మీ చేతుల్లో సైలెంట్ కిల్లర్.. సెల్‌ఫోన్‌ అతిగా వాడితే మెదడుకు ముప్పు?

Published : Jul 05, 2025, 11:17 AM IST

Mobile Phones and Stroke: సెల్‌ఫోన్‌ను అతిగా వాడటం ఆరోగ్యానికి ఏ మాత్రం మంచిది కాదు. అదే పనిగా ఫోన్‌ స్క్రీన్‌ చూడటం వల్ల ఎన్నో ఆరోగ్యసమస్యలు తలెత్తవచ్చు. అలాగే.. సెల్ ఫోన్ ఎక్కువ చూస్తే..పక్షపాతం ( స్ట్రోక్) వచ్చే అవకాశం ఉందట. ఇందులో నిజమెంత?   

PREV
16
సెల్ ఫోన్ తో మెదడుకు ముప్పు..

ఈ రోజుల్లో సెల్‌ఫోన్ వాడకం ప్రతి ఒక్కరి జీవితంలో భాగమైంది. చిన్న పిల్లల నుంచి వృద్ధుల వరకు అందరి చేతిలోనూ ఆండ్రాయిడ్ ఫోన్లు కనిపిస్తున్నాయి. అయితే సెల్‌ఫోన్ వాడకం వల్ల కలిగే దుష్పరిణామాలపై వైద్య నిపుణులు ఇప్పటికే ఎన్నో హెచ్చరికలు జారీ చేస్తున్నారు. 

తాజాా సోషల్ మీడియాలో “సెల్‌ఫోన్ వాడితే స్ట్రోక్ వస్తుంది” అనే ప్రచారం జోరుగా సాగుతోంది. అయితే ఇప్పటివరకు సెల్‌ఫోన్ వాడకం నేరుగా స్ట్రోక్‌కు కారణమవుతుందనే శాస్త్రీయ ఆధారాలు లేకపోయినా, పరోక్షంగా మాత్రం కొన్ని జీవనశైలిలో మార్పులు, ఆరోగ్యపరమైన సమస్యల ద్వారా స్ట్రోక్ ముప్పును పెంచే అవకాశముందని నిపుణులు చెబుతున్నారు. ఈ వివరాలేంటో తెలుసుకుందాం.. 

26
స్ట్రోక్ కు దారితీసే పరోక్ష కారణాలు

ఎక్కువసేపు సెల్‌ఫోన్ వాడకం వల్ల శారీరక చలనం తగ్గి, ఒకే స్థానంలో గంటల తరబడి కూర్చునే అలవాటు ఏర్పడుతుంది. దీనివల్ల శరీరానికి అవసరమైన శ్రమ కలగక, వ్యాయామం లేకుండా పోతుంది. దీర్ఘకాలంలో ఇది ఊబకాయం, డయాబెటిస్, బీపీ, గుండె సంబంధిత రుగ్మతలు వచ్చే అవకాశముంది.  ఈ ఆరోగ్య సమస్యల వల్ల స్ట్రోక్ ప్రమాదం పెరుగుతుంది.  2021లో జరిగిన ఒక శాస్త్రీయ అధ్యయనం ప్రకారం.  60 ఏళ్ల లోపువారిలో  ఎక్కువ స్క్రీన్ టైమ్, వ్యాయామం లేని జీవనశైలి గల వారే ఎక్కవగా ఉన్నారనీ, వీరికి  స్ట్రోక్ ప్రమాదం ఎక్కువగా ఉన్నట్లు తేలింది.

36
నిద్రలేమి

ఎక్కువసేపు సెల్‌ఫోన్ వాడటం, ముఖ్యంగా రాత్రిళ్లు, నిద్రలేమికి దారితీస్తుంది. బ్లూ లైట్ మెలటోనిన్‌ను తగ్గించి నిద్రను భంగం చేస్తుంది. నిద్రలేమి వల్ల మానసిక ఒత్తిడి, హైబిపి వంటి స్ట్రోక్‌కి కారణమయ్యే సమస్యలు ఏర్పడతాయి. కాబట్టి రాత్రిపూట సెల్‌ఫోన్ వాడకాన్ని తగ్గించడం అవసరం. 

46
మానసిక ఒత్తిడి, ఆందోళన

సోషల్ మీడియా, ఆన్‌లైన్ ప్లాట్‌ఫామ్‌లలో ఎక్కువ సమయం గడపడం వల్ల మానసిక ఒత్తిడి, ఆందోళన పెరుగుతాయి.  అనవసర ఆలోచనలు, ఆందోళనలు పెరిగి దీర్ఘకాలిక ఒత్తిడిగా మారతాయి. దీని వల్ల స్ట్రోక్ ముప్పు ( పక్షపాతం) పెరిగే అవకాశం ఉంటుంది. అలాగే, సెల్‌ఫోన్‌ను ఎక్కువసేపు వంగి వాడటం వల్ల మెడ, భుజం, వీపు నొప్పులు వస్తాయి. ఇవి నేరుగా స్ట్రోక్‌కు కారణం కాకపోయినా వెన్నెముక సమస్యలకు దారితీయవచ్చు.

56
స్ట్రోక్ కు కారకాలు

స్ట్రోక్‌కు కారణాలు;  హైబిపి, డయాబెటిస్,  అధిక కొలెస్ట్రాల్ ,  గుండె జబ్బులు, మానసిక గందరగోళం, ఊబకాయం, ధూమపానం, మద్యపానం, వ్యాయామం లేకపోవడం, అనారోగ్యకరమైన ఆహారం, జన్యుపరమైన కారణాలు, కుటుంబ చరిత్ర వంటివి ప్రధానంగా కారకాలు.

అయితే, సెల్‌ఫోన్ వాడకం వల్ల వచ్చే రేడియేషన్ నేరుగా స్ట్రోక్‌కు కారణమవుతుందనే శాస్త్రీయ ఆధారాలు ఇప్పటివరకు లేవు. కానీ, సెల్‌ఫోన్ వాడకం వల్ల  జీవనశైలి మార్పులు పరోక్షంగా స్ట్రోక్ ప్రమాదాన్ని పెంచే అవకాశం ఉంది.

66
ఇవి అలవాటు చేసుకోండి

ఎక్కువసేపు సెల్‌ఫోన్ వాడటం వల్ల శారీరక శ్రమ తగ్గిపోవడం, నిద్రలేమి, మానసిక ఒత్తిడి వంటి జీవనశైలి మార్పులు పక్షపాతానికి పరోక్షంగా కారణాలుగా మారుతున్నాయి. కాబట్టి సెల్‌ఫోన్ వాడకాన్ని తగ్గించి, రోజూ త్వరగా నిద్రపోవడం, ఉదయాన్నే లేచి నడక లేదా వ్యాయామం చేయడం, మంచి ఆహారం తీసుకోవడం, 7–8 గంటలు నిద్రపోవడం, యోగా, ధ్యానం చేయడం వంటి ఆరోగ్యకరమైన అలవాట్లను పాటించడం ద్వారా స్ట్రోక్ ప్రమాదాన్ని తగ్గించవచ్చు.

Read more Photos on
click me!

Recommended Stories