మారిపోయిన జీవన విధానాల వల్ల చిన్న వయసులోనే పిల్లలకు ఫాస్ట్ ఫుడ్ కూడా అలవాటు అయిపోతోంది. దీని వల్ల అనేక ఆరోగ్య సమస్యలు చిన్న వయసులోనే వచ్చేస్తున్నాయి. అలాంటి ఫాస్ట్ ఫుడ్ కల్చర్ లో టీ కూడా ఒకటి. ఎందుకంటే టీ తాగడం వల్ల ఎన్నైతే ఉపయోగాలు ఉన్నాయో? కొన్ని దుష్పరిణామాలు కూడా ఉన్నాయి. అవేంటో ఇప్పుడు తెలుసుకుందాం.
టీలో కెఫీన్ ఉంటుంది. ఇది పిల్లలకు నిద్రలేమి, పోషకాహార లోపం వంటి సమస్యలను కలిగిస్తుంది. అందువల్ల పిల్లలకు టీ ఇవ్వడం మంచిది కాదు. టీకి బదులుగా ఇతర ఆరోగ్యకరమైన పానీయాలు ఇవ్వొచ్చని వైద్యులు చెబుతున్నారు.
సాధారణంగా జలుబు, దగ్గు, కడుపు సమస్యలు ఉన్నప్పుడు పిల్లలకు టీ ఇవ్వడం మంచిదని చాలామంది తల్లిదండ్రులు అనుకుంటారు. ఎందుకంటే టీ ఆకుల్లో మూలికా గుణాలు ఉంటాయి. అయితే అందులో మూలికలతో పాటు కెఫిన్ అనే మత్తు పదార్థం కూడా ఉంటుంది. ఇది పెద్దలపై ఒక రకంగా, పిల్లలపై మరో రకంగా ప్రభావం చూపిస్తుంది.
టీ తాగినప్పుడు అందులో ఉండే కెఫిన్ మెదడును ఉత్తేజపరుస్తుంది. దీంతో బ్రెయిన్ యాక్టివ్ గా వర్క్ చేస్తుంది. ఇది పెద్దలకు మంచిదే. కంటిన్యూగా పనిచేసే వారికి నిద్ర రాకుండా బ్రెయిన్ యాక్టివ్ గా వర్క్ చేసేలా చేస్తుంది. అయితే ఇది పిల్లలకు మంచిది కాదు. పిల్లలు టీ తాగడం వల్ల బ్రెయిన్ నిద్రపోకుండా ఎక్కువ సేపు యాక్టివ్ గా ఉంటుంది. దీని వల్ల నిద్రలేమి సమస్య వస్తుంది.
పెద్దలు టీ తాగితే అందులో ఉండే కెఫిన్ శరీరం నుంచి 3, 4 గంటల్లో బయటకు వెళ్లిపోతుంది. కాని పిల్లలు టీ తాగితే వారి శరీరం నుంచి బయటకు వెళ్లడానికి 10 నుంచి 12 గంటలు పడుతుంది.
పిల్లలకు టీ ఇవ్వడానికి కారణాలు
దగ్గు లేదా విరేచనాలను తగ్గడానికి టీ ఆకులను పాలలో మరిగించి ఇస్తుంటారు. అయితే అందులో కెఫిన్ ఉంటుందని చాలా మంది పెద్దలకు తెలియదు. కొన్ని కుటుంబాల్లో టీ తాగే అలవాటు తరతరాలుగా వస్తుంటుంది. అందులో భాగంగా పిల్లలకు కూడా టీ ఇస్తుంటారు. టీ ఆకుల్లో మూలిక గుణాలు ఉంటాయి కనుక ఆరోగ్యానికి మంచిదని పిల్లలకు కూడా ఇచ్చేస్తుంటారు.
టీలో ఉండే కెఫిన్ తో ఆరోగ్య సమస్యలు
శరీరానికి ఐరన్, కాల్షియం చాలా అవసరం. మనం తినే ఆహారం నుంచి శరీరం ఐరన్, కాల్షియం తీసుకుంటుంది. టీ తాగడం వల్ల ఈ చర్య మందగిస్తుంది. ముఖ్యంగా పిల్లల్లో ఎదుగుదల, ఎముకల ఆరోగ్యం దెబ్బతింటుంది.
కెపిన్ పిల్లలను ఎక్కువ చురుకుగా ఉంచుతుంది. దీనివల్ల నిద్రలేమి సమస్య వస్తుంది.
టీ ఒక డైయూరిటిక్‌గా పనిచేస్తుంది. ఇది మూత్ర ఉత్పత్తిని పెంచుతుంది. అందువల్ల టీ తాగే వారు తరచూ యూరిన్ పోసుకోవడానికి వెళుతుంటారు.
టీ తాగడం వల్ల కొంతమంది పిల్లలకు చిరాకు, కోపం లేదా తలనొప్పి కూడా రావచ్చు.
టీకి బదులుగా ఇవి మంచివి
టీకి బదులు పసుపు పాలు తాగడం మంచిది. ఇది రోగనిరోధక శక్తిని పెంచుతుంది. నిద్రను మెరుగుపరుస్తుంది.
పుదీనా టీ, వెచ్చని నిమ్మ, తేనె నీరు కలిపిన టీ పిల్లలకు మంచిది. ఇవి గొంతు నొప్పిని నయం చేస్తాయి. శరీరాన్ని హైడ్రేట్‌గా ఉంచడానికి సహాయపడతాయి.