శరీరాన్ని హైడ్రేటెడ్ గా ఉంచుకోవడానికి నీరు తాగడం చాలా ముఖ్యం. అయితే.. అందరికీ ఒకే మోతాదులో నీరు అవసరం అని చెప్పలేం. వారి వయసు, లైఫ్ స్టైల్, వాతావరణం, శారీరక శ్రమపై ఇవన్నీ ఆధారపడి ఉంటాయి.
మనం ఆరోగ్యంగా ఉండటానికి ఆహారం తీసుకోవడం ఎంత ముఖ్యమూ, నీరు తాగడం కూడా అంతే ముఖ్యం. అయితే... మనలో చాలా మంది దాహం వేసినప్పుడు మాత్రమే నీరు తాగుతూ ఉంటారు. కానీ, ఆరోగ్య సమస్యలు రాకుండా ఉండేందుకు, శరీరాన్ని హైడ్రేటెడ్ గా ఉంచుకోవడానికి రోజులో కనీసం 8 గ్లాసుల నీరు తాగాలి అని చాలా మంది నమ్ముతుంటారు. కానీ, నిజంగా ప్రతి ఒక్కరూ 8 గ్లాసుల నీరు తాగాలా? దీని గురించి నిపుణులు ఏమంటున్నారో తెలుసుకుందాం...
శరీరాన్ని హైడ్రేటెడ్ గా ఉంచుకోవడానికి నీరు తాగడం చాలా ముఖ్యం. అయితే.. అందరికీ ఒకే మోతాదులో నీరు అవసరం అని చెప్పలేం. వారి వయసు, లైఫ్ స్టైల్, వాతావరణం, శారీరక శ్రమపై ఇవన్నీ ఆధారపడి ఉంటాయి.
25
పిల్లలు (4–13 సంవత్సరాలు):
పిల్లలకు రోజుకు 1.2 లీటర్ల నుండి 2.6 లీటర్ల వరకు నీటి అవసరం ఉంటుంది. వారు ఆటలాడితే లేదా ఎండలో ఎక్కువసేపు గడిపితే నీటి అవసరం మరింత పెరుగుతుంది. పిల్లలు నీరు తక్కువగా తాగితే చిరాకు, తలనొప్పి, అలసట వంటి లక్షణాలు కనిపించే అవకాశం ఉంది. వాటర్‌మెలన్, దోసకాయ, కమలాపండు వంటి నీరు ఎక్కువగా ఉన్న ఫలాలు కూడా దాహాన్ని తీరుస్తాయి.
35
టీనేజ్ (14–18 సంవత్సరాలు):
ఈ వయసులో శరీర ఎదుగుదల ఎక్కువగా ఉండే కారణంగా నీటి అవసరం పెరుగుతుంది. అబ్బాయిలు రోజుకు 3.3 లీటర్లు, బాలికలు సుమారు 2.3 లీటర్ల వరకు నీరు తాగాలి. హార్మోన్ల మార్పులు, శారీరక శ్రమ, మానసిక ఒత్తిడిని సమతుల్యం చేయడంలో నీటి తాగటం ముఖ్యమైన పాత్ర పోషిస్తుంది.
ఒక సాధారణ మహిళకు రోజుకు సుమారు 2.1 లీటర్ల నీరు అవసరం. ఇది వ్యాయామం, వేడి వాతావరణం లేదా ఉప్పు ఎక్కువగా ఉన్న ఆహారం తీసుకున్నప్పుడు పెరుగుతుంది. నీటి కొరత వల్ల అలసట, శరీర ఉబ్బరం, తీపి తినాలనే కోరికలు కలుగుతాయి. మీ మూత్రం లైట్ యెల్లోగా ఉంటే మీరు బాగా హైడ్రేట్ అయ్యారు అని తెలుసుకోవచ్చు.
పురుషులు:
సాధారణంగా పురుషులు రోజుకు సుమారు 3 లీటర్ల వరకు నీరు తాగాలి. జిమ్‌కు వెళ్లడం లేదా వేడి వాతావరణంలో పనిచేయడం వంటివాటికి ఇది మరింత అవసరం అవుతుంది. నీటి తాగకపోతే పెదాలు పొడిగా మారటం, తలనెప్పులు, అలసట వంటి లక్షణాలు కనిపిస్తాయి.
గర్భిణీ , తల్లులు:
గర్భిణీ స్త్రీలకు సుమారు 2.4 లీటర్లు, పాలు ఇచ్చే తల్లులకు సుమారు 3 లీటర్ల వరకు నీరు అవసరం. ఇది పాలను ఉత్పత్తి చేయడంలో, శరీరానికి పోషకాలు సరఫరా చేయడంలో సహాయపడుతుంది. మలబద్దకం వంటి సమస్యలను తగ్గించడంలో కూడా సహాయపడుతుంది.
55
ఎంత నీరు తాగాలో తెలుసుకోవడం ఎలా?
మీ శరీరం నీటి అవసరాన్ని సిగ్నల్స్ ద్వారా తెలియజేస్తుంది. కింద చెప్పిన సూచనలు మీరు సరైన మోతాదులో నీరు తీసుకుంటున్నారో తెలియజేస్తాయి:
మీ మూత్రం లైట్ ఎల్లో కలర్‌లో ఉంటే – మీరు హైడ్రేట్ అయ్యారు. డార్క్ కలర్ అంటే నీరు తక్కువగా తాగుతున్నారు అని అర్థం. మీకు ఎప్పుడూ దాహంగా అనిపించడం లేదు అంటే.. మీరు నీరు మంచిగా తీసుకొంటున్నారని అర్థం. నీరు సరిగా తీసుకోకపోతే.. తలనొప్పి వస్తుంది. చర్మం డ్రైగా మారిపోతుంది. మూత్రం సరిగా రాదు. ఇలాంటి లక్షణాలు కనిపిస్తే.. నీరు తీసుకోవాలని అర్థం.