Health Tips: ఉదయం పూట మనం చేసే కొన్ని తప్పుల వల్ల రాత్రిపూట నిద్ర దెబ్బతింటుంది. రాత్రిపూట తగినంత నిద్ర లేకపోతే లేదా గాఢనిద్రకు ఆటంకం కలిగితే, దానివల్ల తీవ్రమైన దుష్ప్రభావాలు ఎదుర్కోవాల్సి వస్తుంది. ఇంతకీ ఆ తప్పులేంటో తెలుసుకోండి.
ఉదయం అలారం మోగిన వెంటనే నిద్రలో నుంచి లేవకుండా "ఇంకో ఐదు నిమిషాలు" అని 'స్నూజ్' బటన్ నొక్కడం చాలామందికి అలవాటు. ఇలా చేస్తే కాసేపు విశ్రాంతి తీసుకోవచ్చని భావించినప్పటికీ, వాస్తవానికి ఈ అలవాటు మీ నిద్ర నాణ్యతను తగ్గిస్తుంది. ఇలా పదే పదే చేయడం వల్ల మీరు గాఢనిద్రను పొందలేరు. దీనివల్ల, మీరు ఉత్సాహంగా లేవడానికి బదులుగా, మరింత అలసిపోయి, నీరసంగా ఉంటారు. అలారం మోగిన వెంటనే వెంటనే లేవడమే ఉత్తమ అలవాటు.
27
మంచంలో ఎక్కువ సమయం గడపడం:
రాత్రి నిద్ర సరిగ్గా లేకపోతే ఉదయం అలసటగా అనిపించడం సహజమే. కానీ ఆ కారణంగా ఎక్కువసేపు మంచంలోనే ఉండడం మంచిది కాదు. ఇలా చేయడం వల్ల శరీరానికి శక్తిని ఇవ్వడం కంటే.. మానసికంగా నిరాశ, శారీరకంగా నీరసాన్ని కలిగిస్తుంది. అందుకే, అలారం మోగిన వెంటనే లేచి, తాజా శ్వాసతో రోజును ప్రారంభించడమే సరైన అలవాటు
37
అతిగా కాఫీ తాగడం
ఉదయం నిద్రమత్తు పొయేందుకు చాలామంది ఓ కప్పు కాఫీ తాగుతారు. కాఫీ ఓ ఉత్తేజ పానీయం అయినప్పటికీ, అతిగా తాగితే.. అది మేలు కంటే కీడే ఎక్కువ చేస్తుంది. అతిగా తాగితే నిద్ర రాక, ఆందోళన వంటి సమస్యలకు దారితీస్తుంది. కాఫీ లోని కాఫిన్ చాలా గంటల పాటు శరీరంలో ఉంచబడుతుంది. అలా ఉదయం తాగిన కాఫీ ప్రభావం రాత్రి నిద్రను భంగం చేస్తుంది.
అలసిపోయినప్పుడు వ్యాయామం చేయాలనిపించకపోవచ్చు. కానీ పూర్తిగా మానేస్తే, అది మీ శక్తి స్థాయిని ఇంకా తగ్గించుతుంది. కఠినమైన వ్యాయామాలకన్నా, తేలికపాటి నడక, యోగా లేదా జాగింగ్ చేయడం ఆరోగ్యానికి మేలు. ఈ వ్యాయామాల వల్ల శరీరంలో ఎండార్ఫిన్‌లు విడుదలై శారీరక శక్తి, ఉత్సాహం, మానసిక ఉత్తేజం కలుగుతాయి. అంతేకాకుండా..ఇది రాత్రి గాఢ నిద్ర రావడానికీ ఎంతో సహాయపడుతుంది.
57
తప్పుడు ఆహారాన్ని తీసుకోవడం
నిద్ర తక్కువగా ఉన్నప్పుడు.. శరీరం తక్షణ శక్తి కోసం చక్కెర, కార్బోహైడ్రేట్లు ఎక్కువగా ఉన్న ఆహారాల్ని కోరుతుంది. అయితే ఇవి ఆ సమయంలో ఊహించిన శక్తిని ఇచ్చినా, వెంటనే రక్తంలో చక్కెర స్థాయి పడిపోయి, మరింత అలసట, చిరాకు కలిగిస్తాయి. ఇలాంటి పరిస్థితుల్లో ప్రోటీన్, ఫైబర్, మంచి కొవ్వులు అధికంగా ఉండే ఆహారాన్ని ఎంచుకోవడం ఉత్తమం. పండ్లు, కూరగాయలు, బాదం, వేరుశనగ, విత్తనాలు వంటివి ఆరోగ్యకరమైన ఆహారం తీసుకోవడం వల్ల రోజంతా స్థిరమైన శక్తిని అందుతుంది.
67
ఎక్కువ సేపు ఫోన్ చూడటం :
అలసటగా ఉన్నప్పుడు చాలా మంది ఫోన్, ల్యాప్‌టాప్, టీవీ లాంటి స్క్రీన్‌లను చూస్తూ సమయం గడుపుతారు. కానీ, ఈ స్క్రీన్‌ల నుండి వెలువడే నీలి కాంతి శరీరంలో మెలటోనిన్ ఉత్పత్తిని తగ్గిస్తుంది. మెలటోనిన్ అనేది నిద్రను ప్రేరేపించే హార్మోన్. దీని ఉత్పత్తి తగ్గితే.. రాత్రిళ్ళు మీకు నిద్ర రావడం కష్టం. నిద్ర లేమి మరింత పెరుగుతుంది. అందుకే ఉదయం లేచిన వెంటనే స్క్రీన్‌లకు దూరంగా ఉండటం, సహజ కాంతిలో కొంతసేపు ఉండటం, లేదా పుస్తకం చదవడం మంచి అలవాటు.
77
పగటి నిద్ర ఎక్కువైతే..
రాత్రి నిద్రలేమి కారణంగా పగటిపూట ఎక్కువసేపు నిద్రపోవాలనుకోవడం సహజం. కానీ, 30 నిమిషాలకుపైగా నిద్రపోతే, అది శరీరంలోని సహజ బయోలాజికల్ క్లాక్‌ను దెబ్బతీస్తుంది. ఫలితంగా రాత్రి నిద్ర రాక, నిద్ర సమయంలో గందరగోళం కలగవచ్చు. మీకు నిజంగా అలసటగా అనిపిస్తే.. 15–20 నిమిషాల చిన్న నిద్ర సరిపోతుంది. ఇది మీ శరీరానికి వెంటనే శక్తిని, ఉత్సాహాన్ని అందిస్తుంది.రాత్రి నిద్రను కూడా ప్రభావితం చేయదు.