Breakfast: ప్రతి రోజు ఉదయం ఇది అస్సలు తినొద్దు! లివర్‌ డ్యామేజ్ అవుతుంది

Published : Jun 09, 2025, 03:08 PM IST

Breakfast: ప్రతి రోజు ఉదయం మీరు తినే ఆహారమే ఆ రోజు మొత్తం మీకు సరైన ఎనర్జీ ఇస్తుంది. అలాంటిది ఉదయం టిఫెన్ ఏది పడితే అది తింటే ఆరోగ్యం పాడవుతుంది. ముఖ్యంగా ఒక పదార్థాన్ని టిఫెన్ లా మీరు తింటే లివర్ ప్రాబ్లమ్స్ కూడా వస్తాయట. అదేంటో తెలుసుకుందామా?

PREV
15
ఏది పడితే అది టిఫెన్ లా తినకూడదు

చాలా మంది ఉదయం టీ, కాఫీతో మొదలు పెట్టి దోశలు, పూరీలు, గారెలు ఇలా భారీగా టిఫిన్ తింటారు. కానీ మీరు తినే కొన్ని పదార్థాలు మీ లివర్‌కి హాని కలిగిస్తాయని మీరు ఎప్పుడైనా ఆలోచించారా? ముఖ్యంగా ఫారెనర్స్ ఇష్టంగా తినే ఈ తెల్లటి పదార్థాన్ని రోజూ టిఫెన్ గా తింటే లివర్‌కి హాని కలుగుతుందని ఆరోగ్య నిపుణులు చెబుతున్నారు. ఉదయం టిఫెన్ లా తినకూడని ఆ పదార్థం ఏమిటో తెలుసుకుందాం రండి. 

25
వైట్ బ్రెడ్ తినడం మంచిది కాదు

ఇండియాలో ఇప్పుడంతా ఫారెన్ కల్చర్ నడుస్తోంది. మన వాతావరణ పరిస్థితులకు తగ్గట్టు ఉండాల్సిన లైఫ్ స్టైల్ ఫారెన్ కల్చర్ వల్ల మారిపోతోంది. ఉదయం బ్రష్ చేయకుండా బెడ్ మీదే కాఫీ తాగడం, స్నానం చేయకుండా టిఫెన్ తినడం, భోజనం చేసే ముందు కాళ్లు, చేతులు కడుక్కోవడం ఇలా కచ్చితంగా పాటించాల్సిన ఆరోగ్య సూత్రాలను అందరూ పక్కన పెట్టేశారు. 

ఇందులో భాగంగానే ఉదయం టిఫెన్ లా వైట్ బ్రెడ్ తినడం ప్రారంభించారు. దీన్ని వెన్న లేదా జామ్ తో తినడం అలవాటుగా  చేసుకున్నారు. కాని ఈ అల్పాహారం మన వాతావరణానికి కరెక్ట్ కాదని ఆరోగ్య నిపుణులు చెబుతున్నారు. 

35
వైట్ బ్రెడ్ లో ఇవన్నీ ఉన్నాయి

వైట్ బ్రెడ్ ని ప్రాసెస్ చేసిన పిండితో తయారు చేస్తారు. ఇందులో ఫైబర్ ఉండదు. ప్రాసెస్ చేసిన కార్బోహైడ్రేట్లు అధికంగా ఉంటాయి. మీరు దీన్ని తిన్నప్పుడు, అది శరీరంలో చక్కెరలా పనిచేస్తుంది. దీనివల్ల రక్తంలో షుగర్ లెవల్స్ హఠాత్తుగా పెరుగుతాయి.

ప్రాసెస్ చేసిన కార్బోహైడ్రేట్లను ఎక్కువగా తీసుకోవడం వల్ల లివర్‌లో కొవ్వు పేరుకుపోతుంది. దీన్ని నాన్ ఆల్కహాలిక్ ఫ్యాటీ లివర్ డిసీజ్ అంటారు.

ఎక్కువగా వైట్ బ్రెడ్ తినడం వల్ల ఇన్సులిన్ నిరోధకత పెరుగుతుంది. ఇది టైప్ 2 డయాబెటిస్, లివర్ సమస్యలకు దారితీస్తుంది.

45
వైట్ బ్రెడ్ తింటే వచ్చే సమస్యలు ఇవే

వైట్ బ్రెడ్ అప్పుడప్పుడూ తినొచ్చు కాని.. రోజూ టిఫెన్ లా తినడం ఆరోగ్యానికి మంచిది కాదు. ఇలా తింటే అలసట వస్తుంది. కడుపు ఉబ్బరం పెరుగుతుంది. చర్మం పసుపు రంగులోకి మారడం, ఆకలి లేకపోవడం లాంటి సమస్యలు వస్తాయి. తద్వారా మీరు బలహీన పడతారు. 

55
ఉదయం టిఫెన్ లో ఇవి తింటే మంచిది

ఉదయం ఎంత మంచి టిఫిన్ తింటే అంత ఆరోగ్యం. అందులో చిన్న తప్పు కూడా మీ ఆరోగ్యాన్ని ప్రభావితం చేస్తుంది. మీరు ప్రతిరోజూ వైట్ బ్రెడ్ తింటుంటే ఇప్పుడు బాగానే ఉన్నా నెమ్మదిగా లివర్ డ్యామేజ్ అవడం ప్రారంభమవుతుంది. 

ప్రతి రోజు ఆరోగ్యంగా, మంచి టిఫిన్ తో మొదలవ్వాలి అంటే మీరు ఉదయాన్నే ఓట్స్, మొలకలతో చేసిన ఇడ్లీ, సలాడ్ లాంటివి తీసుకోవడం మంచిది. ఇది మిమ్మల్ని, మీ కుటుంబాన్ని ఆరోగ్యంగా ఉంచుతుంది. 

Read more Photos on
click me!

Recommended Stories