Infertility in men: పురుషుల్లో గత కొన్నేళ్లుగా స్పెర్మ్ కౌంట్ తగ్గిపోవడం, ఫర్టిలిటీ రేటు పడిపోవడం పెద్ద సమస్యగా మారింది. జీవనశైలి, ఒత్తిడి, ఫాస్ట్‌ఫుడ్ వంటి కారణాలతోపాటు ఇప్పుడు మరో ప్రమాదకర అంశం బయటపడింది. అదేంటంటే..
తాజా అధ్యయనం ప్రకారం, వ్యవసాయంలో ఎక్కువగా ఉపయోగించే నియోనికోటినోయిడ్ పురుగు మందులు పురుషుల ఫర్టిలిటీపై తీవ్రమైన దుష్ప్రభావాలు చూపుతున్నాయి. 2005 నుంచి 2025 వరకు జరిగిన 21 రీసెర్చ్‌లను పరిశీలించినప్పుడు. ఈ కెమికల్స్‌కు ప్రభావితమైన మగ జంతువుల్లో స్పెర్మ్ సంఖ్య తగ్గింది, స్పెర్మ్ కదలిక బలహీనపడింది, స్పెర్మ్ ఆకారం మారింది, వృషణాల (టెస్టిస్) టిష్యూ నష్టం జరిగింది.
25
ఎందుకు ప్రమాదకరం?
ఈ కెమికల్స్ ఎక్కువగా పంటల్లోకి జీర్ణమైపోతాయి. దీంతో మనం తినే.. పండ్లు, కూరగాయలు, ధాన్యాలు ఎంత కడిగినా, మిగిలిపోయే కెమికల్స్ మన శరీరంలోకి వెళ్తాయి. అమెరికాలో జరిగిన సర్వే ప్రకారం 3 సంవత్సరాల పైబడిన జనాభాలో దాదాపు 50% మంది శరీరంలో ఈ కెమికల్ ఆనవాళ్లు కనిపించాయి. మరీ ముఖ్యంగా పిల్లల్లో ఈ స్థాయి ఇంకా ఎక్కువగా ఉంది.
35
నిపుణులు ఏమంటున్నారంటే.?
ఈ అధ్యయనం నిర్వహించిన శాస్త్రవేత్త సుమయ్యా ఇర్ఫాన్ ప్రకారం.. "ఈ పురుగు మందుల ప్రభావంతో హార్మోన్ల అసమతుల్యత, టెస్టిస్‌లో నష్టం, స్పెర్మ్ క్వాలిటీ తగ్గుతోంది. కాగా మరో పరిశోధకురాలు వెరోనికా జి. సాంచెజ్ చెప్పిన వివరాల ప్రకారం.. "మన భోజనంలో ఉన్న ఈ కెమికల్ అవశేషాలు నెమ్మదిగా ఫర్టిలిటీని తగ్గిస్తాయి. అని చెప్పుకొచ్చారు.
శాస్త్రవేత్తల మాట ప్రకారం.. ఈ స్టడీ జంతువులపై జరిగినప్పటికీ, జంతువుల్లో స్పెర్మ్ తయారీ విధానం, మనుషుల్లో కూడా దాదాపు ఒకే విధంగా ఉంటుంది. అందుకే ఈ రసాయనాల ప్రభావం మనుషుల్లో కూడా ఉండే అవకాశం చాలా ఎక్కువగా ఉంది.
55
శరీరంపై ఎలా ప్రభావం చూపుతుంది?
ఈ పురుగు మందులు శరీరంలో ఆక్సిడేటివ్ స్ట్రెస్ పెంచి స్పెర్మ్ కణాలు, DNA ను దెబ్బతీస్తాయి. హార్మోన్ల నియంత్రణకు ఆటంకం కలుగుతుంది. వృషణ కణజాలానికి హాని జరుగుతుంది. దీంతో స్పెర్మ్ కౌంట్ తగ్గుతుంది, స్పెర్మ్ కదలిక మందగిస్తుంది, ఫర్టిలిటీ శాతం తగ్గుతుంది.