Beer : ఈ మండుటెండల్లో చల్లని బీర్లు తాగుతున్నారా..? అయితే మీ బాడీకి రిపేర్లు తప్పవు..!

Published : Apr 24, 2026, 01:15 PM IST

మండుటెండల్లో చల్లచల్లని బీర్లు తాగారో మీ బాడీకి రిపేర్లు తప్పవట. ‘’ఎందుకు… బీర్లు తాగితే శరీరం చల్లగా మారుతుంది… వేడి నుండి ఉపశమనం లభిస్తుందిగా'' అంటారా..?. అయితే  మీకు ఈ నిజాలు తెలియాల్సిందే. 

PREV
16
బీర్ ఇంత ప్రమాదకరమా..?

వేసవి తాపం నుండి ఉపశమనం పొందేందుకు చాలామంది బీర్ తాగడానికి ఇష్టపడతారు. మండుటెండల్లో స్నేహితులతో కలిసి కబుర్లు చెప్పుకుంటూ చల్లచల్లగా బీర్ గొంతులోకి దిగుతుంటే.. ఆహా స్వర్గమే అనుకుంటారు. బీర్ తాగితే శరీరమంతా చల్లబడిన ఫీలింగ్ ఉంటుంది. అందుకే వేసవిలో జరిగే శుభకార్యాలకే కాదు అశుభకార్యాలకు కూడా బీర్లు తాగుతుంటారు. తెలంగాణ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు.. కుటుంబమంతా కలిసి బీర్లు తాగుతుంటారు.

అయితే వేసవిలో బీర్ తాగడం ఉపశమనమా? లేక ముప్పా? అన్న చర్చ ప్రస్తుతం జనాల్లో సాగుతోంది. చల్లని బీర్ తాగడం అప్పటికప్పుడు హాయినిచ్చినట్లు అనిపించినా... ఆరోగ్యానికి మాత్రం అంత మంచిది కాదంటున్నారు వైద్య నిపుణులు. ఎండల సమయంలో బీర్ తాగడం వల్ల వచ్చే అనారోగ్య సమస్యలేమిటో ఇక్కడ తెలుసుకుందాం

26
1. డీహైడ్రేషన్ ముప్పు (Dehydration)

ఆల్కహాల్‌కు 'డైయూరిటిక్' (Diuretic) గుణం ఉంటుంది. అంటే మీరు ఎంత ఆల్కహాల్ తీసుకుంటే, అంతకు రెట్టింపు మూత్రం రూపంలో శరీరం నుండి నీరు బయటకు పోతుంది. వేసవిలో ఇప్పటికే చెమట రూపంలో శరీరం నీటిని కోల్పోతుంది, దీనికి తోడు బీర్ తాగడం వల్ల శరీరం మరింత త్వరగా డీహైడ్రేషన్‌కు గురవుతుంది.

36
2. శరీర ఉష్ణోగ్రత పెరుగుదల

మనం బీర్ తాగినప్పుడు రక్తనాళాలు వ్యాకోచిస్తాయి. దీనివల్ల చర్మం ఉపరితలానికి రక్తం ఎక్కువగా చేరుతుంది. అప్పటికప్పుడు చల్లగా అనిపించినా, అంతర్గతంగా శరీర ఉష్ణోగ్రత పెరిగేలా చేస్తుంది. ఇది 'హీట్ స్ట్రోక్' (వడదెబ్బ) వచ్చే అవకాశాలను పెంచుతుంది.

46
3. కిడ్నీ సమస్యలు

శరీరంలో నీటి శాతం తగ్గినప్పుడు రక్తం చిక్కబడుతుంది. ఈ సమయంలో ఆల్కహాల్‌ను వడపోయడం (Filter) కిడ్నీలకు పెద్ద సవాలుగా మారుతుంది. ఇది దీర్ఘకాలంలో మూత్రపిండాల సమస్యలకు దారితీయవచ్చు.

56
4. నిద్రలేమి, అలసట

చల్లని బీర్ తాగిన తర్వాత నిద్ర బాగా వస్తుందని కొందరు భావిస్తారు. కానీ ఆల్కహాల్ వల్ల వచ్చే నిద్ర నాణ్యమైనది కాదు. మరుసటి రోజు ఉదయానికి విపరీతమైన తలనొప్పి, నీరసం, అలసట వచ్చే ప్రమాదం ఉంది... ఈరోజంతా నీరసంగా ఉంటుంది.

66
5. కేలరీల మోత

బీర్‌లో కేలరీలు ఎక్కువగా ఉంటాయి. వేసవిలో శారీరక శ్రమ తక్కువగా ఉన్నప్పుడు వీటిని తీసుకోవడం వల్ల బరువు పెరగడం, పొట్ట రావడం (Beer Belly) వంటి సమస్యలు తలెత్తుతాయి.

అందుకే వేసవిలో దాహం వేసినప్పుడు నీటిని మాత్రమే తాగండి. ఒకవేళ బీర్ తాగాల్సి వచ్చినా, అతిగా తాగకుండా తగినంత నీటిని కూడా వెంటవెంటనే తీసుకుంటూ ఉండాలి. ఆల్కహాల్ సేవించడం ఆరోగ్యానికి హానికరం.

Read more Photos on
click me!

Recommended Stories