపడంలో
లెమన్ టీ జీర్ణక్రియను మెరుగుపరచి, శరీరంలో తానుగా సేకరించే టాక్సిన్లను బయటకు పంపేందుకు సహాయపడుతుంది.
గ్రీన్ టీ కాలేయ పనితీరును మెరుగుపరచినా, డిటాక్స్ దృష్టిలో లెమన్ టీ కొంచెం మెరుగైనదిగా చెప్పవచ్చు.
35
కొవ్వును తగ్గించడంలో
లెమన్ టీలో డిటాక్స్ లక్షణాలు ఉన్నా, అది నేరుగా కొవ్వును కరిగించదు. ఇది శరీరాన్ని హైడ్రేట్ చేసి, ఆకలిని తగ్గించడంలో కొంత మేర సహాయపడుతుంది. కానీ, బరువు తగ్గడంలో సమర్థవంతంగా పని చేస్తుందని చెప్పలేం.
గ్రీన్ టీలో క్యాటెచిన్లు (Catechins), కేఫిన్ (Caffeine) వంటి సమ్మేళనాలు జీవక్రియను వేగవంతం చేసి, కొవ్వును ఆక్సీకరించడంలో సహాయపడతాయి. ఈ కారణంగా, బరువు తగ్గడానికి గ్రీన్ టీ లెమన్ టీ కంటే ఎక్కువ ప్రయోజనకరం.
లెమన్ టీని ఉదయం ఖాళీ కడుపుతో తాగడం శరీరాన్ని హైడ్రేట్ చేసి, ఫ్రెష్‌గా ఉండటానికి సహాయపడుతుంది. భోజనం తర్వాత లేదా వ్యాయామానికి ముందు తాగితే జీర్ణక్రియ మెరుగవుతుంది, శక్తిని ఇస్తుంది.
గ్రీన్ టీలోని యాక్టివ్ సమ్మేళనాలు కొవ్వు ఆక్సీకరణను ప్రోత్సహించడంతో, బరువు తగ్గడానికి ఉపయోగపడుతాయి. కొవ్వు తగ్గించడంలో లెమన్ టీ కంటే గ్రీన్ టీ మెరుగైన ఫలితాలను ఇవ్వగలదు.
55
లెమన్ టీ vs గ్రీన్ టీ
బరువు తగ్గాలనుకునేవారికి గ్రీన్ టీ ఉత్తమ ఎంపికగా పరిగణించబడుతుంది. దీనిలో పాలు, చక్కెర లేవు కనుక కేలరీలు చాలా తక్కువగా ఉంటాయి. ఒక కప్పు గ్రీన్ టీలో కేవలం 2–3 కేలరీలే ఉంటాయి.
ఇదే సమయంలో లెమన్ టీ కూడా తక్కువ కేలరీలతో ఉంటుంది. కానీ, మీరు చక్కెర లేదా తేనె కలిపితే మాత్రం కేలరీలు పెరిగిపోతాయి. కాబట్టి లెమన్ టీను కూడా బరువు తగ్గేందుకు ఉపయోగించాలంటే, చక్కెర లేకుండా తాగాలి.