Stampede: తొక్కిస‌లాట‌లో ప్రాణాలు ఎలా కాపాడుకోవాలి.? ఈ ట్రిక్స్ ప్ర‌తీ ఒక్క‌రికీ తెలియాల్సిందే

Published : Jun 09, 2025, 03:59 PM IST

బెంగళూరులో RCB విజయోత్సవ వేడుకల సందర్భంగా జరిగిన తొక్కిసలాట ఘటన యావ‌త్ దేశాన్ని షాక్‌కి గురి చేసిన విష‌యం తెలిసిందే. అయితే ఇలాంటి అనూహ్య ప‌రిస్థితుల్లో మ‌న ప్రాణాల‌ను ఎలా కాపాడుకోవాలి.? ఇందుకోసం ఎలాంటి ట్రిక్స్ పాటించాలో ఇప్పుడు తెలుసుకుందాం..

PREV
15
ప్ర‌శాంతంగా ఉండాలి

తొక్కిసలాట జరిగినప్పుడు పానిక్ అవ‌డం అత్యంత ప్రమాదకరం. ఎంత భయంగా ఉన్నా ప్రశాంతంగా ఉండేందుకు ప్ర‌య‌త్నించాలి. మీ మనస్సు ప్రశాంతంగా ఉంటే మీరు ఆపదకు పరిష్కారం కనుగొనగలరు. పానిక్ అయితే మీరు తడబడి, మరింత ప్రమాదంలో పడతారు.

25
చేతులు ఇలా పెట్టాలి

మీ వెన‌కాల ఉన్న వారు మిమ్మ‌ల్ని నెడుతున్నార‌ని అనిపించిన వెంట‌నే మీ రెండు మోచేతుల‌ను ముందున్న వారికి అనించాలి. దీని వ‌ల్ల మీరు కింద ప‌డ‌కుండా ఉంటారు. తొక్కిస‌లాట‌లో ప్రాణాలు కోల్పోయేది కింద ప‌డ‌డం వ‌ల్లే అని గుర్తుంచుకోవాలి.

35
ఒక‌వేళ కింద ప‌డితే

ఒక‌వేళ కింద ప‌డినా కంగారు ప‌డొద్దు. వెల్ల‌కిలా కాకుండా సైడ్ మీద ప‌డుకోవాలి. త‌ల, ఛాతి, గొంతు భాగంపై ఎవ‌రి కాళ్లు ప‌డ‌కుండా చూసుకోవాలి. ఎక్కువ‌గా శాతం తొక్కిస‌లాట‌లో ఇలాంటి భాగ‌ల‌పై ఒత్తిడి ప‌డ‌డం వ‌ల్లే మ‌ర‌ణిస్తుంటారు.

45
గోడలు, బారికేడ్లకు దూరంగా ఉండాలి

తొక్కిసలాట సమయంలో గోడలవైపు వెళ్ల‌కూడ‌దు. దీంతో గోడ‌కు బ‌లంగా ఢీకొట్ట‌డం వ‌ల్ల గాయాలు ఎక్కువ‌గా జ‌రిగే అవ‌కాశం ఉంటుంది. బారికేడ్ల‌కు కూడా దూరంగా ఉండాలి. వీలైనంత వ‌ర‌కు చివ‌ర్ల‌కు వెళ్ల‌కుండా మ‌ధ్య‌లోనే ఉండేందుకు ప్ర‌య‌త్నించాలి.

55
చేతులు గట్టిగా చాతీ వద్ద

ఎక్కువ మంది ఉన్న చోట్ల శ్వాస ఆడకపోవడం చాలా సాధారణం. అందుకే చేతులు చాతీకి సమాంతరంగా ఉంచండి, దీన్ని బాక్స్ పొజిషన్ అంటారు. ఇది మీ ఛాతిని రక్షించడమే కాకుండా, గాలిని పొందేందుకు సహాయపడుతుంది.

తొక్కిసలాట స‌మ‌యంలో ఏం చేయాలో ఈ వీడియోలో స్ప‌ష్టంగా ఉంది.

Read more Photos on
click me!

Recommended Stories